తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ రెండో వార్డు వలందపేటకు చెందిన సరగడ లక్ష్మణరెడ్డి (42) అనే ప్లంబర్ అప్పుల బాధ తాళలేక శనివారం ఉదయం ఇంటి రెండో అంతస్థులో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పార్వతి ఫిర్యాదు ప్రకారం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా మూడేళ్లుగా తామిద్దరం మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలిపింది. రుణదాతలు తరచూ ఇంటికి వచ్చి డబ్బుల విషయమై గొడవ పడుతున్నట్టు తెలిపింది. ఈ అప్పుల కారణంగా తాము జైలుకు కూడా వెళ్లామని చెప్పింది. రుణదాతలకు డబ్బులు ఇస్తామని గడువు కోరినా వినని కారణంగా తీవ్ర ఆందోళనకు గురయిన లక్ష్మణరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపింది. ఇరుగుపొరుగు వారి సాయంతో ఇంటి తలుపులు బద్దలుకొట్టి సీలింగ్‌కు వేలాడుతున్న మృతుని కిందకు దించారు. భీమిలి ఏఎస్‌ఐ నక్కా శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


