సాక్షి, తిరుపతి జిల్లా: వెంకటగిరిలో దారుణం జరిగింది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. భర్త హరిప్రసాద్‌పై భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది.
భార్య, పిల్లల కోసం హరిప్రసాద్.. ఇవాళ అత్తింటికి వెళ్లగా.. అల్లుడిపై మామ దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో బాధితుడ్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 70 శాతం శరీరం కాలిపోగా.. మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయాకు తరలించారు.


