breaking news
Alluri Sitarama Raju District Latest News
-
టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత తప్పనిసరి
● పటిష్టంగా వందరోజుల యాక్షన్ ప్లాన్ ● కలెక్టర్ దినేష్‌కుమార్ పాడేరు : ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులు వచ్చే ఏడాది పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం తన కార్యాలయం నుంచి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులు వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పటిష్టంగా అమలు చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ అమలుతీరును పరిశీలించేందుక ఐటీడీఏల్లో ఏర్పాటు చేసిన మానటరింగ్ సిస్టం ద్వారా పీవోలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించేందుకు తరచూ పోటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో పాఠశాల హెచ్ఎంలు, ఎంఈవోలు ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యశాఖాధికారి రామకృష్ణారావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, మండల విద్యాశాఖ అధికారులు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న శీతల గాలులు
● స్ధిరంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ● జి.మాడుగులలో 5.1 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు స్థానికులు ఇ బ్బందులు పడుతున్నారు. శనివారం జి.మాడుగుల లో 5.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతులు నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసా య పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధిలో చింతపల్లి 8.2 డిగ్రీలు, పెదబయలులో 9.0 డిగ్రీలు, పాడేరులో 9.9 డిగ్రీలు, అరకువ్యాలీలో 10 డిగ్రీలు, హుకుంపేటలో 10.7 డిగ్రీలు, కొయ్యూరులో 12.8 డిగ్రీలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6 డిగ్రీలు, మారేడుమిల్లిలో 11.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 11.5 డిగ్రీలు, అడ్డతీగలలో 14.5 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 13.9 డిగ్రీలు, ఎటపాకలో 14.7 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపారు. ● వారం రోజులగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో శీతలగాలులు విజృంభిస్తున్నాయి. సాయంత్రం మూడు గంటల నుంచి వీటి ప్రభావం ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 10 గంటలు దాటే వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
పాడేరు డీఎస్పీగా అభిషేక్
● బాధ్యతల స్వీకరణ పాడేరు : పాడేరు డీఎస్పీగా అభిషేక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా పని చేసిన షేక్ సహబాజ్ ఆహ్మద్ కాశీబుగ్గ డీఎస్పీగా బదిలీ అయ్యారు. గ్రేహౌండ్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అభిషేక్ ఆయన స్థానంలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, చిన్నారులు, మహిళలపై నేరాలు, అఘాయిత్యల జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేసేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాడేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. ఆయనను సీఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలు
జి.మాడుగుల: పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని డీఈవో రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గాంధీనగరంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యంశాలపై అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. గణితం,సైన్సు, ఇంగ్లీష్ సబ్జెక్టులపై విద్యార్థులను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు. తద్వారా వారి గ్రేడ్లను పరిశీలించారు.వంద రోజుల ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుల నుంచి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు బోధన ప్రణాళిక, పునఃశ్చరణ తరగతులు, ప్రత్యేక కోచింగ్‌పై ఆరా తీశారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న యూనిట్ టెస్టులు, వీక్లీ టెస్టులు, మాక్ పరీక్షల ఫలితాలను పరిశీలించారు. తక్కువ గ్రేడ్లలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యకశ్రద్ధ చూపాలని సూచించారు. అదనపు బోధన తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థి కనీస ఫలితాతు సాధించేలా వ్యక్తిగత శ్రద్ధ అవసరమని ఆయన పేర్కొన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, పరీక్షల దృష్ట్యా సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా, నిరంతర మూల్యాంకనంతో విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇవన్నీ అమలు చేస్తే పదో తరగతి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ బాబూరావుపడాల్, ఎంఈవో–2 వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.డీఈవో రామకృష్ణారావు ఆదేశం -
మన్యం మురిసె.. పర్యాటకం మెరిసే
జిల్లాలోని పర్యాటక కేంద్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే బొర్రా గుహలు, వంజంగి మేఘాల కొండలు, చాపరాయి వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో సందడి చేశారు. దీంతో హోటళ్లు, రిసార్ట్లు అన్నీ పర్యాటకులతో నిండిపోయాయి. ప్రధాన రహదారులన్నీ వాహనాల రాకపోకలతో కిక్కిరిసి పోయాయి. ● కిక్కిరిసిన సందర్శిత ప్రాంతాలు ● నిండిపోయిన హోటళ్లు, రిసార్టులు ● అటవీ, పర్యాటక శాఖలకు భారీగా ఆదాయంసాక్షి,పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. రెండురోజుల నుంచి భారీగా తరలివస్తుండటంతో మన్యం మురిసిపోతోంది. శనివారం అరకులోయ, బొర్రా గుహలు, కటికి జలపాతం, చాపరాయి, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి, చెరువులవేనం, సీలేరు, మోతుగూడెం, మారేడుమిల్లి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ● బొర్రాగుహలను ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 వేలమంది సందర్శించగా రూ.8 లక్షల ఆదాయం వచ్చిందని టూరిజం మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు. ● పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో పర్యాటకులు సందడి చేశారు. వంజంగి కొండలపై సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షించారు. వీరి సందర్శన ద్వారా అటవీశాఖకు ఒక్కరోజే రూ.1,91,260 ఆదాయం వచ్చింది. పర్యాటకుల వాహనాలతో పాడేరు నుంచి అనంతగిరి, విశాఖపట్నం రోడ్డు, చింతపల్లి నుంచి నర్సీపట్నం రోడ్డు రద్దీగా మారాయి. అన్ని హోటళ్లు, రిసార్ట్లు, లాడ్జీలు పర్యాటకులతో నిండిపోయాయి. డుంబ్రిగుడ: అరకు పైనరీ, చాపరాయి సందర్శనకు శనివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సందడి చేశారు. చాపరాయి జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. -
విభిన్న ప్రతిభావంతులకు సముచిత స్థానం
● కలెక్టర్ దినేష్‌కుమార్ ● ఉపకరణాల పంపిణీ పాడేరు : విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో సముచిత స్థానం కల్పించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో విశాఖపట్నం ఎబిలిటీ రీ హెబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులకు వీల్చైర్లు, ఉపకరణాలు పంపిణీ చేశారు. కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన వినిత అనే రెండేళ్ల దివ్యాంగురాలు త్వరగా కోలుకునేలా పౌష్టికాహారం, ఫిజియోథెరపి అందించాలని ఆదేశించారు. శారీరక అంగ వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు జిల్లా ఆస్పత్రిలో రీహెబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరపి, న్యూట్రిషన్ అందిస్తామన్నారు. రీహెబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ దిలీప్పాత్రుడు, కౌన్సిలర్ స్వప్న పాల్గొన్నారు. -
విశాఖ బీచ్.. ఫుల్ రష్
30న జెడ్పీ సర్వసభ్య సమావేశం మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30న జరగనుందని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరుకావాలని కోరా రు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు. విశాఖ: సాగరతీరం పర్యాటక శోభను సంతరించుకుంది. క్రిస్మస్, దానికి తోడు వరసగా సెలవులు రావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి -
సిండికేట్ సెగ
హుకుంపేట సంతలో ధరలు పతనంతో అడవిబిడ్డల ఆవేదనహుకుంపేటలో గిరిజన ఉత్పత్తుల మార్కెట్సాక్షి,పాడేరు: గిరిజన రైతులు కష్టపడి సాగు చేసిన వ్యవసాయ, వాణిజ్య పంటలకు వారపు సంతల్లో కనీస గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు పతనం చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కాఫీ, పిప్పలమోడి, రాజ్మా రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గిరిజనులు వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల అమ్మకాలకు వారపు సంతలకు తీసుకువస్తుంటారు. ఏజెన్సీలో గుర్తింపు పొందిన హుకుంపేట వారపు సంతలో శనివారం దళారి వ్యాపారులదే రాజ్యమైంది. ఇక్కడికి హుకుంపేట, పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, అరకులోయ మండలాలతోపాటు సరిహద్దులోని ఒడిశా గిరిజన రైతులు కాఫీ, రాజ్మా, పిప్పలమోడిని భారీగా తీసుకువచ్చారు. అయితే వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి గిట్టుబాటు ధర లేకుండా చేశారని గిరిజనులు వాపోయారు. వ్యాపారులంతా ఒకే ధర నిర్ణయించడంతో తీసుకువచ్చిన ఉత్పత్తులను తిరిగి ఇళ్లకు తీసుకువెళ్లలేక అమ్ముకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ● బెంగళూరు మార్కెట్లో పాచ్మెంట్ కాఫీ గింజలు కిలో రూ.500 ధర ఉంది. గిరిజన సహకార సంస్థ రూ.450 ధర ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సంస్థ వారపు సంతల్లో కొనుగోలు ఏర్పాటుచేయలేదు. దీంతో వారపు సంతలకు తీసుకువచ్చిన గిరిజనులు దళారి వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. వారు నిర్ణయించిన ధర కిలో రూ.320 అమ్మాల్సి వచ్చింది. ఒక్కరోజు సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ● పిప్పలమోడిని తీసుకువచ్చిన గిరిజన రైతులకు వ్యాపారుల సిండికేట్ దెబ్బ తప్పలేదు. గత సీజన్లో కిలో రూ.380కు కొనుగోలు చేసిన వ్యాపారులు శనివారం కిలో రూ.320కు మించి కొనుగోలు చేయలేదు. సుమారు రూ.30 లక్షల మేర వ్యాపారం జరిగింది. ● సంక్రాంతి పండగకు అదాయ వనరుగా గుర్తింపు పొందిన రాజ్మా గింజలకు కూడా ఈ సంతలో గిట్టుబాటు ధర కరువైంది. గత ఏడాది కిలో రూ.90 నుంచి రూ.100కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ఏడాది మాత్రం కిలో రూ.80కి మించి కొనడం లేదని గిరిజన రైతులు తెలిపారు. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉన్నందున కిలో రూ.110 వరకు ఉండవచ్చని ఆశించామని వారు తెలిపారు. సుమారు రూ.5 లక్షల మేర వ్యాపారం జరిగినా తమకు శ్రమ మాత్రమే మిగిలిందని వారు వాపోయారు. రాజ్మా దెబ్బ.. దిగుబడి తగ్గి ధర పెరుగుతుందని ఆశించిన రైతులకు, గత ఏడాది కంటే తక్కువ ధర (రూ.80) ఇచ్చి వ్యాపారులు మోసం చేశారు. జీసీసీ వైఫల్యం.. ధరలు ప్రకటించి, సంతల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. గతేడాది కన్నా తక్కువ ధర పిప్పలమోడిని గత ఏడాది కన్నా తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేయడం అన్యాయం. గత సీజన్లో కిలో రూ.400కు అమ్ముకున్నా. శనివారం జరిగిన సంతలో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసినా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర పెరగకుండా చేశారు. వారు నిర్ణయించిన కిలో రూ.320కు అమ్ముకోవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర చెల్లించేలా ప్రభుత్వం ఆదుకోవాలి. – గొల్లురి అప్పారావు, గిరిజన రైతు, పనసపల్లి, పాడేరు మండలం రూ.1950 నష్టపోయా డబ్బు అవసరంతో హుకుంపేట సంతలో అమ్మేందుకు కాఫీ గింజలు తీసుకువచ్చా. వ్యాపారులంతా కిలో రూ.320కు కొనుగోలు చేశా రు. ధర తక్కువగా ఉన్నా ఇంటికి తీసుకువెళ్లలేక 15 కిలోలు రూ.4,800కు అమ్ముకోవాల్సి వచ్చింది. సంతలో జీసీసీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే కిలో రూ.450కు అమ్మడం వల్ల రూ.6,750 ఆదాయం వచ్చేది. దీనివల్ల రూ.1,950 నష్టపోయా. – గుల్లెలి భవాని, కాఫీ రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలం వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు కరువు ధర పెరగకుండా కట్టడి చేస్తున్న వ్యాపారులు భారీగా ఆదాయం కోల్పోతున్న గిరి రైతులు భారీగా దోపిడీతో నష్టపోతున్నా పట్టించుకోని జీసీసీ -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చింతపల్లి: మండలంలో సప్తగిరి, రాజుపాకల కాఫీ తోటల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ గాదెగొయ్యి గ్రామానికి చెందిన చంటిబాబు(28) శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై నడిచి వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. భార్య చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వీరబాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న చంటిబాబు అకాల మరణంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
గిరిజన యువతకుఉపాధి కల్పనకు చర్యలు
● జాబ్‌మేళాలలో 59 మందికి ఉపాధి అవకాశాలు ● ఏపీవో రమణ రుంపచోడవరం: ఏజెన్సీలో చదువుకున్న యువతకు ప్రైవేట్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఐటీడీఏ ఏపీవో డి.ఎన్.వి.రమణ అన్నారు. రంపచోడవరం వైటీసీలో శనివారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 112 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 59 మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు ఎంపికై నట్టు ఏపీవో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, నవత ట్రాన్స్‌పోర్టు, టీవీఎస్ సుందరం, ఎల్అండ్టీ, టాటా ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధ సంస్ధ అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
అడ్డతీగల: విద్యాలయాల్లో విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం.నాయక్ అన్నారు.శనివారం ఆయన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి,ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్‌తో కలిసి పాఠశాలలను సందర్శించారు. గురుకుల పాఠశాల,ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి, అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలన్నారు.విద్యతో పాటు ఉపాధ్యాయులు వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు అసౌకర్యంగా ఉండడంతో వెంటనే నిధులు కేటాయించి పనులు చేయించి విద్యార్థినులకు మరుగుదొడ్లు అందుబాటులోనికి తీసుకురావాలని ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ని ఆదేశించారు. మిట్లపాలెంలో మద్యస్తంగా నిలిచిపోయిన చిన్నతరహ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించారు. వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం పరిశీలించి ఉత్పత్తి,పనితీరుని అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌సీని పరిశీలించిన ఎస్టీ కమిషన్ చైర్మెన్ అడ్డతీగల సిహెచ్‌సిని రాష్ట్ర ఎస్టి కమీషన్ చైర్మెన్ సోళ్ళ బొజ్జిరెడ్డి శనివారం పరిశీలించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు.ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను సూపరింటెండెంట్ పండా సతీష్‌ని అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు అదనపు సౌకర్యాల అవసరముంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.గిరిజన సంక్షేమశాఖ డీడీ రుక్మాంగదయ్య, బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎ.స్వప్నకుమారి ఇతర అధికార్లు పాల్గొన్నారు. -
స్లో..లార్!
