50 ఏళ్లకే పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్లకే పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పాలి

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

50 ఏళ్లకే పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పాలి

50 ఏళ్లకే పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పాలి

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తోంది. కానీ, 50 ఏళ్లకే పింఛన్ల హామీ ఏమైందో ఎవరూ చెప్పడం లేదు. దాని గురించి కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులెవరూ మాట్లాడటం లేదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారు. అందరూ నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లకే పింఛన్ల పథకం అమలు చేయకపోగా, అప్పటి వరకూ ఇస్తున్న పింఛన్లలో కోత విధించారు.

– షేక్‌ సలీమ్‌, కౌన్సిలర్‌, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు, మార్కాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement