సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