పీఎం సూర్యఘర్‌కు అంతంతమాత్రంగా స్పందనసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పీఎం సూర్యఘర్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సబ్సిడీ, రుణ సదుపాయంతో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఏపీఈపీడీసీఎల్ ఆశించిన ప్రగతిని సాధించలేకపోతోంది. మరోవైపు.. ఏదో సాధించేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. సోలార్ రూఫ్టాప్లని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలంటూ డిస్కమ్‌లపై పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి.. సోలార్‌పైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 12 శాతం లక్ష్యాన్ని కూడా చేరలేక..! ఈపీడీసీఎల్ పరిధిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారు 3 లక్షల మంది వరకు ఉండగా.. సోలార్ ప్లాంట్లను కేవలం 36 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ అమర్చుకున్నారు. కనీసం 12 శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ పథకం ప్రకారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 36 వేల గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విశాఖ పరిధిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. 200 యూనిట్లు పై చిలుకు విద్యుత్ వినియోగదారులు 1.83 లక్షల మంది విశాఖలో ఉండగా 13,500 కిలోవాట్లు సామర్థ్యంతో 3,750 మంది మాత్రమే అమర్చుకున్నారు. అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మందికి 8,712 కిలోవాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 15 మందికి 48 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు మాత్రమే అమర్చారు. దీంతో అనుకున్న స్పందన లేకపోవడంతో కచ్చితంగా పరిధిలోకి వచ్చే వారందరినీ.. పీఎం సూర్యఘర్ పథకం లోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఈపీడీసీఎల్ ఉద్యోగులు బేజారవుతున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాల కంటే సూర్యఘర్ ఒత్తిడే ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామనీ.. ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన తర్వాత.. పాడైతే.. దాన్ని బాగుచేసేందుకు అధిక భారం పడుతుందనీ.. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదనీ.. అయినా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సర్కిల్ పరిధిలో 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగదారులు1.83 లక్షల మంది విశాఖలో సోలార్ ప్లాంట్లు అమర్చుకున్నది3,750 (13,500 కిలోవాట్లు) అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మంది (8,712 కిలోవాట్లు) అల్లూరి సర్కిల్ పరిధిలో15 మంది (48 కిలోవాట్లు)కరెంట్ అమ్మితే మీకే లాభం అని చెప్పండహో..! అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఎఫ్‌పీసీసీఏ చార్జీలంటూ బిల్లు చూస్తే గుండె గుభేల్మనిపించేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసన్న ఆయన ఓవైపు విద్యుత్ బిల్లుల్ని అమాంతం పెంచేసి.. మరోవైపు.. సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరించేందుకు యత్నిస్తున్నారు. సోలార్ రూఫ్‌టాప్ పెట్టుకుంటే బిల్లు కట్టకపోవడంతో పాటు కరెంటు అమ్ముకొని లాభాల్ని పొందొచ్చంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెలకు 360 నుంచి 450 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు విక్రయించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు వివరించాలంటూ ఉద్యోగుల్ని ఆదేశించారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్లవారీగా టార్గెట్స్ విధించారు. నిర్దేశించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తుండటంతో.. పీఎం సూర్యఘర్ అధికారుల మెడపై కత్తిగా మారింది. టార్గెట్ పూర్తి చేయలేదని కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల చిర్రుబుర్రు తలనొప్పిగా మారిందంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పటివరకు డిస్కమ్ పరిధిలో 36 వేల మంది ఏర్పాటు -
మూగబోయిన సెల్ సేవలు
● కండ్రుమ్, కితలంగి పంచాయతీల్లో స్తంభించిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ వ్యవస్థ ● సచివాలయ సేవలకు అంతరాయం డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్, కితలంగి పంచాయతీల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ సేవలు స్తంభించాయి. దీంతో గత 20 రోజులగా సిగ్నల్ వ్యవస్థ పనిచేయక స్థానికులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు వారి ఉద్యోగ రీత్యా ముఖ హాజరు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కితలంగి పంచాయతీలోని కితలంగి, కోంతుగుడలలో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా సెల్ సిగ్నల్స్ అందడం లేదని, దీంతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతమంటున్నారు. సెల్ సిగ్నల్ కోసం సమీపంలోని కొండపై వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ విషయమై కితలంగి పంచాయతీ సర్పంచ్ వరబోయిన సుబ్బారావు శనివారం అరకులోయలో ఉన్న బీఎస్ఎన్ఎల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బీఎస్ఎన్ఎల్ సేవలు పునరుద్ధరించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
చలిమంటకువృద్ధురాలికి గాయాలు
రాజవొమ్మంగి: చలి నెగడు నుంచి మంటలు ఎగసి మండలంలోని అప్పలరాజుపేటకు చెందిన కేదారి అప్పయమ్మ (70) శనివారం తీవ్రంగా గాయపడింది. అప్పయమ్మ ఒంటరిగా ఓ పాకలో నివసిస్తోంది. ఆమె ఏర్పాటు చేసుకొన్న చలి మంట నుంచి అర్ధరాత్రి అగ్నికీలలు పైకి ఎగసి ఆమె శరీరంపై, దుస్తులు, మంచంపై పడి కాలిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. శనివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి ఆమెకు సపర్యలు చేశారు. స్థానిక ఆశ వర్కర్ రత్నం, అంగన్వాడీ కార్యకర్త కుమారి అప్పయమ్మను 108 సహాయంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించారు. డాక్టర్ శివారెడ్డి ప్రథమ చికిత్స అందజేశారు. అప్పయమ్మకు 72 శాతం కాలిన గాయాలయ్యాయని, మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. నిరుపేద గిరిజన మహిళ అయిన అప్పయమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజు బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు. -
ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తులసిపాక సమీపంలోని దుర్గమ్మ గుడివద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గోకవరం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసు రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్లేందుకు మధ్యాహ్నం 1.50కు బయలుదేరింది. ఘాట్‌రోడ్‌లోని దుర్గమ్మ గుడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కల్వర్టును బస్సు ఢీకొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కల్వర్టు వల్ల నిలిచిపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు రేడియేటర్ పగిలిపోవడంతో డ్రైవర్ బస్సును అతికష్టంతో తులసిపాక వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కొంతమంది ప్రయాణికులు ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు. మిగిలిన వారు తరువాత వచ్చిన బస్సులో గమ్యస్థానాలకు వెళ్లారు. ఇటీవల ఇదే ఘాట్రోడ్లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో తొమ్మిది మృతి చెందిన నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కాకుండా ఘాట్‌రోడ్డులో మరో చోట జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని వారు పేర్కొన్నారు. లారీని తప్పించబోయి కల్వర్టును ఢీకొన్న బస్సు -
30 నుంచి గిరిజన యవ సమ్మేళనం
ఏయూక్యాంపస్: విశాఖ వేదికగా ఈ నెల 30 నుంచి జనవరి 5వ తేదీ వరకు 17వ జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వర రావు తెలిపారు. శనివారం బీచ్‌రోడ్డులోని సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఏపీ రాష్ట్రాలకు చెందిన 200 ఆదివాసీ యువత పాల్గొంటారన్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, కళలు, ప్రదర్శిస్తారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయన్నారు. మై భారత్ రిసోర్స్ పర్సన్ ఎన్.నాగేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్.లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మంచు ముసుగులో మన్యం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో దట్టంగా పొగమంచు కురుస్తుంది.ఉదయం 9గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. వాహనచోదకులు హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు.రోజు రోజుకు చలి తీవ్రత కూడా పెరుగుతుంది.సాయంత్రం 4గంటల నుంచి చలి మొదలవుతుంది.చలి నుంచి ఉపశమం పోందేందుకు గ్రామాల్లో గిరిజనులు చలి మంటలు వేసుకుంటున్నారు. చలి,మంచుతో అవస్థలు పడుతున్నారు. డుంబ్రిగుడ: మండలంలోని పోగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉష్ణొగ్రతల సంఖ్యకు పడిపోతున్నయి. దట్టమైన మంచుకారణంగా గిరిజనులు, విద్యార్ధులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతు చలిమంటలను ఆశ్రయిస్తు చలికాస్తున్నరు. పాఠశాలలకు వెల్లే విద్యార్ధులు మంచుకు వణుకుతు పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం డుంబ్రిగుడలో అధిక పోగ మంచుతో కూరగాయాలు ఇతర పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని గిరిజనులు అంటున్నారు. చలితో ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నరు. -
దంతేవాడ వరకే కిరండూల్ పాసింజర్
తాటిచెట్లపాలెం: కె.కె.లైన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే కిరండూల్ పాసింజర్ ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28, 29, 30, 31 జనవరి 1, 2, 4, 6, 7, 8, 10వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 29, 30, 31 జనవరి 1, 2, 4, 6, 7, 8, 9, 11వ తేదీల్లో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు. -
● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం
కొండల వెనుక నుంచి వచ్చే ఆ వెలుగు చారలు, నిశ్చలంగా ఉన్న నీటిపై పడి ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న అసలైన ప్రశాంతతను చూడాలంటే ఇలాంటి ప్రదేశాలకు రావాల్సిందే. పడవలు తీరానికి చేరుకున్న వేళ, ఆకాశం గులాబీ రంగును పులుముకున్న వేళ... ఈ దృశ్యం మనసులోని అలజడిని తగ్గించి, ఉత్తేజాన్ని ఇస్తుంది. బిజీ జీవితం నుంచి కాసేపు విరామం తీసుకుని, ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టులోని మత్స్యగెడ్డ ప్రాంతం చక్కని ప్రదేశం. – ముంచంగిపుట్టు -
ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్‌గా కృష్ణవేణి
నర్సీపట్నం : నేషనల్ బాక్సింగ్ క్రీడాకారిణి కె.కృష్ణవేణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్‌గా ఉద్యోగం సాధించింది. బాక్సర్‌గా 14కు ఫైగా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ చెస్ బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే 15కు పైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో 10కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది. నర్సీపట్నం ప్రభుత్వ జెడ్పీ గరల్స్ హైస్కూల్లో చదువుకుని ఆమె బాక్సింగ్ నేర్చుకుంది. తండ్రి శ్రీను కరాటే క్రీడాకారుడు కావడంతో ఆమెను బాక్సింగ్ క్రీడాకారిణిగా రాణించేందుకు ప్రోత్సహించారు. విద్యార్థి దశ నుంచి నింజాస్ అకాడమీ కోచ్ అబ్బు వద్ద బాక్సింగ్‌లో తర్ఫీదు పొందింది. కోచ్‌గా ఉద్యోగం రావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అకాడమీ మెంబర్లు హర్షం వ్యక్తం చేశారు. -
మమతలు విరిసిన వేళ..
సాక్షి, పాడేరు: జిల్లా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గజగజ వణికించే చలిని, దట్టమైన పొగమంచును లెక్కచేయకుండా క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొండకోనల్లోని ప్రార్థనా మందిరాలు విద్యుత్ వెలుగులతో జిగేల్మన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి. ● ఏజెన్సీలోనే అత్యంత పురాతనమైన సుంకరమెట్ట చర్చితో పాటు, పాడేరులోని చారిత్రక సీబీఎం చర్చి భక్తులతో కిక్కిరిసిపోయాయి. బయట ఉష్ణోగ్రతలు పడిపోతున్నా, లోక రక్షకుని రాకను కొనియాడుతూ భక్తులు చేసిన ప్రార్థనలు ఆధ్యాత్మిక వెచ్చదనాన్ని పంచాయి. గురువారం ఉదయం పాస్టర్లు లోక కల్యాణార్థం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుక కేవలం కేక్ కటింగ్, విందులకే పరిమితం కాలేదు. పలు క్రైస్తవ కుటుంబాలు, పాస్టర్లు కలిసి పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టి క్రీస్తు బోధించిన ప్రేమను చాటుకున్నారు. తమ ఆనందాన్ని తోటివారితో పంచుకోవడమే నిజమైన క్రిస్మస్ అని నిరూపించారు. ● పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భవిష్యత్ వైద్యులు పండగను వినూత్నంగా జరుపుకున్నారు. విద్యార్థులు సొంతంగా రూపొందించిన క్రిస్మస్ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. చదువుతో పాటు సాటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండాలనే సందేశం అక్కడ ప్రతిధ్వనించింది. కొండ ప్రాంతాల్లో కురిసిన మంచు బిందువుల సాక్షిగా.. ఏజెన్సీ ప్రజలు శాంతి, సోదరభావంతో జరుపుకున్న ఈ క్రిస్మస్ వేడుకలు అందరిలో కొత్త ఆశలను నింపాయి. -
ఘనంగా పగల్‌పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలుసింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకిలో వేంజేపచేశారు. తెల్లవారుజామున ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో తిరువీధి వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 10వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. -
నోరు అదుపులో పెట్టుకో.. ఖబడ్దార్!
రంపచోడవరం: తన వ్యక్తిగత జీవితం గురించి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని.. ఇక ముందు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఘాటుగా హెచ్చరించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఇంత చేతకాని, దద్దమ్మ ఎమ్మెల్యే ఎవరూ లేరని విమర్శించారు. రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరంలోని ఎంపీపీ ఇంటి వద్ద గురువారం నినిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్సీపీతో పాటు వారిపై ఎమ్మెల్యే పలు విమర్శలు చేసిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఏం చేశావ్.. : రంపచోడవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే వాతావరణం పడటం లేదని రాజమహేంద్రవరం మకాం మార్చేసి, ప్రజలు గురించి పట్టించుకోని నీకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసెంబ్లీలో గళం విప్పడం వల్లే పోలవరం నిర్వాసితులకు డబ్బులు వచ్చాయని చెబుతున్న నీకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు. 2014–19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 5,500 పీడీఎఫ్‌లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించామన్నారు. కాంటూరు 41లో ఉన్న విలీన మండలాల్లో గ్రామసభలు నిర్వహించి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా కేంద్రానికి నిధులు కోసం పంపడం జరిగిందన్నారు. ఎన్నికల సమీపించడం, కేంద్రం డబ్బులు విడుదల చేయకపోవడం జరిగిందన్నారు. ఎన్నికల తరువాత కేంద్రం డబ్బులు విడుదల చేసిందని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. వరదల్లో కిలో బియ్యమైనా ఇవ్వగలిగావా? నీ పదవీ కాలంలో రెండుస్లారు వరదలు వస్తే ఒక్కరికై నా కేజీ బియ్యమైన ఇవ్వగలిగావా అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. జీవో నెం. 3 కోసం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ 2020లో వైఎస్సార్ సీపీ వేసిందని, కనీస అవగాహన లేని మాటలు శిరీష మాట్లాడుతుందన్నారు. గండి పోశమ్మ తల్లి ఆలయం మునిగిపోకుండా చుట్టూ నిర్మాణానికి ప్రతిపాదించడం, దీనిలో భాగంగా కర్ణాటకలోని సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. నాటి వైఎస్సార్ సీపీ కృషి ఫలితమే నేడు నిధులు విడుదలకు కారణమన్నారు. దిగుజారుడు వ్యాఖ్యలు మానుకో.. చింతూరు ఆసుపత్రికి జీవో రాకుండా వంద పడకల ఆసుపత్రి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కూటమిలో నీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలన్నారు. కనీసం ఒక మండల పార్టీ అధ్యక్షుడుని కూడా పెట్టుకోలేని పరిస్ధితిలో ఉన్నావని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ నీ గ్రాఫ్ పెంచుకునేందుకు దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 12 ఏళ్ల క్రితం స్టేజిలపై రికార్డింగ్ డ్యాన్సులు చేశావని, ఇప్పటి వరకు నీ వ్యక్తిగత గురించి మాట్లాడలేదన్నారు. అంబులెన్స్ సర్వీసుకు నెలకు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్న నీవు వీటిని ఎలా సమకూర్చావని ప్రశ్నించారు. గౌరవవేతనం కింద ఇప్పటివరకు రూ.33 లక్షలు పొందావని, మిగతా డబ్బులు నీ భర్త భాస్కర్ ఉద్యోగాల పేరుతో మోసాలు, గంజాయి వ్యాపారం చేసి సంపాదించినవా అని ధ్వజమెత్తారు. ఒకే వర్క్‌ను ఇద్దరికి అమ్మిన ఘనులు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆమె భర్త భాస్కర్ ఒక నామినేటెడ్ వర్క్‌ను ఇద్దరు కాంట్రాక్టర్లకు పర్సంటేజీలకు అమ్మిన ఘనులని ఎమ్మెల్సీ అనంతబాబు విమర్శించారు. నామినేటెడ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు ఎమ్మెల్యే శిరీషదేవికి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు హెచ్చరిక ఆమె విమర్శలపై ఘాటుగా సమాధానం -
ప్రాణం ఉండగానే జీవశ్చవంలా!
