తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్‌కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది.
కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.
దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు.


