రావులపాలెం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. పోలీసుల సహకారంతో కూటమినేతలు రెచ్చిపోయారు. రావులపాలెంలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని అడ్డుగోలుగా ఏర్పాటు చేశారు కూటమి నేతలు.
అనుమతులు లేని ప్రాంతంలో విగ్రహం పెట్టడంపై జగ్గిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ప్రదేశంలో ఏ విధమైన విగ్రహం పెట్టకూడదని గతంలో తీర్మానం చేశారు. పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా విగ్రహాన్ని పెట్టడమే కాకుండా జగ్గిరెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గిరెడ్డిని రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