పాడేరు ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిషేధం ఉన్నప్పటికీ, ముఠాలు సిండికేట్‌గా మారి మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తులపుట్టు సంత ఈ అక్రమ దందాకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతి గురువారం జరిగే ఈ సంతలో వ్యాపారులు తిష్టవేసి, గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారు. రూ. 20 వేల విలువైన పశువులను సగం ధరకే కొనుగోలు చేస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారు. ఒక్కో మినీ వ్యాన్‌లో 10కి పైగా పశువులను అత్యంత క్రూరంగా కుక్కి, పైకి లేవకుండా కట్టేసి రవాణా చేస్తున్నారు. వాటి దుస్థితి చూసి పెంచిన రైతులు సైతం కన్నీరు పెడుతున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాల వరకు అనేక చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, ఎక్కడా తనిఖీలు జరగకపోవడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే సుమారు రూ. 30 లక్షల విలువైన పశువుల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లోని కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు. తనిఖీలు లేని చెక్‌పోస్టులు, అధికారుల ఉదాసీనత కారణంగా ఏజెన్సీలో పశుసంపద కబేళాల పాలవుతోందని పశు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దర్‌ను వివరణ కోరగా కబేళాలకు పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై తగిన ఆదేశాలిస్తామని ఆయన పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు -
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడుకు నివాళి
సాక్షి,పాడేరు: దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని మణికంఠ కాంప్లెక్స్ వద్ద ఆయన విగ్రహానికి కుమార్తె, పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్భ నరసింగరావు దంపతులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పలు పార్టీల నేతలు తరలివచ్చారు. పేదలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి చిట్టినాయుడు పాడేరుతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు అబ్బాయిదొర, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త సింహాచలం నాయుడు, అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త సుబ్బారావు, సర్పంచ్ వెంకటరమణరాజు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్తాడి రామారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టగుళ్లి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
బస్తరు బేజారు
అది అడవి తల్లి ప్రసాదించిన ఎటువంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన సేంద్రియ పంట. కానీ, ఆ పంటను నమ్ముకున్న గిరిజన రైతుకు మాత్రం మిగిలేది కన్నీళ్లే. పెదబయలు ఏజెన్సీలో ప్రాణాలకుతెగించి సేకరిస్తున్న బస్తరు పిక్కల ధర అమాంతం పడిపోవడంతో గిరిజన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధర రూ. 300 నుంచి రూ. 80కి పడిపోవడం గిరి పుత్రుల ఆశలపై నీళ్లు చల్లింది కిలో పిక్కల ధర రూ.300 నుంచి రూ.80కు పతనంబొంగదారి గ్రామంలో సేకరించిన బస్తరు పిక్కలు వొలుస్తున్న ఓ కుటుంబంపెదబయలు: ఏజెన్సీలో గిరిజన రైతులకు నవంబర్, డిసెంబర్ మాసాలు ఆదాయాన్ని ఇచ్చే కాలం. కొండ కోనల్లో సహజసిద్ధంగా పెరిగే బస్తరు పిక్కల సేకరణే వీరి ప్రధాన వృత్తి. ఎటువంటి రసాయనాలు లేకుండా పండే ఈ సేంద్రియ పంటకు మైదాన ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, గిరి రైతుకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధర అమాంతం పడిపోవడంతో గిరిజన కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. కష్టమెక్కువ.. ప్రతిఫలం తక్కువ! : బస్తరు పిక్కల సేకరణ సామాన్యమైన విషయం కాదు. నిటారుగా ఉండే కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తయిన చెట్లపైకి ఎక్కి వీటిని సేకరించాలి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు రోజంతా కష్టపడితే ఒక్కొక్కరు 5 నుంచి 7 కిలోల పిక్కలను మాత్రమే సేకరించి, ఒలవగలరు. ఇంత కష్టపడి మార్కెట్‌కు తీసుకెళ్తే, అక్కడ దళారుల దెబ్బకు రైతులు విలవిలలాడుతున్నారు. ● ధర కుప్పకూలడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల ప్రారంభంలో కిలో రూ. 300 పలికిన బస్తరు పిక్కల ధర, ప్రస్తుతం రూ. 80కు పడిపోయింది. మండల కేంద్రమైన పెదబయలు సంతలో కిలో రూ. 70 నుంచి రూ. 80 మాత్రమే ధర పలుకుతోంది. ఇక్కడ ధర లేదని ఆశతో పాడేరు వెళ్తే అక్కడ కూడా కిలో ధర రూ. 90కు మించడం లేదు. వచ్చిన ధర కాస్తా రవాణా ఖర్చులకే సరిపోతోందని, చేతికి చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. ● ఇతర రాష్ట్రాల్లోనూ, మైదాన ప్రాంతాల్లోనూ ఈ బస్తరు పిక్కలకు కూరల్లో వాడకానికి విపరీతమైన గిరాకీ ఉంది. అక్కడ కిలో రూ. 300కు పైగా విక్రయిస్తున్నారు, అసలైన రైతుకు మాత్రం కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ఐటీడీఏ జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి సేకరించినా దక్కని ఫలితం సంతల్లో తూనికల దగ్గర జరుగుతున్న అన్యాయం ప్రభుత్వం, ఐటీడీఏ జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ మోసాలను అరికట్టాలి గత నెలలో రూ. 300 ఉన్న ధర ఇప్పుడు రూ. 80కు పడిపోయింది. కుటుంబం అంతా కలిసి కొండల వెంబడి తిరిగినా కష్టానికి తగిన ఫలితం లేదు. సంతల్లో తూనికల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. రవాణా ఖర్చులు పోను కిలోకు రూ. 50 కూడా మిగలడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. – కిల్లో రాంబాబు, రైతు, పందిగుంట, పెదబయలు మండలం -
వెలుగురేఖ సమైక్య
ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నా. – రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు! ‘మాది రాజాం. మా అమ్మ ఐస్‌క్రీం పార్లర్లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్‌గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా. – భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ’సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం. ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది. – సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం ప్రతి అడుగులో తోడున్నారు! రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈ)లో జూనియర్ ఇంజనీర్‌గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ. –దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కరపత్రం నా జీవితాన్ని మార్చింది! బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్‌కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ సార్ నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్‌లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్‌గా స్థిరపడ్డా. – షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ పేద విద్యార్థులకు బాసట దత్తత తీసుకుని ప్రోత్సాహం రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం కొనసాగిస్తున్న సేవాయజ్ఞం వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు ఆహుతి
దేవరాపల్లి : మండలంలోని ములకలాపల్లిలో ఓ ఇంటిలో గురువారం చోటుచేసుకున్న విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ ఈశ్వరమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల నగదు, 8 తులాల మేర బంగారు అభరణాలు, వెండి అభరణాలు, సర్ధిఫికెట్లు, ఇంటిలో ఇతర సామాగ్రి సహా అగ్నికి ఆహుతయ్యాయి. వెరసి సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్ ఈశ్వరమ్మ కుమారుడు అప్పాసాహెబ్ ఇటీవల మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. క్రిస్మస్ సెలవు కావడంతో అప్పాసాహెబ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అదే ఇంటిలో ఉంటున్న తన బావ, అక్క కలిసి గురువారం మాంసం దుకాణం వద్దకు వెళ్లగా, అప్పాసాహెబ్ తన పిల్లలతో కలిసి చోడవరం వెళ్లారు. దీంతో అతని తల్లి ఇంటికి తాళం వేసి పొలం పనికి వెళ్లిపోయింది. ఎవరూ లేని సమయంలో ఈశ్వరమ్మ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులతో పాటు చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకొని చూడగా అప్పటికే ఇళ్లంతా కాలి బూడిదయ్యింది. తిండిగింజలు సహా బూడిద... ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంక్‌లో కొంత బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 2 లక్షలు, తన మేనల్లుడు రఫీ వ్యాపారం నిమిత్తం అప్పుగా తెచ్చిన మరో రూ. 2 లక్షలు, తన తల్లి దాచుకున్న రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, వెండి అభరణాలు కాలిబూడిదయ్యాయని బాధిత ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు భోరున విలపించారు. వీటితో పాటు సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు, గృహోపకరణాలు సహా తిండి గింజలు ఇతర సామగ్రి పూర్తిగా కలిబూడిద కావడంతో కట్టుబట్టలతో వారంతా రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... తన కుమారుడికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో తన కష్టాలు గట్టెక్కాయని ఆనందపడుతున్న తరుణంలో ఇళ్లు, ఇంటిలో ఆస్తి కాలి బూడిదవ్వడంతో బాధిత షేక్ ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. -
●భక్తులతో కిక్కిరిసిన సింహగిరి
సింహగిరి గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శన క్యూలు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల, ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులు, అన్నప్రసాద భవనం ఎక్కడ చూసినా జనమేజనం. అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు సింహగిరికి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. లోవతోట, సింహగిరి బస్టాండ్ ఏరియా, పీఆర్వో కార్యాలయం, గజపతిసత్రం, హిల్‌టాప్ రోడ్డులో వాహనాల పార్కింగ్ చేసినా ట్రాఫిక్ సమస్య తీరలేదు. – సింహాచలం -
27న భీమిలిలో జాబ్ మేళా
మురళీనగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొని 800కి పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అర్హత ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డ్‌తో హాజరు కావాలని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 901475 8949 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. అదే రోజు భీమిలి పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్‌లో ఐటీ సెక్టార్‌కి చెందిన సెక్యూరిటీ అనలిసిస్ట్ కోర్స్‌లో చేరడానికి ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ అర్హత కలిగి ఆసక్తి కలిగిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. -
అనుమానమే ఉసురు తీసింది..
యలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్‌నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలో ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్‌తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన మాయ స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు.మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని,నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
వేంకటాద్రిపై ధనుర్మాస వైభవం
పెందుర్తి: ‘మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవము పొందిన తల్లీ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాటనైనా పలుకవా! పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమీలేని మావంటివారం మంగళము పాడిననూ ‘పఱ’అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఒసంగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ! మాకందరకు శిరోభూషణమైనదానా! నిద్ర నుంచి లేచి మైకము వదిలించుకొని, తేరుకుని వచ్చి తలుపు తెరువుము. నీ నోరు తెరచి మాటాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనమునిమ్ము’అంటూ గోదాదేవి సన్నిధిలో 10వ పాశుర పఠనాన్ని అర్చకులు తాత్పర్య సహితంగా విన్నవించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్థానిక వేంకటాద్రి క్షేత్రంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో 10వ రోజు విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారిని మేల్కొలిపి హారతి ఇచ్చి సేవాకాలం జరిపారు. శాత్తుమురై, తిరుప్పావై పఠనం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ప్రవచనకర్త కలగ మురళీకృష్ణశర్మ ప్రవచనం వినిపించారు. ఈవో నీలిమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పూజల్లో పాల్గొన్న అశేష భక్త జనానికి ప్రసాద వితరణ చేశారు. -
హైవేపై టిప్పర్ దగ్ధం
యలమంచిలి రూరల్ : షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధమైన ఘటన యలమంచిలి మండలం పులపర్తి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీ39యూవై0459 నంబరు గల టిప్పర్ అన్నవరంలో బొగ్గు అన్లోడ్ చెసి తిరిగి విశాఖపట్నం వెళ్తుండగా పులపర్తి వద్దకు చేరుకున్న సమయంలో ఇంజన్ నుంచి పొగలు, మంటలు వస్తున్నట్టు గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపి కిందకు దిగిపోయాడు. కొద్దిసేపటికే వాహనమంతా మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో సమాచారం అందుకున్న యలమంచిలి విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది అగ్నిమాపక శకటంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. హైవేపై రాకపోకలు సాగించే వాహనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక కేంద్రం అధికారి రాంబాబు తెలిపారు. -
నేటి నుంచి అమల్లోకికొత్త రైల్వే చార్జీలు
తాటిచెట్లపాలెం(విశాఖ): భారతీయ రైల్వే ప్రకటించిన సవరించిన ప్రయాణ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు కొత్త చార్జీల వివరాలను వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై స్వల్ప భారం పడనుండగా, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, సామాన్యులకు మాత్రం రైల్వే శాఖ ఊరటనిచ్చింది. ● సబర్బన్/సీజన్ టికెట్లకు మినహాయింపు: సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి, మంత్లీ సీజన్ టికెట్ కలిగిన వారికి చార్జీలలో ఎటువంటి పెంపు లేదు. ● స్వల్ప దూర ప్రయాణికులకు ఊరట: ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి పాత చార్జీలే వర్తిస్తాయి. వీరిపై ఎటువంటి అదనపు భారం ఉండదు. ● ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. ● మెయిల్/ఎక్స్‌ప్రెస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
గెలుపు ఓటములు సహజం
● డీఈవో రామకృష్ణారావు పాడేరు రూరల్: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని డీఈవో రామకృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి ఉపాధ్యాయులకు నిర్వహించిన త్రోబాల్, క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో మహిళల త్రోబాల్ విభాగంలో రంపచోడవరం విన్నర్, పాడేరు డివిజన్ రన్నర్‌గా నిలిచారన్నారు. పురుషుల క్రికెట్ విభాగంలో విన్నర్‌గా పాడేరు డివిజన్, రన్నర్‌గా రంపచోడవరం డివిజన్ కై వసం చేసుకున్నాయన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి పాంగి సూరిబాబు, సీడీలు సత్యవతి, కొండబాబు, భూపతిరాజు,మహేష్‌బాబు పాల్గొన్నారు. -
అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అరకులోయటౌన్: అరకులోయ ఏరియా ఆస్పత్రికి కేటాయించిన రెండు అంబులెన్స్‌లను అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం ప్రారంభించారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి కేటాయించిన నిధులతో ఒక అంబులెన్స్‌తో పాటు యూనివర్సల్ సంపో జనరల్ ఇన్సూరెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సురక్ష అమేషా ఆప్కేసైథ్ నిధులతో మంజూరు చేసిన మరో అంబులెన్స్‌లను ఎమ్మెల్యే కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లు అరకులోయ ఏరియా ఆస్పత్రికి ఒకటి, డుంబ్రిగుడ పీహెచ్‌సీకి ఒకటి కేటాయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ అత్యవసర వేళల్లో 24 గంటలు ఈ ఆంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. అంబులెన్స్‌లు కేటాయించిన అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, యూనివర్సల్ సంపో జనరల్ ఇన్సూరెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అంబులెన్స్ సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన నాయకుడు రేగం చాణిక్య, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్‌కుమార్, సమర్ధి శత్రుఘ్న, స్వాభి రామచందర్, కూడా పాపారావు, సర్పంచ్ సుబ్బారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్, మండల బూత్ కమిటీ ఇన్చార్జి బోయి కిరణ్‌కుమార్, వార్డు సభ్యుడు శివ, పార్టీ నాయకులు అర్జున్, నాగరాజు, జగన్, జన్ని అర్జున్, నగేష్, కామేశ్వరరావు, శంకర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత
బుచ్చెయ్యపేట: ఆర్.శివరాంపురం ఫారెస్ట్ పరిధిలో నీలగిరి చెట్లు అక్రమంగా నరికివేతకు గురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో కలప తరలిపోవడంలో ఫారెస్ట్ అధికారుల ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన వారే కలప తరలిస్తున్నారని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ రేంజర్ సతీష్‌కు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోరుకొండ రవికుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఫారెస్ట్ బీట్ వాచర్ సత్యారావును వివరణ కోరగా అటవీ ప్రాంతంలో గ్రేడింగ్ చేసిన పనులు తప్ప, అమ్మకాలు చేయలేదన్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు తెలిపామన్నారు. -
గిరి నర్తనం.. మురిసిన విశాఖ జనం
మహారాణిపేట: పీసా మహోత్సవ్ సందర్భంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన రెండు రోజుల కార్యక్రమాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల గిరిజన సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతుల్ని ఎంతగానో అలరించాయి. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన గిరిజన సంప్రదాయ నృత్య, సంగీతాలతో హోరెత్తించారు. చాలా ప్రదర్శనలకు ప్రేక్షకులు సైతం పదం కలిపారు. అనంతరం కళాకారులతో అధికారులు బృంద చిత్రా లు దిగి, జ్ఞాపికలు అందించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పీసా చట్టంపై అవగాహన పెంచేందుకే.. షెడ్యూల్డ్ ఏరియాస్‌లో పీసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పీసా మహోత్సవ్ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఘనంగా జరిగాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ వీడియో సందేశం ద్వారా గిరిజన హక్కుల కోసం రాజ్యాంగ మద్ధతును తెలిపారు. పీసా పోర్టల్‌ను ప్రారంభించారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీ ఎస్ఈఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనామిక్ అడ్వైజర్ విజయకుమార్ బెహరా, విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవి తల్లి బాట కింద చేపట్టిన అభివృద్ధి పనుల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అరకు కాఫీ, ఇతర ఉత్పత్తులతో కూడిన కిట్‌ను పంచాయతీరాజ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌కు జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి అందించారు. -
రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల
