సాక్షి, హైదరాబాద్: జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో యువకుడు రోషన్‌పై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. కత్తితో యువకుడిపై రౌడీషీటర్ బాల్ రెడ్డి, మరో దుండగుడు కత్తితో దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


