మూఢ నమ్మకాలు.. పిచ్చి నమ్మకాలు బాగా పెరిగిపోయాయి. దోష నివృత్తి పేరుతో సాటి మనుషుల ప్రాణాలే తీస్తున్న ఘటనలు ఎక్కువై పోయాయి. తమకు ఏదో దోషం ఉందని భావించి 16 రోజుల పసికందును నలుగురు మహిళలు పొట్టన పెట్టుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని జోథాపూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
పెళ్లిళ్లు కావడం లేదని..
నలుగురు మహిళలు.. ఒక మేనల్లుడు. అయితే సదరు మహిళలకు పెళ్లిళ్లు కావడం లేదు. పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అంతే తమలో ఏదో దోషం ఉందని, అందుచేత ఆ దోష నివృత్తి అనే మూఢ నమ్మకంతో సొంత మేనల్లుడైన 16 రోజుల పసిప్రాయాన్ని తొక్కి చంపేశారు. వారంతా కలిసి తమ కాళ్లతో ఆ పసికందును తొక్కి హత్యచేశారు.
ఇదంతా ఒక వీడియోలో రికార్డ్ అయ్యింది. ఒక మహిళ పూనకం వచ్చి ఏదో చెబుతున్నట్లు ఉండగా, చుట్టూ మహిళలు కూర్చొని ఉంటారు. ఆ మహిళా ఏదో చెబుతూ ఉంటుంది. వీరంతా ఆమె చెప్పేది ఆసక్తిగా వింటూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక మహిళ తన ఒడిలో పసికందుతో కూర్చొని ఉంటుంది. ఇలా పూనకం వచ్చిన ఆమె ఆదేశానుసారం ఆ పసికందును అక్కడ కూర్చొన్న మహిళలు తొక్కి చంపేశారు.
భ్రూణ హత్యలపైనే నిషేధం విధించిన ఈ కాలంలో.. ఇలా పుట్టిన ఒక బిడ్డను అతిపాశవికంగా చంపేయడం వారి ఆటవిక నాగరికతకు అద్దం పడుతోంది.
వారికి వేసే శిక్ష ఘోరంగా ఉండాలి: యువకుడి తండ్రి
ఇదంతా వరుసకు వదినలు అయ్యేవారు చేసిన పనే అని ఆ పసికందు తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. వారి పెళ్లిళ్ల కోసం ఇలా చేశారంటూ బోరమంటున్నాడు, వారికి పడేశిక్ష అత్యంత కఠినంగా ఉండాలని తండ్రి పోలీస్ అధికారులకు విన్నవించుకుంటున్నాడు. ఈ కేసులో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.