రెండు నియోజకవర్గాలనే కాక రెండు జిల్లాలను కలిపే ముఖ్యమైన రహదారి అది.. రూ.24 కోట్ల ఆర్అండ్బీ నిధులతో అడ్డురోడ్డు నుంచి రామచంద్రపురం వరకు నిర్మిస్తున్నారు. అంత వ్యయం చేస్తున్న రోడ్డు నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పనులు జరిగే తీరు గమనిస్తున్న ప్రజలు పెదవి విరుస్తున్నారు. కూటమి పార్టీలకు ఇష్టుడైన కాంట్రాక్టర్‌కు అప్పచెప్పడం వల్లే నిధులు దుర్వినియోగమవుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లి/ఎస్.రాయవరం: అడ్డురోడు– నర్సీపట్నం ఆర్అండ్బీ మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పనుల ప్రారంభంలోనే డొల్లతనం బయటపడుతోంది. సుమారు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది. పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలను కలిపే రహదారి మాత్రమే కాక ఈ మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా దారి తీస్తుంది. ప్రతి రోజు వేలాదిమంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎనిమిది నెలల ముందు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ఇటీవలే ప్రారంభమయ్యాయి. రూ.24 కోట్ల ఆర్ అండ్ బీ నిధులతో నిర్మించే ఈ రోడ్డు పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి కూటమి పార్టీలకు బాగా కావాల్సిన వాడు కావడంతో పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. అడిగే నాథులేరి? : రూ.24 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న రోడ్డు నాలుగు కాలాల పాటు మన్నాలంటే నాణ్యత పాటించాలి. క్రషర్ నుంచి తెచ్చిన నల్లపిక్కను నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. పాతరోడ్డుపై ఉన్న చెత్తను మట్టిని పూర్తిగా శుభ్రం చేసి దానిపై నల్లపిక్క, బూడిద, లైట్‌గా తారు కలిపి రోడ్డుపై తడుపుతూ బాగా రోలింగ్ చేయాలి. మరోసారి రోలింగ్ చేసి తదుపరి తారు రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. బెర్మ్‌ల వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లపిక్క, బూడిద తారు కలిపి పటిష్టంగా రోలింగ్ చేయాలి. బెర్మ్‌లు పటిష్టంగా లేకపోతే రోడ్డు కోతకు గురై క్రమేపీ మొత్తం పాడయిపోతుంది. గతంలో అయితే నల్లపిక్కలో బంకమన్ను కలిపి రోడ్డుపై వేసి బాగా రోలింగ్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అలా ఎవరూ చేయడం లేదు. పాత రోడ్డును అలాగే వదిలేసి దానిపై బూడిద కలిపిన పిక్కను వేసి తూతూమంత్రంగా రోలింగ్ చేస్తున్నారు. రోలింగ్ సమయంలో నీటితో తడపాలి. కానీ ఎక్కడ నీటితో తడిపిన దాఖలాలు కనిపించడం లేదు. వేసిన పిక్క వేస్తున్నట్లుగానే పైకి లేచిపోతోంది. నీటితో తడిపి రోలింగ్ చేసిన తర్వాత తారురోడ్డు వేస్తే నాణ్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇలా వేయడం వల్ల తారు రోడ్డు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే చోట ఇంజినీరింగ్ సిబ్బంది కనిపించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల రోడ్డు పనులు నాణ్యతాలోపంతో జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్లే మార్గం అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి ముఖద్వారమైన అడ్డురోడ్డు నుంచి నిత్యం వేలాది మంది వందలాది వాహనాల్లో నర్సీపట్నం రాకపోకలు సాగిస్తుంటారు. అంత ముఖ్యమైన రోడ్డయినా అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే మాదిరిగా గునిపూడి నుంచి పెంటకోట వెళ్లు రోడ్డు వేయడం వల్ల అది నెల రోజులకే పెచ్చులు ఊడిపోయిందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయించి చేతులు దులుపేసుకుంటే సరిపోదని, నిబంధనలు, నాణ్యత పాటిస్తున్నారో లేదో హోం మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్‌రాయ్
జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్కి అప్పన్న చిత్రపటం అందజేస్తున్న ఏఈవో శ్రీచరణికి అప్పన్న ప్రసాదం అందిస్తున్న ఏఇవో, కప్పస్తంభానికి మొక్కుకుంటున్న శ్రీచరణి సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. క్రికెటర్ శ్రీచరణి కూడా.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. -
మంచుతో సతమతం
రాజవొమ్మంగి: దాదాపు వారం రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న మంచు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాజవొమ్మంగిలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా అలముకొంటున్న మంచు వాతావరణానికి శీతల గాలులు తోడు కావడంతో ప్రజానీకం వణికి పోతున్నారు. రాత్రిళ్లు గ్రామాల్లో, అటవీప్రాంతానికి దగ్గరగా ఉండే జనావాసాల్లో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. చిన్నారులు, వృద్ధులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించ వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు. చలిమంటతో ఉపశమనం పొందుతున్నారు. -
1200 లీటర్లసారా పులుపు ధ్వంసం
నాతవరం : అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం మండలంలో పెడిమికొండ అటవీ ప్రాంతంలో సారా తయారు చేసే బట్టీలపై ఆకస్మికంగా దాడులు జరిపారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల పులుపును ధ్వంసం చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ పెడిమి కొండ అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధం చేసిన పులుపును ధ్వంసం చేశామని, నిర్వాహకులు పరారయ్యారని తెలిపారు. సారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేసి, మిగిలిన సామాగ్రిని స్టేషన్‌కు తరలించామన్నారు. -
ప్రేమ, కరుణ, ఆనందం వెల్లివిరియాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్: అరకులోయ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో ప్రేమ, కరుణ, శాంతి, ఐక్యత, విలువలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే కోరారు. ప్రేమ, త్యాగం, కరుణకు ప్రతీక క్రిస్మస్ వేడుక అన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధిని నింపాలని ఎమ్మెల్యే మత్స్యలింగం ఆకాంక్షించారు. -
కట్టుకున్నవాడే కాలయముడు
యలమంచిలి రూరల్: ఒక ఊరూ.. ఒక జిల్లా కాదు..రాష్ట్రాల సరిహద్దు దాటి, తాళికట్టిన బంధాన్ని కాదని, నమ్మినవాడి వెంట వచ్చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి 8 ఏళ్ల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలికి వచ్చారు. తానే సర్వస్వమని నమ్మిన ఇల్లాలి ఊపిరిని అనుమాన భూతంతో లాగేశాడు. తమ ఇద్దరికి పుట్టిన నాలుగు నెలల ఆడబిడ్డ మొహం కూడా చూడకుండా, అతి కిరాతంగా భార్యను కడతేర్చాడు. యలమంచిలి పట్టణం ధర్మవరం సీపీ పేటలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలివి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత కబీర్ నగర్ జిల్లా నందలూరు గ్రామానికి చెందిన రాకేష్, మాయ దంపతులు 8 ఏళ్ల కిందట యలమంచిలి పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చారు.అంతకుముందే మాయకు వివామైంది. తన మొదటి భర్త ద్వారా 12 ఏళ్లు వయస్సున్న కాజల్ అనే కుమార్తె కూడా వుంది. కుమార్తె పుట్టిన తరువాత ఆమెకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాకేశ్ మాయను వివాహం చేసుకుని 8 ఏళ్ల కిందట ఉపాధి కోసం యలమంచిలి పట్టణానికి వచ్చారు. రాకేశ్, మాయ దంపతులు యలమంచిలిలో కాపురం వుంటూ ధర్మవరం సీపీ పేటలో ఒక తుక్కు (స్క్రాప్) దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాకేష్, మాయ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆ చిన్నారికి నాలుగు నెలలు. గత కొంతకాలంగా భార్య మాయ తమ సొంతూరుకు చెందిన ఒక యువకుడితో ఫోన్ ద్వారా తరచూ మాట్లాడుతున్నట్టు రాకేష్ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లొచ్చిన రాకేష్ తన భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించి ఆవేశంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య మాటా, మాటా పెరిగింది. ఈ సమయంలో నియంత్రణ కోల్పోయిన రాకేష్, ఆవేశంలో అతి కర్కశకంగా ప్రవర్తించాడు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి, అక్కడున్న స్క్రూ డ్రైవర్‌తో ఛాతికి, మెడకు మధ్య భాగాన పొడిచేశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆటోలో స్థానిక కమలా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. యలమంచిలి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వారు వచ్చే వరకూ మృతదేహం పాడవ్వకుండా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు సీఐ ధనుంజయరావు చెప్పారు. తన భార్యను తానే హత్య చేశానని రాకేష్ అంగీకరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటనలో నాలుగు నెలల చిన్నారి అనాథగా మారింది. స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాపను సాయంత్రం వరకు సంరక్షించారు. పోలీసులు పసిబిడ్డను అనకాపల్లి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌కు ఆ పాపను అప్పగించారు. -
నిర్వాసితులకు న్యాయం చేయాలి
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు అన్నారు. చింతూరులో ఏర్పాటుచేసిన పరిషత్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను ముంచుతున్న ప్రభుత్వాలు సరైన పరిహారం చెల్లించకుండా వారిని ఇక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తిస్థాయిలో పరిహారం అందించిన అనంతరమే వారికి పునరావాస కేంద్రాలకు తరలించాలని, కాలనీల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిన్నవీరభద్రం, నాయకులు వీరయ్య, శంకురమ్మ, అంజిరెడ్డి, లక్ష్మణరావు, నాగేశ్వరరావు, రాఘవయ్య, ప్రసాద్, ముత్తయ్య, కొండయ్య పాల్గొన్నారు. -
కరాటే పోటీల్లో బాలికల సత్తా
● జాతీయ స్థాయిలో ఐదు బంగారు, మూడు వెండి పతకాలు సాధన ● అభినందించిన ఉపాధ్యాయులు కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 21న సామర్లకోట సూర్య డీఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో నాలుగో ఓపెన్ జాతీయ స్థాయి కరాటే పోటీలు జరిగాయి. వీటిలో పాల్గొన్న ముర్ల ఈశ్వరి, కిముడు నందిని, పొత్తూరు లోవదుర్గ, శోభ స్వప్న కుమారి, బోనంగి గీత బంగారు పతకాలు సాధించారు. జర్సింగి నాగమణి, కొప్పుల భవాని, మఠం కారుణ్య వెండి పతకాలు పొందారు. వీరికి శిక్షణ ఇచ్చిన అకాడమి ప్రధాన కార్యదర్శి మర్రి శ్రీనును, ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు. -
మన్యంలో క్రిస్మస్ కాంతులు
సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. గిరిజన పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రార్థనా మందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ కాంతులు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నాటి జ్ఞాపకం.. నేడు పర్యాటక స్వర్గం అరకులోయ మండలం సుంకరమెట్టలో ఉన్న పురాతన ప్రార్థనా మందిరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది ఏజెన్సీలోనే నిర్మించిన మొట్టమొదటి చర్చి.1934లో కెనడాకు చెందిన డాక్టర్ రాల్ఫ్ స్మిత్ ఇక్కడికి వచ్చి గిరిజనులకు వైద్య సేవలు అందించేవారు. జైపూర్ మహారాజుల అనుమతితో, స్థానిక గిరిజనుల సహకారంతో కొండపై ఈ చర్చిని నిర్మించి, 1939 సెప్టెంబర్ 17న ప్రారంభించారు. పర్యాటక ఆకర్షణ: అరకు–అనంతగిరి రహదారిలో కొండపై అందంగా కనిపించే ఈ చర్చి ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా, సినిమా షూటింగ్‌లతో విరాజిల్లుతోంది. ● పాడేరు ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థనల వ్యాప్తికి 1970లో పునాది పడింది. డాక్టర్ రాల్ఫ్ స్మిత్ జ్ఞాపకార్థం కాకినాడ సీబీఎం మిషన్‌కు చెందిన జెస్సీ రోజర్ పాడేరులో సీబీఎం చర్చిని ప్రారంభించారు. అక్కడి నుంచే జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి తదితర ప్రాంతాలకు ప్రార్థనా మందిరాలు విస్తరించాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 500కు పైగా చర్చిలు ఉన్నాయి. మురిసిపోతున్న మన్యం క్రిస్మస్కు ముందే పాడేరు, అరకు తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. తెల్లవారుజామునే వినిపిస్తున్న కీర్తనలు భక్తి గీతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి. అన్ని చర్చిలు విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్నాయి. శాంతి, ప్రేమల సందేశంతో ఏజెన్సీ వాసులు ఈ ఏడాది క్రిస్మస్ను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు.పాడేరులో విద్యుత్ దీప కాంతుల్లో సీబీఎం చర్చి -
ఆసరాను కబళించిన మృత్యువు
రంపచోడవరం: రంపచోడవరం–గోకవరం మార్గంలోని పాలకాలవ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చింతూరు మండలం ఏడురాళ్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సందీప్ (34), పెద్దసీతనపల్లి పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్ (38) తమ విధులను ముగించుకుని గురువారం సెలవు కావడంతో సొంత ఊళ్లకు బయలుదేరారు. రాజోలు, పల్లంకురు ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో గడపాలన్న ఉత్సాహంతో బైక్‌పై ప్రయాణమయ్యారు. అయితే, సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాలకాలువ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. ఇరువురికి రెండు కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. సందీప్ ఏరియా ఆస్పత్రిలో మృతి చెందగా, విద్యాసాగర్ మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా గోకవరం సమీపంలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆగి ఉన్న కారు రూపంలో వీరిని మృత్యువు కబళించింది. పిడుగులా మరణవార్త విద్యాసాగర్ ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న భార్యాపిల్లలకు ఆయన మరణ వార్త పిడుగులా తగిలింది. ఇద్దరు పసిపిల్లలు ఇప్పుడు తండ్రి లేని అనాథలయ్యారు. మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఆయన ప్రాణాలు విడిచారు. మరో మృతుడు సందీప్‌కు వివాహం కాలేదు. తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తాడనుకుంటే, నూరేళ్ల నిండకుండానే తనువు చాలించడం ఆ ఊరిని కన్నీరు ముంచెత్తింది. తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండే ఇద్దరు యువ అధికారులు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరు ఆసుపత్రిలో, మరొకరు మార్గమధ్యలో మరణించడం విధి ఎంత క్రూరమైనదో చెబుతోంది. మలుపు వద్ద వేచి ఉన్న మృత్యువు, రెండు నిండు ప్రాణాలను బలితీసుకుని ఆ కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసింది. సందీప్, విద్యాసాగర్ మృతదేహాలువారు సామాన్యుల సేవలో నిమగ్నమైన ప్రభుత్వ వారధులు. సెలవు దొరికితే చాలు కన్నవారిని, కట్టుకున్నవారిని చూడాలనే ఆరాటంతో ఇళ్లకు బయలుదేరారు. కానీ, అదే వారి జీవితంలో చివరి ప్రయాణమవుతుందని ఎవరూ ఊహించలేదు. మార్గమధ్యలో ఆగి ఉన్న కారు రూపంలో మృత్యువు దారికాసి ఇద్దరిని కబళించింది. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. -
సప్పర్ల ఘాట్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సు
● ఇంజిన్‌లో సాంకేతిక లోపం ● పొగలు రావడంతో నిలిపివేసిన డ్రైవర్ ● ఇబ్బందులు పడిన ప్రయాణికులు సీలేరు: విశాఖ– భద్రాచలం అల్ట్రా డీలక్స్ బస్సు ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో బుధరవారం ఉదయం సప్పర్ల ఘాట్‌రోడ్డులో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి సీలేరు, చింతూరు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన ఈ బస్సు గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఇంజన్‌లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అపమ్రత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేశాడు. ఈ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ధార కొండ ప్రాంతానికి చెందిన వారు కొంత మంది ద్విచక్రవాహనంపై వెళ్లిపోయారు. దీంతో ఆర్టీసీ అధికారులు నర్సీపట్నం డిపోకు చెందిన బస్సును రప్పించి సీలేరుకు చెందిన ప్రయాణికులను గమ్యానికి చేర్చారు. ఈ మధ్యకాలంలో అంతర్రాష్ట్ర రహదారి ఘాట్ రోడ్లో తరచూ విశాఖపట్నం డిపో చెందిన బస్సులు మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇబ్బందులు తలెత్తకుండా కండీషన్లో ఉన్న బస్సులను నడపాలని వారు కోరుతున్నారు. -
భోజనం నాణ్యతలో రాజీ పడొద్దు
● పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు: అంగన్వాడీ కేంద్రాలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అందించే భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. బుధవారం ఆమె కార్యాలయం నుంచి ఐసీడీఎస్, సీడీపీవో, డీఎస్వో, సివిల్ సప్లయ్ డీఎం, గిరిజన సంక్షేమ శాఖ డీడీలు, జీసీసీ మేనేజర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో అంగన్వాడీ, పాఠశాల వసతి గృహాల్లో అందించే భోజనంలో నాణ్యతపై ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా -
రబ్బరు విప్లవం
రూ. 5 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు మన్యం కొండల్లో ప్రకృతి ప్రసాదించిన చల్లని వాతావరణం ఇప్పుడు గిరిజన రైతుల పాలిట వరంగా మారుతోంది. మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉన్నందున ఇక్కడ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు రంపచోడవరం ఐటీడీఏ కసరత్తు మొదలుపెట్టింది. మూడు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన ఈ రబ్బరు సాగు ప్రస్థానం, ఇప్పుడు వేల ఎకరాలకు విస్తరించడమే కాకుండా.. స్థానికంగానే వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పడే స్థాయికి చేరింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. రంపచోడవరం: మారేడుమిల్లి: సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి, చల్లని వాతావరణం కలిగిన మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు రబ్బరు ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీడీఏ అధికారులు ఈ ప్రాంతంలో రబ్బరు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1994లో మొదలైన ప్రస్థానం.. రబ్బరు బోర్డు పర్యవేక్షణలో 1994లోనే ఇక్కడ సాగుకు పునాదులు పడ్డాయి. ఐటీడీఏ – రబ్బరు బోర్డు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి. బ్లాక్ ప్లాంటేషన్–1: దేవరపల్లి గ్రామంలో 1994లో 50 హెక్టార్లలో తొలిసారిగా రబ్బరు మొక్కలు నాటారు. బ్లాక్ ప్లాంటేషన్–2 : పుజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 1998 – 2003 మధ్య 35 మంది రైతులకు చెందిన 45 హెక్టార్లలో సాగు చేపట్టారు. బ్లాక్ ప్లాంటేషన్–3 : పందిరిమామిడి కోటలో 2009–2013 మధ్య వంద హెక్టార్లలో మొక్కలు నాటారు. ● మొక్కలు నాటిన మూడేళ్ల వరకు రైతులకు సాంకేతిక సహకారం అందించగా, ఆ తర్వాత రెండేళ్లకు పాల ఉత్పత్తి ప్రారంభమై రైతులకు ఆదాయం మొదలైంది. ఐటీడీఏ సహకారంతో విస్తరిస్తున్న సాగు గతంలో సాంకేతిక లోపాలతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం గిరిజనులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది: ● రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం (అప్పర్ పార్ట్) పరిధిలో 3 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులను సిద్ధం చేస్తోంది. ● మిగిలిన రెండేళ్లలో మరో 2వేల ఎకరాల్లో సాగు విస్తరించనున్నారు. ఈ ప్రాంతంలో రబ్బరు బోర్డు ద్వారా 2024లో 370 ఎకరాలు, 2025లో 501 ఎకరాల్లో సాగు చేపట్టారు. ● ఎకరానికి 450 కిలోల వరకు రబ్బరు షీట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ. 170 వరకు ఉంది రూ. 5 కోట్లతో పరిశ్రమ మారేడుమిల్లిలో పండుతున్న రబ్బరుకు స్థానికంగానే విలువల జోడింపునకు రూ. 5 కోట్ల వ్యయంతో వస్తువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రబ్బరు బోర్డు నుంచి డీపీఆర్ అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రబ్బరు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది. స్మోక్ రూమ్‌లకు ప్రతిపాదనలు రబ్బరు సాగు చేసే రైతుల సంఖ్య పెరగడంతో రబ్బరు షీట్ల తయారీకి స్మోక్ రూమ్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఐదు స్మోక్ రూమ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. మూడు వేల ఎకరాల్లో రబ్బరు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – దేవనందం, పీహెచ్‌వో, రంపచోడవరం ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం పందిరిమామిడి కోటలో ఆరు ఎకరాల్లో 1200 రబ్బరు మొక్కలు ఉన్నాయి. ఏడాదికి రూ. 8లక్షలు వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు పాల సేకరణ కోసం గ్రామంలో కొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నా. రబ్బరు సాగుకు మరింత ప్రోత్సాహం ఇస్తే ఇంకా రైతులు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడి కోట -
