జరిమానా కట్టాల్సి వస్తుందని బలవన్మరణం
కరీంనగర్ జిల్లా: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన ఒక యువకుడు కోర్టులో రూ.5వేల జరిమానా కట్టాల్సి వస్తుందన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) స్థానికంగా కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ప్రియాంక, ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుపడ్డాడు.
ఈ నెల 14న పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. మేజి్రస్టేట్ లేకపోవడంతో కేసు వాయిదా పడింది. రూ.5వేల జరిమానా కట్టాల్సి ఉందని, ఎక్కడ నుంచి తేవాలని శనివారం భార్య ప్రియాంకకు చెప్పి బాధపడ్డాడు. మధ్యాహ్నం బెడ్‌రూంలో పడుకుంటానని, పిల్లలను ఇంటి ఎదుట ఆడించాలని భార్యకు చెప్పి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి సూర నాగమ్మ ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు.


