తాడేపల్లి : మన మిత్ర యాప్ పేరుతో సచివాలయ సిబ్బందిని వేధించడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఆ యాప్‌ని జనం వాడకపోతే సిబ్బంది మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈరోజు(బుధవారం, డిసెంబర్ 31) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రదాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ కొత్త యాప్‌లు వాడాలంటే జనం భయపడుతున్నారు. తెలిసి, తెలియక ఏదైనా నొక్కితే అకౌంట్‌లో డబ్బులు పోతున్నాయి. అందుకే చాలామంది యాప్‌లు వాడటం తగ్గించారు.
అటువంటప్పుడు మన మిత్ర యాప్‌ని వాడటం లేదని సచివాలయ సిబ్బందిని ఎందుకు టార్గెట చేస్తున్నారు?, అసలు మన మిత్ర యాప్ వలన ఏం ప్రయోజనం ఉంది?, 20 శాతం మంది కూడా ఆ యాప్‌ని వాడటం లేదు. ఈ కారణంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వేధించటం కరెక్టు కాదు. వాలంటీర్ల వ్యవస్థ ను రద్దు చేసి వారి పనిని కూడా సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారుఉద్యోగుల సొమ్ము రూ.34 వేల కోట్లు వాడుకుని ఇంతవరకు ఇవ్వలేదు. డీఏ, పీఆర్సీ ఊసే లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి ఉద్యోగుల సొమ్ము కాజేస్తారా?’ అని ప్రశ్నించారు.