కొనసాగుతున్న చలి తీవ్రత
● జి.మాడుగులలో 4.0 డిగ్రీలఅత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంచు, చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. జి.మాడుగులలో బుధవారం 4.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. ముంచంగిపుట్టులో 6.7 డిగ్రీలు, అరకులోయలో 8.6 డిగ్రీలు, పెదబయలులో 9.0 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు, పాడేరులో 9.9 డిగ్రీలు, హుకుంపేటలో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ఆయన పేర్కొన్నారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు
పాడేరు రూరల్: జిల్లా కేంద్రం పాడేరులో ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడాపోటీలు మంగళవారం ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వీటికి ఎస్జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి పాంగి సూరిబాబు ఆధ్వర్యంలో వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పురుషుల ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలను డీఈవో రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రోబాల్‌లో రంపచోడవరం డివిజన్, క్రికెట్లో పాడేరు డివిజన్ ప్రథమ స్థానం సాధించాయన్నారు. అనంతరం ఎస్జీఎఫ్ కార్యదర్శి పాంగి సూరిబాబు మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. పీడీలు సత్యవతి, కొండబాబు, భూపతిరాజు, చిన్ని, గంపరాయి, మహేష్‌బాబు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం
అధికారులతో మాట్లాడుతున్న ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు : గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. జిల్లాలో విద్యా, ఆరోగ్యం, పౌష్ఠికాహారం, తాగునీరు, పారిశుద్యం, పరిశుభ్రత తదితర అంశాలపై యునిసెఫ్ టీం సభ్యులు, జిల్లా శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలింతలు, చిన్నారులలో రక్తహీనత తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన ఆరోగ్యం, పోషకాహారం అందిస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా డ్రాపౌట్స్ తగ్గిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఆధునిక విద్యా విధానాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతి శాఖ తమ లక్ష్యాలను నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని యునిసెఫ్ టీం క్షేత్ర స్థాయిలో ఇచ్చే సలహాలు, సూచనలు అమలు చేయాలని సూచించారు. పరిశుభ్రత, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి యునిసెఫ్ సహకారంతో బహుళ రంగాల సమన్వయంతో గిరిజనుల అభ్యున్నతికి ఆయా శాఖల కృషి చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో యునిసెఫ్ సంస్థ రాష్ట్ర చీఫ్ ఆఫీసర్ డాక్టర్ జీలాలేం తాఫస్సే, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఖ్యతి తివారీ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని 104 ఉద్యోగుల నిరసన
● స్పందించకుంటే ఉద్యమం ఉధృతం ● ప్రభుత్వానికి హెచ్చరిక పాడేరులో ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న 104 ఉద్యోగులు పాడేరు : రాష్ట్ర వ్యాప్తంగా 104 సర్వీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను పరిష్కారించకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. 104 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, భవ్య యాజమాన్యం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కనీస వేతనాలు అమలు చేయాలని, వేధింపులు ఆపాలని, వేతనాలను పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 104 ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ ఉద్యోగులకు ఏడాదికి 15 క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, ప్లే, సిప్పులు ఐటీ కార్డులు అందజేయాలని, చిన్నపాటి కారణాలతో తొలగించిన 104 సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సకాలంలో సమస్యలు పరిష్కరించకకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు, మండల కన్వీనర్ ప్రసాద్, 104 సిబ్బంది పాల్గొన్నారు. -
గిరి గుండెల్లో విత్తన సెగ
రబీలో రైతులకు అండగా నిలవని టీడీపీ సర్కారువిత్తన సెగ హుకుంపేట మండలం తాడిపుట్టు ప్రాంతంలో రబీ సాగుకు దుక్కి పనుల్లో నిమగ్నమైన గిరి రైతుసాక్షి,పాడేరు: గిరిజన రైతులు రబీలో రెండవ పంటగా వరిసాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం కనీస ప్రోత్సాహం కరువైంది. గత రబీ సీజన్లోను విత్తన సమస్య ఎదుర్కొన్న గిరిజన రైతులు ఈఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయఽశాఖ మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా మన్యంలో విత్తనాలకు డిమాండ్ లేదని చెబుతోంది. ● ప్రస్తుతం నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున రబీ సాగుకు గిరి రైతులు సిద్ధమయ్యారు. ఇందుకు అవసరమైన విత్తనాలను ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేసుకుంటున్నారు. తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే రకాల విత్తనాలను ఒడిశాలోని సిమిలిగుడలో ప్రైవేట్ విత్తన కేంద్రాల వద్ద కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతమంది తమ వద్ద దాచుకున్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలను నారుమళ్లకు వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది. ● జిల్లా వ్యాప్తంగా గత రబీలో 2,361 హెక్టార్లలో నాట్లు వేశారు. ఈఏడాది కూడా అంతేవిస్తీర్ణంలో సాగు చేపట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారు130 రోజుల కన్నా తక్కువ వ్యవధిలో దిగుబడి నిచ్చే మేలు జాతి విత్తనాలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని గిరిజన రైతులు ఆశతో ఎదురుచూస్తున్నా అందుకుతగ్గట్టుగా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రకృతి వ్యవసాయ విభాగం కూడా రబీలో విత్తన పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంది. ● రబీ సాగుకు వ్యవసాయశాఖ సలహాలు,సూచనలు ఇస్తున్నప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విత్తనాలకు డిమాండ్ లేకుంటే వారపు సంతలు, ఒడిశా ప్రాంతంలో అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ మాదిరిగానే రబీకి విత్తన ప్రణాళికను ప్రభుత్వం రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒడిశాలో విత్తనాలు కొన్నా ప్రభుత్వం రబీసాగుకు విత్తనాలను పంపిణీ చేయకపోవడంతో విత్తన సమస్య అధికంగా ఉంది. ఐదు ఎకరాలలో వరితో పాటు కూరగాయల సాగు చేస్తా. వరి, ఇతర పంటల విత్తనాలను ఒడిశాలోని సిమిలిగుడ పట్టణంలో ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఇటీవల కొనుగోలు చేసి తీసుకువచ్చా. ఒడిశా వెళ్లి రావడానికి రవాణా ఖర్చులతో పాటు విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. – శెట్టి ధనరాజు, గిరిజన రైతు, సొవ్వా, డుంబ్రిగుడ మండలం -
ఆర్అండ్ఆర్ పరిహారానికి 9,664 మంది గుర్తింపు
● రెండు రోజుల్లో జాబితా ప్రకటన ● అభ్యంతరాల స్వీకరణకు పది రోజుల గడువు ● తదుపరి డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ ప్రక్రియ ● మిగతా వారికీ సర్వే ● చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ చింతూరు: డివిజన్ పరిధిలోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పోలవరం ఆర్అండ్ఆర్ పరిహారానికి 9,664 మంది నిర్వాసితులు ప్రస్తుతానికి అర్హులుగా తేలినట్టు స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ వెల్లడించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏఎస్పీ బొడ్డు హేమంత్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు మండలాల్లో సామాజిక ఆర్థిక సర్వే(ఎస్ఈఎస్) ప్రకారం 12,368 ఆర్అండ్ఆర్ పరిహారం జాబితాలో ఉండగా అన్ని ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఇప్పటివరకు 9,664 మంది అర్హులుగా తేలినట్లు తెలిపారు. వీరికి సంబంధించిన జాబితాను శుక్రవారం నుంచి ఆయా మండలాల తహసీల్దార్, మండల పరిషత్, గ్రామ సచివాలయ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. జాబితా వెల్లడి అనంతరం ఎవరికై నా అభ్యంతరాలుంటే పది రోజుల్లో ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయం లేదా ఆర్అండ్ఆర్ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు. ● అభ్యంతరాల సమయం ముగిసిన వెంటనే డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ ప్రక్రియ చేపడతామని పీవో తెలిపారు. మిగిలిన వారికి సంబంధించి ప్రస్తుతం తమ బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని, సర్వే ప్రక్రియ పూర్తయిన తరువాత వారిలో అర్హులైన వారిని గుర్తించి మరో జాబితా వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి మూడు మండలాల్లో ఇప్పటివరకు 75 శాతం ప్రక్రియ పూర్తయిందని మరో 25 శాతం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి వెల్లడించనున్న అర్హుల జాబితాలో పేర్లు లేనివారు ఎవరూ ఆందోళన చెందవద్దని వారికి సంబంధించిన అన్నిరకాల ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులైన వారందరినీ ఆర్అండ్ఆర్ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటామని పీవో వెల్లడించారు. పరిహారానికి రూ.600 కోట్లు మంజూరు ఫేజ్ 1–బీలోని 30 గ్రామాల్లో భూములు, గృహాల విలువ చెల్లించే నిమిత్తం రూ 600 కోట్లు మంజూరైనట్లు పీవో తెలిపారు. ఇప్పటికే గిరిజన నిర్వాసితులకు సంబంధించి 22 గ్రామాల్లో భూమికి భూమి, పునరావాసం, కాలనీల నిర్మాణం ప్రక్రియ జరుగుతోందని, గిరిజనులకు ఇతర గిరిజన ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గిరజనేతరులకు సంబంధించి 3,600 కుటుంబాలకు ఏలూరు జిల్లా తాడ్వాయిలో పునరావాసం కల్పించడంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో కాలనీల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యలు సృష్టిస్తే చర్యలు : ఏఎస్పీ హేమంత్ హెచ్చరిక ప్రస్తుతం జరుగుతున్న ఆర్అండ్ఆర్ సర్వే ప్రక్రియలో ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ హెచ్చరించారు.. క్షేత్రస్థాయిలో సర్వే సిబ్బందిపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని, విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆటంకం కలిగించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, పరిహారం విషయంలో కుటుంబాల మధ్య ఏవైనా కలహాలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి పోలవరం పరిహారం కాజేయాలని చూసే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఏఎస్పీ తెలిపారు. నిర్వాసితులు తమ పరిహారం సొమ్మును ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని, అధిక సొమ్ముల ఆశతో ప్రైవేటు కంపెనీల చేతుల్లో మోసపోవద్దని ఆయన సూచించారు. -
తారురోడ్డు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల పంచాయతీ కోడాపుట్టు మీదుగా చికుచింత గ్రామానికి వేస్తున్న తారురోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయి. మెటల్ ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్ రోడ్డు పనులను కొద్దిరోజులుగా నిలిపివేశాడు. దీంతో కోడాపుట్టు,చికుచింత గ్రామాల గిరిజనులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్ నిర్మాణ పనులు మొదలు పెట్టి, తూతూమంత్రంగా చేశాడు. పనులు చేపట్టిన వారం రోజుల్లేనే తారు లేచిపోయి నాణ్యతాలోపం బయట పడింది. దీంతో రోడ్డు అధ్వాన పరిస్థితిపై గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగారు. ఇష్టానుసారంగా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకంగా పనులు చేపట్టి కాంట్రాక్టర్,అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వారం రోజులకే తారురోడ్డు పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తక్షణమే పంచాయతీరాజ్ అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పీఆర్ ఏఈ మురళీకృష్ణను వివరణ కోరగా రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని విషయాన్ని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
జి.మాడుగులలో 6.3 డిగ్రీలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగులలో 6.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఏడీఆర్, వాతావరణం విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ అరకువ్యాలీలో 8.7 డిగ్రీలు, పెదబయలులో 8.4 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 10.5 డిగ్రీలు, హుకుంపేటలో 11.1 డిగ్రీలు, కొయ్యూరులో 12.9 డిగ్రీలు నమోదైనట్టు ఆయన తెలిపారు. ● రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 13.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.4 డిగ్రీలు, వై.రామవరం 14.9 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 14.5 డిగ్రీలు, ఎటపాకలో 15.1 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ పేర్కొన్నారు. ● గత రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ శీతల గాలులు, చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. ఉదయం వేళలో 9 గంటలు దాటినప్పటికీ మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులు, కూలీలు, చిరువ్యాపారులు, అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగుల: మండలంలో చలి తీవ్రతకు అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు మార్గంలోను, నుర్మతి, మద్దిగరువు, సొలభం గడుతూరు,వంజరి, గెమ్మెలి, లువ్వాసిగి, కుంబిడిసింగి రోడ్డుమార్గాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9గంటల వరకు పొగమంచు తెరలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు. -
ఘనంగా రైతు దినోత్సవం
రైతులకు విత్తనాలు అందజేస్తున్న కేవీకే కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ రంపచోడవరం: పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెవీకె కోఆర్డినేటర్ , సీనియర్ శాస్త్రవేత్త డా. కె రాజేంద్రప్రసాద్ ఉపాధిహామీ పథకం విశిష్టతను వివరించారు. రైతులు ఈ కాలంలో కూరగాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విస్తరణ విభాగం శాస్త్రవేత్త డా. ఆర్ ప్రవీణ్‌బాబు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జి రాంజిగా మార్పు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 125 రోజులు పని దినాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వేతనాల చెల్లింపులో ఆలస్యంగా పరిహారం ఇస్తున్నారని తెలిపారు. పీహెచ్‌వో దేవదానం మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులకు నువ్వులు, మినుము విత్తనాలు అందజేశారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్యానికి అధిక ప్రాధాన్యం
రంపచోడవరం: ఏజెన్సీలో వైద్య సేవలకు వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్‌ను ప్రారంభించారు. రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లో అంబులెన్స్ అవసరం ఉందని ఎమ్మెల్సీ అనంతబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు అరకు ఎంపీ తనూజరాణి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె వెంటనే స్పందించారు. ఎంపీ నిధుల నుంచి చింతూరు, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులకు రెండు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలను దగ్గర చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రంపచోడవరంలో మల్టీపర్పస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చి, నిర్మాణం చేపట్టిన ఘనత తమ పార్టీకి దక్కుతుందన్నారు. గిరిజనులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంధం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, స్ధానిక సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ అధ్యక్షుడు జల్లేపల్లి రామన్నదొర, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, కాజా వలీ, పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, పార్టీ నాయకులు కుంజం రామకృష్ణ, రత్నరాజు, బొబ్బా శేఖర్, చితుకులయ్యరెడ్డి, నాగేశ్వరరావు,రాజన్నదొర,బాబి, యూత్ అధ్యక్షుడు పండు, సత్తిబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ విద్యలో అద్భుత ప్రతిభ
రంపచోడవరం: వ్యవసాయ విద్యలో రంపచోడవరం గ్రామానికి చెందిన కాపారపు సుభాషిణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనుబంధ ’కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ అప్లైడ్ సైన్సెస్’ నుంచి ఆమె ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్లో పీజీ (మాస్టర్స్) పూర్తి చేశారు. ఈనెల 22న రాజస్థాన్‌లో జరిగిన దీక్షాంతోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే చేతుల మీదుగా సుభాషిణి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా రైతులకు శాసీ్త్రయ సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేసేందుకు ‘కృత్రిమ మేధ సాధనాలపై అవగాహన మరియు వినియోగం‘ అనే అంశంపై ఆమె తన పరిశోధనను పూర్తి చేశారు.డీన్ డాక్టర్ ధృతి సోలంకి నేతృత్వంలో, అడ్వైజరీ డాక్టర్ రాజశ్రీ ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. సుభాషిణి తల్లి రూతు వైఎస్సార్ సీపీజిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం నా జీవితంలో గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధ ప్రాధాన్యతను నా పరిశోధన ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
● ఉత్సాహంగా ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ క్రీడా పోటీలు ● గిరిజన ఉత్పత్తులు, ఆహార పదార్థాలతో 68 స్టాళ్లు ఏర్పాటు స్టాల్‌ను పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కృష్ణ తేజస్టాల్ను పరిశీలిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్,చిత్రంలో అవార్డు గ్ర హీత జ్యోతి సురేఖ క్రీడా మస్కట్‌తో అతిథులుఆర్చరీ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్మహారాణిపేట: పోర్టు స్టేడియంలో పెసా మహోత్సవ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన 68 స్టాళ్లు లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, బాంబూ చికెన్ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఉత్కంఠగా సాగిన క్రీడా పోటీలు ఖేలో ఇండియా కబడ్డీలో 10 రాష్ట్రాల నుంచి 18 టీమ్‌లు భాగస్వామ్యమయ్యాయి. అందులో పురుష జట్లు 10, మహిళా జట్లు 8 పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవగా, రన్నర్ జట్టుగా ఒడిశా, మూడో స్థానంలో తెలంగాణ, గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో జార్ఖండ్‌గా విజేతగా నిలవగా, రన్నర్‌గా మధ్యప్రదేశ్ జట్టు నిలిచింది. మూడో స్థానంలో మహారాష్ట్ర, ఒడిశా జట్లు ఉన్నాయి. ●ఆర్చరీ క్రీడా పోటీలో 8 రాష్ట్రాలకు చెందిన 20 మంది క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా గోల్డ్ మెడల్, రాజస్థాన్‌కు చెందిన బద్రీ లాల్ మీనా సిల్వర్ పతకం సాధించుకున్నారు. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించుకున్నారు. మహిళా వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా గోల్డ్ మెడల్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి సిల్వర్ పతకం సాధించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ●సాయంత్రం క్రికెట్ స్టేడియంలో నమూనా క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. అధికారులు, క్రీడాకారులు, గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
● పేదోడి కడుపు మండింది.. మట్టి పన్నుపై గట్టి ప్రతిఘటన
