నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్‌లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు.
⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్‌లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్‌పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు.
⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు.


