సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణ ఘటన జరిగింది. వ్యక్తిని హత్యచేసి ఇంట్లోనే పూడ్చేశారు. కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్‌గా గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ హత్యకు గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
కర్ణాటక రాష్ట్రం అత్తిబెలె సమీపంలో గత నెల 27న శ్రీనాథ్ అదృశ్యమయ్యాడు. కుప్పంలో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్‌ను రామకుప్పం మండలం ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ హత్య చేసినట్లు సమాచారం. ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ప్రభాకర్‌పై హత్య కేసు నమోదైంది. మృతుడు శ్రీనాథ్ కుప్పం వాసి కాగా, కర్ణాటకలోని అత్తిబెలెలో స్థిరపడ్డాడు.