● తిరగబడిన ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ● ఏటిగైరంపేటలో అనధికార వసూళ్లపై మండిపాటు గొలుగొండ: చంద్రబాబు పాలనలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. మట్టి కావాలన్నా పన్ను కట్టాలట. ట్రాక్టర్ మట్టి తరలించడానికి ఏకంగా రూ.410 పన్ను కట్టమని అనధికార సంస్థ బళ్లను ఆపడంతో ప్రజలు తిరగబడ్డారు. పాక, ఇంటి కప్పుడుకు సొంత పొలంలో మట్టి తరలించడానికి పన్ను కట్టమంటే వారికి చిర్రెత్తుకొచ్చింది. సొమ్ము చెల్లించకపోతే ట్రాక్టర్, లారీ, పొక్లెయిన్ సీజ్ చేస్తామని చెప్పడంతో అడ్డుకోవడానికి మీరెవరంటూ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఏటిగైరంపేట గ్రామ పరిధిలో ఒక రైతు పొలం వద్ద పాక వేశారు. దీనికి కప్పుడు మట్టి అవసరం కావడంతో వేరొక ప్రాంతంలో తన పొలంలోని మట్టిని ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇంతలో ఏఎంఆర్ అనే సంస్థ సిబ్బంది వచ్చి ట్రాక్టర్లను నిలిపివేశారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మట్టి తరలించినా ఎవరూ అడ్డుచెప్పడం లేదు. కానీ మంగళవారం ఏఎంఆర్ సంస్థ సిబ్బంది అడ్డుకట్ట వేసి ట్రాక్టర్లను నడిరోడ్డుపై నిలిపివేశారు. యూనిట్ మట్టి తరలించాలన్నా రూ.410 పన్ను కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఏటిగైరంపేట, పాలకపాడు, పుత్తడిగైరంపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండిపడ్డారు. గ్రామాల్లో మట్టి తరలిస్తే చంద్రబాబు పాలనలో రూ.410 పన్ను ఎందుకు కట్టాలని దుయ్యబట్టారు. మేం కట్టం.. ఏం చేసినా పర్వాలేదని తిరుగుబాటు చేశారు. వ్యవసాయ కుటుంబాల్లో దిబ్బలుగా ఉన్న పొలాన్ని చదును చేయడం, లోతుగా ఉన్న పొలంలో మట్టివేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో పన్ను కట్టమనడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. ఇటువంటి పన్నులు వేసి పేదోడిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మండిపడ్డారు. అసలు ఈ ఏఎంఆర్ సంస్థకు ఎటువంటి అనుమతులు ఉన్నాయని నిలదీశారు. ట్రాక్లర్లను అడ్డుకుంటే తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇక్కడ ఉన్న సిబ్బంది మెల్లగా జారుకున్నారు. అయ్యన్ననే అడుగుదాం.. ఇలా పేద ప్రజలకు అన్యాయం చేయడంపై బుధవారం స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లి సమస్య వివరిస్తామని ట్రాక్టర్ యజమానులు తెలిపారు. పేదలకు అన్యాయం చేసే ఈ సంస్థ ఎక్కడ నుండి వచ్చిందో తెలపాలని, తమకు న్యాయం చేయాలని కోరతామన్నారు. పాక, ఇంటి అవసరాల కోసం సొంత పొలంలో మట్టి తరలిస్తే ట్రాక్టర్‌కు రూ.410 ఎలా పన్ను విధిస్తారు.. ఎందుకు ఇవ్వాలని అయ్యన్న ఇంటి వద్దకు వెళ్లి అడుగుతామన్నారు. ఇలా అయితే తామెలా బతకాలని ట్రాక్టర్ యజమాని సత్తిరాజు ఆవేదనగా ప్రశ్నించారు. ఏటిగైరంపేట వద్ద ప్రైవేట్ వ్యక్తులుఆపిన ట్రాక్టర్లుఏఎంఆర్ సంస్థ సిబ్బందిని నిలదీస్తున్నఏటిగైరంపేట ప్రజలు -
51 సెల్ఫోన్ల రికవరీ
● విలువ రూ.5.45 లక్షలు ● ఎస్పీ అమిత్‌బర్దర్ బాధితులకు సెల్ ఫోన్లు అందజేస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్ పాడేరు : జిల్లా వ్యాప్తంగా పలువురు పోగొట్టుకున్న విలువైన మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రికవరి చేసినట్టు ఎస్పీ అమిత్‌బర్దర్ తెలిపారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడు నెలల కాలంలో బాధితులు పోగొట్టుకున్న రూ.5.45లక్షల విలువైన 51 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.27లక్షల విలువైన 180 ఫోన్లను రికవరి చేసి బాధితులకు అప్పగించామన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన www.ceir.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి Loss Mobile అనే ఆప్షన్ ద్వారా ఐ MEI నంబర్, ఫోన్ మోడల్ వివరాలు నమోదు చేస్తే పోలీస్ శాఖ సాంకేతికతను ఉపయోగించి ఫోన్ ఎక్కడుందో తెలుసుకుంటామన్నారు. ఈ సేవలను మొబైల్ ఫోన్ల బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొబైల్ ఫోన్ల రికవరీలో విశేష కృషి చేస్తున్న స్పెషల్ బ్రాంచి సీఐ బి. అప్పలనాయుడును ఎస్పీ అభినందించారు. -
మరింత చేరువగాఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు
నర్సీపట్నం: ఆర్టీసీ పార్శిల్ డోర్ డెలివరీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా ప్రజా రవాణాధికారి డి.ప్రవీణ సిబ్బందికి సూచించారు. డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె నర్సీపట్నం డిపోలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాన్ని సందర్శించారు. డోర్ డెలివరీ సేవలపై డీఎం ధీరజ్‌ను ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. డోర్ డెలివరీ సౌకర్యాన్ని ఆర్టీసీ 84 పట్టణల్లో అందిస్తుందన్నారు. ఒక కేజీ నుంచి 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. అతి తక్కువ చార్జీలతో అతి వేగంగా భద్రంగా డోర్ డెలివరీ చేయటం ఆర్టీసీ వల్ల సాధ్యమన్నారు. డోర్ డెలివరీ సేవలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ ఎ.గంగాధర్, అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. -
పాఠశాలలో పారిశుధ్య సమస్య పరిష్కరించాలి
అడ్డతీగల: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. పాఠశాల తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాన్ని పరిశీలించారు. పాఠశాలలో కొరవడిన పారిశుధ్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు కనీసం తలుపులు లేకపోవడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. సెప్టిక్ నిండి వస్తున్న దుర్గంధంతో ఎదుర్కొంటున్న సమస్యను విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాఠశాల నిర్వహణపై నిర్లక్ష్యం తెలుస్తోందన్నారు. హెచ్ఎంను బదిలీ చేసి మరొకరిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో పారిశుధ్య సమస్యను వెంటనే యుద్దప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
వాటర్‌షెడ్ చెరువులతో భూగర్భ జలాల వృద్ధి
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజకొయ్యూరు: భూగర్భ జలాల పెంపునకు వాటర్‌షెడ్ పథకంలో నిర్మించిన చెరువులు కీలకపాత్ర పోషిస్తాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. మండలంలో మంప పంచాయతీ రాజులబాబు ఆలయం సమీపంలో నిర్మించిన రెండు చెరువులు, కించవానిపాలెం జలాశయం, గంగవరంలో నిర్మించిన రెండు చెరువులను, మంపలో అల్లూరి పార్క్‌ను, అక్కడ నాడు అల్లూరి స్నానం చేసిన కొలనును సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నివాసం ఉన్న ఉర్లకొండ గుహను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. కొయ్యూరు మండలంలో జీడితోటల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్యాస్ గోడౌన్ మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. గంగవరంలో బోరు లేక గ్రామస్తులు తాగునీటికి పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి రావడంతో బోరు మంజూరు చేసేందు కు చర్యలు తీసుకున్నారు. గంగవరం నుంచి నేరుగా కొయ్యూరు వచ్చేందుకు గతం నుంచి ఉన్నా మార్గాన్ని అభివృద్ధి చేసేందు చర్యలు తీసుకుంటామన్నారు. కించవానిపాలెం జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎంపీపీ బడుగు రమేష్‌బాబు పీవోను కోరారు. ఆమె సానుకూలంగా స్పందిస్తూ వాటర్‌షెడ్ పథకంలో నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన సమాచారం పంపాలని ఆమె వాటర్ షెడ్ ఏపీవో శంకర్రావును ఆదేశించారు. -
ఆధ్యాత్మిక చింతన అవసరం
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుగూడెంకొత్తవీధి: మానవ జీవితానికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, ప్రతీ ఒక్కరు భక్తి మార్గాన్ని అనుసరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు అన్నారు. పెదవలస పంచాయతీ చాపరాతిపాలెంలో నెతన ప్రార్థన మందిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో ప్రశాంతత చేకూరుతుందన్నారు. వైఎస్సార్సీపీ క్రిస్టీయన్ మైనార్టీ అధ్యక్షుడు వసుపతి తిమోతి, ఎంపీపీ బోయిన కుమారి, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షులు, రైతు విబాగ రాష్ట్ర కార్యదర్శి భూసరి కృష్ణారావు, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, తాడ సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడు రమేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కంకిపాటి నారాయణ, నాయకులు కంకిపాటి శ్రీరాములు, బాలరాజు, రామారావు, సత్తిబాబు, ఆనందరావు, చందు, మూర్తి, శివకుమార్, శ్రీధర్ పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న విద్యాశాఖ
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గోపిమూర్తి రంపచోడవరం: ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టించేలా విద్యాశాఖ నిర్ణయాలు ఉన్నాయని ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. మారేడుమిల్లిలో సోమవారం నిర్వహించిన అల్లూరి జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బోధనేతర పనుల వల్ల ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ యూటీఎఫ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ల కాలంలో ఉపాధ్యాయులకు అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పించడానికి విశేషమైన కృషి జరిగినట్టు చెప్పారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. పోలవరం జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడిగా జి.విశ్వరాజ్, గౌరవ అధ్యక్షుడిగా పి.కృష్ణయ్య, సహాధ్యక్షులుగా ఎస్.నాగేశ్వరరావు, బి.వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కె.కృష్ణ, కోశాధికారిగా బొజ్జియ్య, ఆరుగురు కార్యవర్గ సభ్యు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కారం సూరిబాబు, కె.ఆదిరెడ్డి, పి. కొండయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు గోరీ
అనుమతి పేరుతో అదనపు దోపిడీ? ● ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ ● దెబ్బతింటున్న ఇళ్లు, పొలాలు ● అనారోగ్యానికి గురవుతున్న గిరిజనులు ● ధర్నా చేసినా పట్టించుకోని అధికారులు రంపచోడవరం: నియోజకవర్గంలోని గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి అనుకుని ఉన్న నల్లరాయి క్వారీల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.. కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకపోడంతో పేలుళ్ల ధాటికి రాళ్లు, ధూళి ఎరిగిపడుతున్నాయి. బూడిద గ్రామాన్ని కప్పెస్తోందని, అనుమతి లేని ప్రాంతంలో కూడా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిసున్నారు. ఆందోళన చేసినా.. క్వారీల్లో బ్లాస్టింగ్ వల్ల తమ బతుకులు నాశనమతున్నాయని, తవ్వకాలు నిలిపివేయాలని కొన్నాళ్లుగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డిలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. అయినా అధికారులు స్పందించలేదని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజనులు(ఫైల్) ఓజుబంద నల్లరాయి క్వారీల్లో ఇష్టానురీతిగా తవ్వకాలు జరుపుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్వహకులు ఒప్పందాలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని, దీంతో పంటలు, తమ ఆరోగ్యం దెబ్బ తింటున్నాయని వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు వినతులిచ్చినా, ఐటీడీఏ ఎదుట ధర్నా చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వారు తెలిపారు. -
అంబులెన్స్ సేవలు ప్రారంభం
చింతూరు: చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఎంపీ లాడ్స్‌తో మంజూరైన సరికొత్త అంబులెన్స్‌ను ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ సోమవారం ఆస్పత్రి వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతబాబు మాట్లాడుతు ఎంపీ డాక్టర్ తనూజరాణి ఎంతో దూరదృష్టితో చింతూరు సీహెచ్‌సీకు నూతన అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. లోతట్టు ప్రాంత రోగులను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రామలింగారెడ్డి, కోట్ల కృష్ణ, జెట్పీటీసీ మురళి, ఎంపీపీ అమల, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. -
నేటి నుంచి పీసా మహోత్సవ్
సీతంపేట: పీసా(పీఈఎస్ఏ–ది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23, 24వ తేదీల్లో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు. పది రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు విచ్చేస్తున్నారని, వారి భాగస్వామ్యంతో కబడ్డీ, ఆర్చరీ పోటీలు, గిరిజన సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సోమవారం పోర్టు స్టేడియంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో 10కె పీసా రన్ జరుగుతుందని, అనంతరం 9 గంటలకు పోర్టు ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని తెలిపారు. 10 గంటల నుంచి క్రికెట్ స్టేడియంలో మహిళలు, పురుషుల జట్ల ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు జరుగుతాయని వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి క్రీడాకారులు, అధికారులు, గిరిజన ప్రజల ఆధ్వర్యంలో డెమో క్రీడాపోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 24వ తేదీ 11 గంటల నుంచి కళావాణి స్టేడియంలో వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో కూడిన స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా పీసా మహోత్సవ్ మస్కట్ కృష్ణ జింక, పీసా రన్ టీషర్టులను ఆవిష్కరించడంతో పాటు, మహోత్సవ్ బెలూన్ను ఎగుర వేశారు. -
దుంప తీపి..ధర చేదు
సాక్షి, పాడేరు: జిల్లాలో గిరిజన రైతులు సాగుచేస్తున్న చిలగడదుంప పంటకు గిట్టుబాటు ధర కరువైంది. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారపుసంతలు. మండల కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి చిలగడదుంపల కొనుగోలు ధరలను తగ్గించేస్తున్నారు. గత ఏడాది కంటే ధరలను భారీగా తగ్గించడంతో రైతులంతా ఉసూరుమంటున్నారు. 50కిలోల బస్తా ధర గత ఏడాది రూ.1500 ఉండగా, ఈఏడాది రూ.900కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే సగానికి ధర పడిపోయింది. 700 ఎకరాల్లో సాగు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో 700 ఎకరాల్లో చిలగడదుంప పంటను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఎకరంలో నాట్లు వేసేందుకు, కలుపు నివారణ, పంట సేకరణ, దుంపల శుద్ధికి సుమారు రూ.20 వేల వరకూ ఖర్చు అవుతుంది. జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పంట దిగుబడి ప్రారంభమవడంతో తవ్వి సేకరిస్తున్న గిరిజన రైతులు వాటిని శుద్ధి చేసి, వారపుసంతలకు తరలించి అమ్మకాలు జరుపుతున్నారు. జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు వ్యాపారులే నేరుగా వ్యాన్లతో వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గత ఏడాది ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం లభించింది.ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ధరలు తక్కువుగా ఉండడంతో చిలగడదుంప సాగు నష్టాలను మిగులుస్తోందని రైతులు వాపోతున్నారు పలు రాష్ట్రాల్లో డిమాండ్ గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగుచేసే చిలగడదుంపలకు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ,ఒడిశా,పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆయా రాష్ట్రాల్లో పెద్ద వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు స్థానిక వ్యాపారులు.. గిరిజన రైతుల నుంచి చిలగడదుంపలను కొనుగోలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్‌గా చిలగడ దుంపలను కిలో రూ.40 నుంచి రూ.50 వరకూ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. బస్తా దుంపలను రూ.1500కు కొనుగోలు చేసిన వ్యాపారులకు అధిక లాభాలు వస్తున్నాయి, కానీ రైతులు మాత్రం నష్టపోతున్నారు. వర్తకులు నిర్ణయించిందే ధర గిరిజన రైతులు పండించిన చిలగడ దుంపకు మార్కెటింగ్ సదుపాయం లేదు. స్థానిక వర్తకులు గిరిజన గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ధరలు కూడా వారే నిర్ణయిస్తారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకు మాత్రమే రైతులు విక్రయించుకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. చిలగడ దుంప(స్వీట్ పొటాటో)కు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆదివాసీ రైతులు దిగాలు చెందుతున్నారు. దళారులు, వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తుండడంతో తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు చిలగడదుంప పంట సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. రైతు లు తమ సంప్రదాయ విత్తనాలనే సాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా విత్తనా లు పంపిణీ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గించేశారు.. చిలగడదుంప సాగుతో ప్రతి ఏడాది రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. గత ఏడాది 50 కిలోల బస్తాను రూ.1500 ధరతో అమ్మకాలు జరిపి అధిక ఆదాయం పొందాను. ఈ ఏడాది హుకుంపేట, పాడేరు సంతల్లో బస్తా దుంపలను రూ.900కు మించి వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. – కె.తౌడన్న, గిరిజన రైతు, అల్లంపుట్టు, హుకుంపేట మండలం గిట్టుబాటు ధర లేక నష్టం సంతల్లో వ్యాపారులంతా సిండికేట్‌గా మారడంతో నష్టపోతున్నాం. చిలగడదుంపలను వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నారు. నాణ్యతలో నంబర్–1గా ఉన్న మన్యం దుంపలకు ఈఏడాది గిట్టుబాటు ధరలు లేకపోవడం బాధనిపిస్తోంది. –కె.వంతాల రాము, గిరిజన రైతు, కించుమండ, డుంబ్రిగుడ మండలం -
పాఠశాలలకు టీచర్లు డుమ్మా
మట్టిగూడ,చంపాపుట్టు బాలలు చదువులకు దూరంముంచంగిపుట్టు: ఎంటీఎస్ ఉపాధ్యాయులు తరచూ విధులకు డుమ్మా కొడుతుండడంతో మారుమూల గిరిజన విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. మండలంలో రంగబయలు పంచాయతీ మట్టిగూడ ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో భాషా వలంటీర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. సోమవారం ఇద్దరూ పాఠశాలకు రాకపోవడంతో 26 మంది విద్యార్థులకు స్థానిక గిరిజన యువకులే ఉపాధ్యాయులగా మారి చదువు చెప్పాల్సి వచ్చింది. ఇదే పంచాయతీ చంపాపుట్టు ఎంపీపీఎస్ పాఠశాలను కూడా భాషా వలంటీరే నిర్వహిస్తున్నారు. 36 మంది విద్యార్థులకు భాషా వలంటీర్ దిక్కుగా మారారు.ఎంపీఎస్ ఉపాధ్యాయుడు తనకు నచ్చినట్లు పాఠశాలకు వస్తున్నారు. వారంలో ఒకటి లేక రెండు రోజులు మాత్రమే వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో విద్యార్థులకు సరైన విద్య అందని పరిస్థితి నెలకొంది.తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ధనియాతో పాటు ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.దీనిపై మండల విద్యాశాఖాధికారి కృష్ణమూర్తిను వివరణ కోరగా మట్టిగూడ ఎంపీఎస్ టీచర్ సెలవు పెట్టారని, భాషా వలంటీర్ ఉదయం వెళ్లి మధ్యాహ్నం వచ్చేశారని చెప్పారు. చంపాపుట్టు టీచర్ నుంచి ఎటువంటి సమాచారం లేదని,మంగళవారం మట్టిగూడ,చంపాపుట్టు పాఠశాలకు వెళ్లి విచారణ చేసి,చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
అనంతగిరి ఇన్చార్జ్ ఎంపీపీగా శకుంతల
అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి మండలం కివల్ల ఎంపీటీసీ, అనంతగిరి వైస్ ఎంపీపీ శకుంతల సోమవారం అనంతగిరి ఇన్చార్జీ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిపై గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమెకు వ్యతిరేకంగా 11 మంది ఓటువేశారు. దీంతో జెడ్పీ సీఈవో ఉత్తర్వుల మేరకు ఎంపీడీవో ప్రభాకర్ రావు కివర్ల ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అయిన శకుంతలను ఇన్చార్జి ఎంపీపీగా నియమించి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీపీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇన్చార్జీ ఎంపీపీగా శకుంతల కొనసాగుతారని ఎంపీడీవో ప్రభాకర్‌రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గిరిజన మండలాలను కొత్త జిల్లాలో కలపాలి
