దేశ రాజధానిలో జరిగిన ఒక అనూహ్య సంఘటన. ఐదేళ్ల పసివాడి అమాయకపు చేష్ట అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మహానగరాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న హైరైజ్ బిల్డింగ్ సంస్కృతి ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివరాలు..
ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ సెక్టార్ 62లోని హైరైజ్ అపార్ట్‌మెంట్‌లోని 22వ అంతస్తులో ఒక కుటుంబం నివసిస్తోంది. దంపతులు, ఐదేళ్ల కుర్రాడు ఉంటున్నారు దీంట్లో. శనివారం సాయంత్రం ఈ కుర్రాడు, పని మనిషితో కలిసి పార్కుకు వెళాడు. ఇద్దరూ తిరిగివచ్చారు. అయితే.. ముందుగా ఇంటి లోపలికి వెళ్లిన ఆ కుర్రాడు.. ధబాలున తలుపు మూసేశాడు. అంతే..
అప్పటివరకు తెరుచుకుని ఉన్న డిజిటల్ లాక్ కాస్తా పడిపోయింది. తల్లిదండ్రుల పాస్‌కోడ్‌తో మాత్రమే తెరచుకుని డిజిటల్ లాక్ అది. ఇద్దరూ సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత లాక్ చేసేవారు. మిగిలిన సమయమంతా పూర్తిగా లాక్ కాకుండా ఉంటుంది. దగ్గరగా వేస్తే తలుపు వేసినట్టుగానే ఉంటుంది. గట్టిగా వేయడంతో లాక్ పడిపోయింది. లోపల కుర్రాడు ఒక్కడే ఉండిపోయాడు. పని మనిషి గట్టిగా అరుస్తోంది... పిలుస్తోంది. కానీ పిల్లాడి నుంచి స్పందన నిల్. దీంతో గాభరపడ్డ ఆ పనిమనిషి కుర్రాడి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఈ లోపు...
ఇంట్లో ఉన్న కుర్రాడికి ఏమవుతోందో అర్థం కాలేదు. వెనుకనే పని మనిషి ఇంట్లోకి రాలేదు. ఇల్లంతా ఖాళీ. తీద్దామంటే తలుపు తెరుచుకోవడం లేదు. కాసేపు ఇల్లంతా కలియదిరిగాడు. పక్కింటి వాళ్లను పిలుద్దామనుకున్నాడో ఏమో... బాల్కనీలోకి వచ్చాడు. ఎవరో ఒకరు కనపడకపోతారా అనుకుని రెయిలింగ్‌పైకి ఎక్కాడు. సాయం కోసం అరుద్దామని అనుకున్నాడు. కానీ.. కాలు జారింది. 22వ అంతస్తు నుంచి పడిపోయాడు. క్షణాల్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆ కుర్రాడిని అటుగా వెళుతున్న ఓ వ్యక్తి గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ.. అప్పటికే ఆ పసివాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణైతే చేస్తున్నారు కానీ..


