కర్ణాటక: పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి పల్టీలు కొట్టింది, ఈ దుర్ఘటనలో కారులోని భార్యాభర్తలు అక్కడే మరణించారు. జిల్లాలోని మధుగిరి తాలూకాలోని జడగొండనహళ్ళి వద్ద బెంగళూరు హైవేలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పొరుగునే ఏపీలో ఉన్న మడకశిర తాలూకాలోని గుండంపల్ళివాసులు కృష్ణారెడ్డి (45), జ్యోతి (42) చనిపోగా, కుమారుడు మధుసూదన్‌రెడ్డి (17), బంధువు చిదంబరెడ్డి (45) తీవ్రంగా గాయపడ్డారు.
బెంగళూరు నగరంలోని డాన్‌బాస్కో పాఠశాలలో జ్యోతి ఉద్యోగి. భర్త కూడా బెంగళూరులోనే ఉండేవారు. ఓ జాతరకు సొంతూరికి వెళ్లి కుటుంబంతో కలిసి తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ముందు దారి కనిపించక ప్రమాదం జరిగింది. కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్‌సీపీ వార్డుమెంబరు కావడంతో మృతదేహాలకు పెద్దసంఖ్యలో నేతలు, జనం నివాళులు అరి్పంచారు.


