ప్రకాశం: జిల్లాలోని కురిచేడలో అధికార పార్టీ నేత అరాచకానికి పాల్సడ్డాడు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పితీసుకెళ్లాడు అధికార పార్టీకి చెందిన క్యక్తి. అయితే ఈ ఘటనపై పోలీసుల ఫోక్స యాక్ట్ కేసు నమోదు చేయకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తిని కాపాడే యత్నం చేశారు.
అదే సమయంలో రాజీ పడాలని బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు తీసుకెళ్లకుండా కురిచేడు ఎస్సై కాలయాపన చేస్తున్నాడు. బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని రజక రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం డిమాండ్ చేశారు.


