శామీర్‌పేట్: ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టిన ఘటన శనివారం శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ ఉత్తమ్ సోనె (31), స్థానికంగా నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా ట్రాక్టర్ నడుపుతూ వెళ్తుండగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్‌జె 17 జిబి 0546 నంబరు గల లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందిగా మరో వ్యక్తి జగదేవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ట్రాక్టర్‌ను లారీ వెనక నుండి అతివేగంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది.
ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్ధం వచి్చందని, దీన్ని బట్టి లారీ వేగాన్ని అంచనా వేయొచ్చని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై సుమారు 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు క్రేన్ సహాయంతో ట్రాక్టర్ భాగాలను రోడ్డుపై నుండి తొలగించారు. ప్రమాద తీవ్రతకి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.