సాక్షి, పాడేరు: పోలవరం నియోజకవర్గంలోని గిరిజన మండలాలను కొత్తగా ఏర్పాటు చేసే పోలవరం జిల్లాలో కలపాలని ఆ ప్రాంత సర్పంచ్‌లు కోరారు. కుక్కనూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాలకు చెందిన సర్పంచ్‌లు సోమవారం పాడేరులో కలెక్టరేట్‌కు వచ్చి ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్‌ను కలిశారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తుండడంతో ప్రస్తుతం ఉన్న పోలవరం నియోజకవర్గంలోని గిరిజన మండలాలకు న్యాయం చేయాలని వారు డీఆర్వోను కోరారు.పోలవరం జిల్లాలో ఆయా మండలాలను కలపాలని వినతిపత్రం అందజేశారు. -
ఆన్లైన్లో ఉత్తరద్వార దర్శనం టికెట్లు
సింహాచలం: ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఉత్తరద్వార దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయని ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. భక్తులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www. aptemples.ap.gov.in వెబ్సైట్, 9552300009 వాట్సాప్ నంబరు ద్వారా రూ.100, రూ.300, రూ.500 టికెట్లను బుక్ చేసుకోవాలి. పైటికెట్లు పొందిన వారి దర్శనం ముగిసిన తర్వాతే కౌంటర్లలో టికెట్ల విక్రయం యథావిధిగా జరుపుతామన్నారు. దర్శనవేళల్లో మార్పులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు ఈనెల 29 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు లభించవని, భక్తులంతా ఈవిషయాన్ని గమనించాలని సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసం పూజల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు తెలిపారు. -
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు హర్షణీయం
కలెక్టర్ దినేష్‌కుమార్ సాక్షి, పాడేరు: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా కేంద్రంలో 1925లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న నాణ్యమైన కాఫీ గింజలు, వాటి నాణ్యతను వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా మరింత నాణ్యమైన కాఫీ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా గిరిజన రైతులు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ బ్రాండింగ్‌లో అరకు కాఫీని మరింతగా ప్రమోట్ చేసి విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించనున్నట్టు ఆయన చెప్పారు. -
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
రంపచోడవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌కు 71 అర్జీలు ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్ సాహిత్లు పీజీఆర్ఎస్ నిర్వహించి, 71 అర్జీలు స్వీకరించారు. రంపచోడవరం మండలంలో గతంలో నిర్మించిన భూపతిపాలెం ప్రాజెక్టు ముంపు బాధితులైన 104 కుటుంబాలకు ఏఏవై రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎంపీటీసీ తుర్రం వెంకటేశ్వరరావుదొర, కారం బాపన్నదొర తదితరులు అర్జీ అందజేశారు. గంగవరం నుంచి ఎండపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు, బర్రెమామిడి నుంచి మర్రిపాలెం వరకు నాలుగు కిలోమీటర్ల ిబీటీ రోడ్లు నిర్మించాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అర్జీ అందజేశారు. రంపచోడవరం మండలం కాకవాడ నుంచి వెట్టిచెలకలు, చెలకవీధి, దబ్బవలస గ్రామాలకు సంబంధించిన రోడ్డుకు మధ్యలో నాలుగు కల్వర్టులు మంజూరు కాగా మూడు కల్వర్టులు నిర్మించారని ఒక కల్వర్టు నిర్మించలేదని గిరిజనులు చోడి బాపన్నదొర, కుర్ల వెంకటరెడ్డి, పండురెడ్డిలు పీవోకు తెలిపారు. గంగవరం మండలం లక్కొండ పంచాయతీలో 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న 14 మందికి అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేయాలని యాట్ల సరస్వతి, పండా సోమలమ్మ, జర్తా సూర్యకుమారి తదితరులు అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీడీ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ -
జెడ్పీ నిధులతో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు.మండలంలో సుజనకోట పంచాయతీ గొడుగులపుట్టులో జెడ్పీ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న 100 మీటర్ల సీసీరోడ్డు పనులను సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, పలు ప్రశ్నాలకు జవాబులు రాబట్టారు. పాఠశాల ఆవరణంలో అసంపూర్తిగా ఉన్న భవనం గురించి ఆరా తీశారు. పాఠశాల భవనాన్ని పూర్తి చేసేందుకు నిధులు, నూతన అంగన్వాడీ భవనం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. దశాలవారీగా సమస్యలు పరిష్కరించనున్న ట్టు చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్టు చెప్పారు. చంద్రబాబు ప్రభు త్వ పాలనలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పింఛన్ల ఊసే లేదన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేష్, బాబూరావు, నరసింగరావు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, గణపతి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు,వైఎస్సార్సీపీ జిల్లా నేత మూర్తి, ఉపసర్పంచ్ రుక్మిణి,నేతలు తిరుపతిరావు,సన్యాసిరావు పాల్గొన్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
గోరాపూర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
డుంబ్రిగుడ: మండలంలోని గోరాపుర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంధ్ర– ఒడిశా సరిహద్దు రహదారి కిందన తుప్పల చాటున గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలంలో చేరుకున్నట్టు చెప్పారు. మృతుడు ప్యాంటు, బ్రౌన్ రంగు బెల్టు, కుడి చేతిపై ఆంజనేయస్వామి బొమ్మ (టుటూ) ఉందన్నారు. మృతుడి వయసు సుమారు 25 ఏళ్లు ఉండవచ్చన్నారు. ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ స్థానికులతో పాటు రైల్వే రోడ్డుకు పనికొచ్చిన వారిని విచారించామన్నారు. మృతుడి ఆచూకీ కోసం గోరాపుర్, గొడ్డిగుడ గ్రామస్తులను విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తిగా గత అయిదు రోజులుగా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు స్థానికులు తెలిపారన్నారు. మృతదేహాన్ని అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతిపై అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం
దేవరాపల్లి: రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బి.బాలునాయక్ తెలిపారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో దేవరాపల్లి మండల రైవాడ అథితి గృహానికి చేరుకొని స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5,459 కోట్లు కేటాయించిందని, కొన్ని పనులు జరుగుతుండగా మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు కొంతమేర అడ్డంకిగా మారినప్పటికీ ఇప్పటికే 128 పనులకు అనుమతులు సాధించామన్నారు. అకాల వర్షాలతో రోడ్ల నిర్మాణ పనులలో కొంత మేర జాప్యం జరిగిన మాట వాస్తమేనని, ఇకపై వేగవంతం చేసేందుకు విశాఖలో ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో సమీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పీఆర్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, పాడేరు ఈఈ కొండయ్య పడాల్, అరకు డీఈఈ రామం, మాడుగుల పీఆర్ డీఈఈ ఎ.శ్రీనివాసరావు, దేవరాపల్లి పీఆర్ ఏఈ పి.సుమతి తదితరులు ఉన్నారు. -
అందుబాటులోకి గోనె సంచులు
రాజవొమ్మంగి: మండలంలోని ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 10 వేల గోనె సంచులు సరఫరా చేశామని ఏఓ చక్రధర్ విలేకరులకు తెలిపారు. గోనె సంచుల కొరతతో రైతుల అవస్థలు అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు వాతంగి సర్పంచ్ భీంరెడ్డి శుభలక్ష్మి తదితరులు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను కలిసి సంచుల కొరత గురించి ప్రస్తావించారు. దీంతో అనంతబాబు సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించి గోనె సంచుల కొరత లేకుండా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు ఏర్పాటుచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఆపదలో ఉన్నవారికి అండగా వైఎస్సార్సీపీ
చింతూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. చింతూరు వైఎస్సార్సీపీ వార్డు సభ్యుడు మల్లికార్జున్‌కు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి రావడంతో సోమవారం ఎమ్మెల్సీ అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఎమ్మెల్సీ వెంట జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళీ, మండల పార్టీ అధ్యక్షుడు వై.రామలింగారెడ్డి, కోట్ల కృష్ణ, సర్పంచ్ కారం కన్నారావు తదితరులున్నారు. రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన వైఎస్సార్సీపీ నాయకురాలు నోరి వీరలక్ష్మిని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. ఆమె కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. విషయం తెలిసిన నాయకులు ఆమెను స్వయంగా పలుకరించి ధైర్యం చెప్పారు. వీరలక్ష్మిని పరామర్శించిన వారిలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ తదితరులున్నారు. వి.ఆర్.పురం: వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు మాతృమూర్తి అమృతవల్లి మంగతాయారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆమె సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అనంతబాబు హాజరై మంగతాయారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కన్వీనర్లు మాదిరెడ్డి సత్తిబాబు, రామలింగరెడ్డి, నాయకులు గంగులు, సత్యనారాయణ, బాలకృష్ణ, నరేష్, రామారావు, మరియదాసు, గాంగధర్, వీర్రాజు, కృష్ణ, చింతూరు జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చాడి మురళీ తదితరులు పాల్గొన్నారు. -
మరో క్వారీ నిర్వహణకు నిరాకరణ
మరో క్వారీ నిర్వహణకు నిరాకరణ గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి అనుకుని మూడు క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒప్పందం ప్రకారం క్వారీల ద్వారా వచ్చిన ఆదాయంలో గ్రామాభివృద్ధికి కొంత నగదు ఇచ్చే వారు. పదేళ్ల నుంచి క్వారీ నిర్వాహకులు గ్రామాభివృద్ధికి చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పాత క్వారీలు కాకుండా కొత్త క్వారీ నిర్వహణకు ఓజుబందలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించగా గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న క్వారీల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటే మరో క్వారీకి అనుమతులు ఎలా ఇస్తారని నిలదీశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్వారీలో కూడా తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
గాయపడిన హెచ్ఎం ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి
పాయకరావుపేట : బస్సెక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల కిందపడి గాయపడిన ఎస్.నర్సాపురం జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం ఎం.ఝాన్సీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ జి.అప్పన్న, ఎంఈవో రమేష్‌బాబు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. హెచ్ఎం ఎం.ఝాన్సీ (62) 20 వ తేదీ శనివారం పాఠశాలలో విధులు ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు పాయకరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్‌కి వచ్చి అనకాపల్లి వెళ్లడానికి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. బస్ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో ఆమె పుట్‌పాత్ నుంచి కాలు ఇరుక్కుపోయి కిందపడిపోయారు. వెంటనే ఆమెను ఉపాధ్యాయులు తుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి అక్కడ నుంచి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం శనివారం రాత్రి 2.30 గంటలకు మృతి చెందారు. -
ఘనంగా తిరుప్పావై సేవ
పెందుర్తి: ‘ఓ చిన్నదానా పక్షులు అరుస్తున్నాయి. గరుడుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు.. బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించిన వాడు.. సముద్రంలో శేషశయ్యపై యోగనిద్రలో ఉన్నవాడు.. జగత్తులన్నింటికీ కారణమైన సర్వేశ్వరుని మనసుల్లో ధ్యానిస్తూ యోగులు, మునులు హరీహరీ అంటూ మెల్లగా లేస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనస్సులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది. నీవు కూడా నిద్రలేచి రావమ్మా’.. అంటూ వేంకటాద్రి వాకిట 6వ పాశుర పఠనాన్ని అర్చకులు భక్తిపారవశ్యంలో చేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం వేకువజామున ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో అర్చక పరివారం స్వామివారిని మేల్కొలిపి హారతి, సేవాకాలం, శాత్తుమురై, తిరుప్పావై పారాయణం చేశారు. ప్రవచనం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తీర్థ గోష్టి, ప్రసాద వితరణ చేపట్టారు. ఈవో నీలిమ ఏర్పాట్లు సమీక్షించారు.భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు -
ఘనంగా పగల్‌పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలుసింహాచలం (విశాఖ): సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలు రెండవ రోజు ఆదివారం వైభవంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకీలో వేంజేపచేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ బేడామండపంలో విశేషంగా తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో విశేషంగా తిరువీధి నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 6వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. మార్మోగిన హరినామస్మరణ కొమ్మాది: హరే కష్ణ, హరే రామ నామస్మరణతో సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఆదివారం మార్మోగింది. వారాంతపు పూజలు సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. రాధాకృష్ణులు, సుభద్ర, బలభద్ర జగన్నాథుడు, సీతారాములు, ఆంజనేయ, నరసింహస్వామి విగ్రహాలను వివిధ వర్ణాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అనకాపల్లి బాలికల ప్రతిభ
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానం, బాపట్ల జిల్లా జట్టు రెండో స్థానం సాధించాయి. ముగింపులో ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ విజయ్‌కుమార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి, ఒలింపిక్ సంఘం కార్య నిర్వహణ కార్యదర్శి సునీల్‌కుమార్, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, కప్పులను అందజేసి అభినందించారు. జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా హిందూ సమ్మేళనం
జి.మాడుగుల: ప్రజలంతా భక్తిభావంతో దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రసార ప్రముఖ్ ఆదిత్య తెలిపారు. మండలంలో సొలభం పంచాయతీ గొడుగుమామిడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమిలికి చెందిన సద్గురు సాయిరాం స్వామీజీ మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రామనికి హాజరైన అతిథులకు గిరిజన సంప్రదాయంగా అడ్డాలకుతో తయారు చేసిన గిడుగులతో సన్మానించారు. విల్లంభులను అందజేశారు. థింసా నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎస్ఎస్ఎఫ్ జిల్లా పరియోజన ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, ఎస్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కొండబాబు, లక్ష్మి, నీలకంఠం, భాస్కరరావు, వరహాలమ్మ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. దేవీపట్నం: మండలంలోని చినరమణయ్యపేట పంచాయతీ గుబ్బలంపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఆదివారం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా విచ్చేసిన పిఠాపురానికి చెంఇన విశ్వానంద భారతి దత్తస్వామి మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని, మత మార్పిడులు, మత విద్వేషాలు నిరోధించాలన్నారు. పులిబోను నాగరాజు, యర్రమళ్ల శ్రీను, ముండ్రు నాగశ్రీ, రావిపాటి గోవిందరావు, కట్టుమూరి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ అనర్థాలపై అవగాహన
సీలేరు: జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌కు దూరం ఉండాలని అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇది విద్యార్ధి దశ నుంచే అలవరచుకోవాలని జెన్కో ఇంజనీర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. సీలేరులోని ఏపీ జెన్కో కల్యాణ మండపంలో ఆదివారం డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ ఎండీ యాసిన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్ధాలను దూరంగా ఉండి, చదువుతో పాటు సృజనాత్మకత కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు డి.సునీల్ మరియు భానుప్రకాష్ మరియు స్థానిక యువత సహకారంతో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఏపీ జెన్కో రిటైర్డ్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి , ఎంపీటీసీ సభ్యుడు సాంబమూర్తి , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకరరావు పాల్గొన్నారు. -
ఉద్యమ కమిటీలో చీలిక
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ దాదాపు 70 రోజులపాటు మత్స్యకారులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం ముగింపు పలికింది. ఆదివారం రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి నూకతాత ఆలయం వద్ద మత్స్యకారులు ధర్నా కోసం వేసిన టెంట్లను మత్స్యకారులతో తొలగింపజేశారు. టెంట్ల తొలగింపుపై మత్స్యకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైన హామీ లేకుండా టెంట్లు తొలగించడాన్ని కొంతమంది తప్పు పడుతూ ఆదివారం రాత్రి పోలీసు సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తామని హోం మంత్రి అనిత ఇచ్చిన హామీతో మత్స్యకారులు నెల రోజుల క్రితం తాత్కాలికంగా దీక్షను విరమించిన విషయం తెలిసిందే. శనివారం తాళ్లపాలెం వచ్చిన సీఎం చంద్రబాబు వద్దకు మత్స్యకారులను తీసుకెళ్లారు. ఆయన కేవలం రెండు నిమిషాలు మాట్లాడి ‘మీ గ్రామ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని, ఇంకా ఏమైనా సమస్యలుంటే హోం మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడండి’ అని ముగించేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మత్స్యకారులు చేసేదేమీ లేక మెత్తబడ్డారు. ఇదే అవకాశంగా భావించిన అధికారులు ఆదివారం గ్రామంలోకి వెళ్లి నూకతాత ఆలయం వద్ద నిరాహార దీక్ష కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. గ్రామస్తులతో పోలీసుల సమావేశం తొలుత డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం లేదని సీఎం తెలియజేసినందున టెంట్లు స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయమని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీన్‌పార్క్ మాత్రమే ఏర్పాటు చేయాలని రాతపూర్వకంగా రాసివ్వాలని కొందరు మత్స్యకారులు కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు వెళ్లి కోరాలని కొంతమంది మత్స్యకారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత టెంట్లు తొలగించాలని సమావేశానికి వచ్చిన కొంతమంది మత్స్యకారులు సూచించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుని టెంట్లు తొలగించాల్సిందేనని, మీరే స్వయంగా టెంట్లు తొలగిస్తే బాగుంటుందని, తాము గనుక తొలగిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. కమిటీగా ఏర్పడిన వారిలో కొంతమంది టెంట్లు తీసేందుకు సిద్ధపడగా కొంతమంది సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ లేకుండా టెంట్లు తీయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద ఉద్యమ కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదని, కేవలం ఉద్యమాన్ని నీరు గార్చడం కోసమే రాజయ్యపేటలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. గ్రామంలో సమావేశమైన మత్స్యకారులు రాజయ్యపేటలో నిరాహార దీక్ష కోసం వేసిన టెంట్ల తొలగింపు -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1లో 2002–2003 టెన్త్ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది.అల్లూరి ,విశాఖపట్నం ,అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం,హైదరాబాద్ తదితరు ప్రాంతాల నుంచి సుమారు 68 మంది పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. 22 సంవత్సరాల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అలనాటి జ్ఞాపకాలను, మధుర స్మతులను నెమరు వేసుకున్నారు. మండలంలో గల ఏనుగురాయి పంచాయతీ పర్తాపుట్టులో ప్రైవేట్ మీటింగ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఏడాది పాఠశాలలో అందరూ కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అలనాటి గురువులైన ప్రకాశ్, జేఎస్ఎన్మూర్తి, గోపిక్రిష్ణ, దాలయ్యబాబు, నారాయణ, రమణమూర్తి, రాంబాబు, చలపతిరావు, ప్రసాదరావు, జానకిరావు, అప్పలకొండ, వెంకటలక్ష్మీ, జోగారావు, నాగరాజు,భాగత్రాం, అక్కరావు, నాగలక్ష్మీ, జోగారావు, గోపికృష్ణలను ఆహ్వానించి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. గురువుల నుంచి ఆశీర్వాదాలు పొందారు. గురువులతో కలిసి పూర్వ విద్యార్థులు థింసా నృత్యాలు చేశారు. -
అలరించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు
చీడికాడ : మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా చుక్కపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు అలరించాయి. పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. జగన్మోహన్రెడ్డి దార్శనికుడని, అందువల్లనే ఆయన జన్మదినం అంటే పల్లెల్లో మందస్తు సంక్రాంతి పండగేనన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. విజయనగరం, ఉమ్మడి విశాఖ,తూ.గో జిల్లాలకు చెందిన 27 ఎడ్ల బళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో చీడికాడ, దేవరాపల్లి వైఎసా్‌స్‌ర్‌సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, బూరే బాబురావు, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సుంకర లక్ష్మి, యూత్ అధ్యక్షుడు గొల్లవిల్లి స్వామినాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పోటీల్లో మాడుగుల మండలం కె.జె.పురానికి చెందిన కొయిలాడ మోహన్ బండి ప్రథమస్థానంలో నిలిచి బహుమతి గెలుచుకుంది. రెండవ స్థానంలో శ్రీ పరదేసిమాంబ వావిలపాడు బండి నిలిచింది. విజేతలకు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు,సర్పంచ్ మజ్జి లక్ష్మణమ్మ, ఎంపీటీసీ సభ్యులు సుంకర లక్ష్మీ, బాయిశెట్టి వెంకటరమణ, సకలా రమణ,పెంటకోట ఈశ్వరరావు బహుమతులు ప్రదానం చేశారు. -
పోటెత్తిన పర్యాటక లోకం
పాడేరు : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు పాడేరు తరలివచ్చారు. వంజంగి, పాడేరులోని హొటళ్లు, రిసార్టులు, క్యాంపెయిన్ టెంట్లలో బస చేశారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు వంజంగి మేఘాల కొండపై క్యూ కట్టడంతో రద్దీ నెలకొంది. వేకవజామున సూర్యోదయ అందాలు, మంచు అందాలను తిలకించారు. ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. వంజంగి హిల్స్‌ను ఆదివారం సుమారు 2,500మంది సందర్శించినట్టు అంచనా. చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. చెరువుల వేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను తిలకించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని సందడి చేశారు. జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి భారీగా సందర్శకులు తరలివచ్చారు. ప్రత్యేక వాహనాల్లో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. బండరాళ్లపై నుంచి ప్రవహించే జలపాతంలో స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. గిరిజన వస్త్రధారణతో సంప్రదాయ థింసా నృత్యాలు చేస్తూ సందడి చేవారు. జలపాతంలో స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. బ్యాంబూ బిరియాని, బ్యాంబూ చికెన్ అమ్మకాలు భారీగా జరిగాయి. వజంగి మేఘాల కొండకు పోటెత్తిన పర్యాటకులు భారీగా తరలివచ్చిన సందర్శకులు -
జన నీరాజనం.. జగన్మోహనం
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపుట్టినరోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతోవాడవాడలా పండుగ వాతావరణంనెలకొంది. కేవలం వేడుకలకే పరిమితంకాకుండా విస్తృత సేవా కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఊరూరా కేక్ కటింగ్‌లు, సంబరాలు మిన్నంటాయి. పాడేరు : జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోదకొండమ్మ తల్లి ఆలయంలో ఆయనతోపాటు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, పార్టీ నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అద్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ శ్రేణుల సమక్షంలో కట్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, జగనన్న అభిమానులు, మహిళలు, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాలసదనంలో .. పట్టణంలోని ప్రభుత్వ బాలసదనంలో జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ చిన్నారులు ప్లకార్డులతో శుభాకాంక్షలు తెలిపారు. వారి సమక్షంలో బర్త్‌డే కేక్‌ను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చెట్టి వినయ్, మహిళా విభాగం అధ్య క్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా ప్రధాన కార్యద ర్శి సీదరి మంగ్లన్నదొర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, ఐటీ విభాగం జిల్లా అద్యక్షుడు కూడా సుబ్రమణ్యం, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి కూతంగి సూరిబాబు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డుంబ్రిగుడ/(అరకులోయ టౌన్): స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలిసి ఇక్కడి నాలుగు రోడ్ల జంక్షన్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పార్టీ కార్యాలయంలో కూడా శ్రేణులు, అభిమానుల సమక్షంలో మరో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం వంద మంది మహిళలకు చీరలు, పురుషులకు వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ దమ్మున్న నాయకుడు మన జగనన్న అందరికీ అండగా ఉంటారన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిన్నరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పాలు, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్ విజయ్, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు కొర్ర సూర్యనారాయణ, స్వాభీ రామూర్తి, పాంగి పరశురామ్, పాంగి అనిల్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జనరంజక పాలనను ప్రజలు మరువలేదు అని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రాజవొమ్మంగి గాంధీబొమ్మ సెంటర్లో ఆదివారం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదన్నారు. ఉపాధి వేతన దారులకు ఆరు నెలలుగా వేతనాలు అందజేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అరాచక పాలన ఇక ఎన్నాళ్లో సాగదని హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యే వస్తున్నారంటే గ్రామాల్లో ప్రజలు నీరాజనాలు పట్టే వారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రానున్నది మన జగనన్న ప్రభుత్వమే అని వారు పేర్కొన్నారు. పేదలకు రగ్గులు, మిఠాయిలు పంచిపెట్టారు. పార్రీట మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, చీడి శివ, సవిరెల చంద్రుడు, ఎంపీటీసీలు గంగదుర్గ, చంద్రరాణి పాల్గొన్నారు.జనం గుండెల్లో చెరగని ముద్ర ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ముంచంగిపుట్టు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో ఆమె, మండల నేతలు బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీలో రోగులకు పాలు,రొట్టెలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్న పాలనలో పేద,బడుగు బలహీన వర్గాలను సంక్షేమ పాలన అందిస్తే నేడు ఆయా వర్గాలను టీడీపీ ప్రభుత్వం క్షోభకు గురి చేస్తోందని విమర్శించారు. ,రాష్ట్ర ప్రజలంతా మళ్లీ జగనన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, సర్పంచులు రమేష్,బాబూరావు, నీలకంఠం,వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి జగబంధు,ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, కమల, మండల వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన జగనన్న పుట్టినరోజు వేడుకలు వాడవాడలా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహణ పేదలకు అన్నదానం కోలాహలంలో వెల్లివిరిసిన పండగ వాతావరణం -
పల్స్‌పోలియో విజయవంతం
● జిల్లావ్యాప్తంగా 94 శాతం మేర చిన్నారులకు చుక్కల మందు ● డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ పాడేరు : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 64 పీహెచ్‌సీల పరిధిలో 1,29,959 మందిలో 94శాతం మేర 1,15,654 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్టు ఆయన పేర్కొన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పరిశీలించారు. చిన్నారులకు ఆమె చుక్కల మందు వేశారు. డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటుచేసిన కేంద్రంలో చిన్నారులకు స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మించి చిన్నారులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వైద్యాధికారులు కమల, సిబ్బంది పాల్గొన్నారు. రెండు చుక్కలు చిన్నారులకు రక్షణ : ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ముంచంగిపుట్టు: చిన్నారుల బంగారు భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలోని పోలియో చుక్కల కేంద్రాలను ఆదివారం సందర్శించిన ఆమె చిన్నారులకు చుక్కలమందు వేశారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, రెండు చుక్కలు చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ఎంపీపీ సీతమ్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, వైద్యులు నిఖిల్, వివేక్, శ్యాంప్రసాద్, సీహెచ్‌వో శౌరి తదితరులు పాల్గొన్నారు. చింతూరు డివిజన్లో 10,848 మందికి.. చింతూరు: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చింతూరు డివిజన్లో 0 నుంచి 5 ఏళ్లలోపు 10,848 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య తెలిపారు. ఎర్రంపేట ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
చలి, మంచుతో ఇబ్బందులు
● స్థిరంగా కనిష్ట ఉష్ణోగ్రతలు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ముంచంగిపుట్టు 5.9, జి.మాడుగులలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్లో పెదబయలు 8.3, అరకువ్యాలీలో 8.8, పాడేరు, చింతపల్లిలో 9.2, హుకుంపేటలో 9.9, కొయ్యూరులో 12.3 డిగ్రీలు నమోదయ్యాయి. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6, మారేడుమిల్లిలో 11.0, రాజవొమ్మంగిలో 12.8, అడ్డతీగలలో 14.3, రంపచోడవరంలో 14.6, గంగవరంలో 16.2 ఉష్ణోగ్రతలు నమోదు కాగా చింతూరు డివిజన్లో చింతూరు 14.1, ఎటపాకలో 14.6 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు. -
ఇన్ సర్వీసు టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
● టీచర్స్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు విజ్ఞప్తి పాడేరు రూరల్: ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుంచి మిన హాయించాలని టీచర్స్ఫెడరేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటపతిరాజు డిమాండ్ చేశారు. టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు ఆధ్వర్యంలో ఆదివారం పాడేరులో నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమవేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కనీస స్పందన లేదన్నారు. నూతన విధానాలతో ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్‌లో ఉండాలని ఆంక్షలు విధించడం సరికాదన్నారు. పీఆర్సీ క మిటీ ఏర్పాటుచేసిన ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలనుంచి మిహయింపు ఇవ్వడమే కాకుండా వివిధ రకాల ఒత్తిడిలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ప్రధా న కార్యదర్శి ధనుంజయ్, ఉపాధ్యక్షులు శ్యాంసుందర్, నాగేశ్వరరావు,చిన్నారావు పాల్గొన్నారు. -
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
● కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపు ● 1,29,959 మంది చిన్నారులకు చుక్కలమందు లక్ష్యం ● 1.82లక్షల డోస్‌లు సిద్ధం పాడేరు : జిల్లాలో ఆదివారం జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఐటీడీఏ ఎదుట ఆయనతోపాటు అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ రవిబాబు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 0 వయసు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఆదివారం చుక్కల మందు వేయించలేని పిల్లలకు ఈనెనెల 22,23 తేదీల్లో ఇంటింటికి సర్వే చేపట్టి శతశాతం పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 64పీహెచ్‌సీల పరిధిలో 1,29,959 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీరికోసం 1.82లక్షల డోస్‌లు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లావ్యాప్తంగా 2506 కేంద్రాలు 10,024 మంది వ్యాక్సినేటర్లు, 233 మంది పర్యవేక్షకులను నియమించామన్నారు. 37ట్రాన్సిట్ పాయింట్లు, 74 సంచార బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం పల్స్ పోలీయో గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృస్ణమూర్తి నాయక్, ఎంపీపీ రత్నాలమ్మ, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి డుంబ్రిగుడ: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. ఆదివారం చేపట్టనున్న పల్స్‌పోలియో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి గ్రామంలో బస్టాప్, పర్యాటక ప్రదేశాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి 0–5 సంవత్సరాల వయసు గల చిన్నారులందరికి పోలియో చూక్కలు వేయించాలని సిబ్బందికి సూచించారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇంటింటికి సర్వే నిర్వహించి నూరుశాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులు రాంబాబు, అంబికా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చింతూరు: పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి డివిజన్ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పల్స్ పోలియోకు సంబధించిన బ్యానర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్లోని నాలుగు మండలాల్లో 0 నుంచి 5 ఏళ్లలోపు 10,710 మంది చిన్నారులు ఉన్నారన్నారు. తొలిరోజు వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 387 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో చుక్కలు వేసేందుకు 1,548 మంది వ్యాక్సినేటర్లను, వారిని పర్యవేక్షించేందుకు 40 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. కొండలపై ఉంటున్న కొండరెడ్డి కుటుంబాలు, వలస ఆదివాసీ గ్రామాల పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు గాను డివిజన్లో 43 కేంద్రాలను మైగ్రేటరీ, హైరిస్క్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని, ఆయా కేంద్రాల్లో ప్రారంభానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రామతులసి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, తహసీల్దార్ సయ్యద్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాసదొర, సీడీపీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. రంపచోడవరం: ఏజెన్సీలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో పోలియో చుక్కల ర్యాలీని ఎస్టీ కమిషన్ మెంబరు గొర్లె సునీత, పీవో స్మరణ్‌రాజ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మాట్లాడుతూ ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పోలియో రహిత దేశంగా, రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందన్నారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల్లో 18,164 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లులున్నారని, ఇందుకోసం పోలియో చుక్కల డోసుల సిద్ధం చేశామన్నారు. అంబేడ్కర్ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏడీఎంహెచ్ఓ సరిత, డీడీ రుక్మాండయ్య, ఎంపీడీవో స్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న చలి, మంచు
చింతపల్లి: జిల్లాలో చలి, మంచు తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. శనివారం జి.మాడుగులలో 4.7 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 5.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 5.8 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీలు, పాడేరులో 6.7 డిగ్రీలు, పెదబయలులో 6.9 డిగ్రీలు, హుకుంపేటలో 7.7 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.1 డిగ్రీలు, కొయ్యూరులో 12.7 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ● రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 9.9 డిగ్రీలు, వై. రామవరంలో 10.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.4 డిగ్రీలు, అడ్డతీగలలో 14.3 డిగ్రీలు, గంగవరంలో 15.0 డిగ్రీలు, రంపచోడవరంలో 15.3 డిగ్రీలు, చింతూరు డివిజన్లో ఎటపాకలో 13.1 డిగ్రీలు, చింతూరులో 13.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. ● వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.దీంతో అన్నివర్గల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు తెరలు ఉదయం 9గంటల వరకు వీడటం లేదు. డుంబ్రిగుడ: మండలంలో చలితీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు.గురువారం 3.8 డిగ్రీలు, శుక్రవారం 4.4 డిగ్రీలు, శనివారం 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. జి.మాడుగులలో 4.7, ముంచంగిపుట్టులో 5.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి వెల్లడి -
విద్యుత్ ఆదాపై అవగాహన
జి.మాడుగుల: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో ఏఈ వెంకటరమణ, తహసీల్థార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో డేవిడ్‌రాజ్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఆదాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న సోలార్ ప్లాంట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఈవో బాబూరావుపడాల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయ్‌కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సుబ్రమణ్యం, ఎల్ఐ షాజహాన్, లైన్మేన్లు మొహిద్దీన్, జోగిరాజు, దొర పాల్గొన్నారు. చింతపల్లి: ఇందన పొదుపు వారోత్పవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యుత్‌శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కోట్ల సన్నిరాంబాబు మాట్లాడుతూ విద్యుత్ అనవసరంగా వాడుకోకుండా పొదుపుగా వాడుకోవడం వలన సొమ్ము ఆదా అవుతుందన్నారు.తహసీల్దార్ శంకరరావు, ఏఈఈ ప్రభాకరరావు, లైన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్తొన్నారు. -
సమయపాలన పాటించని బస్సులు.. తప్పని అవస్థలు
● ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ● విశాఖపట్నం వెళ్లేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసిన వైనం ● హర్షం వ్యక్తం చేసిన గిరిజనులు పాడేరు: పాడేరు ఆర్టీసీ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు చివరి బస్ ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ప్రయాణికులు స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. ఆదివారం విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో టెట్ పరీక్షతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలకు సంబందించి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం పరీక్షా రాసేందుకు పలువురు ఉపాద్యాయులు, నిరుద్యోగులు బస్సుల్లో వెళ్లేందుకు వచ్చామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆయన ఆర్టీసీ డీఎం దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని చెప్పడంతో విశాఖపట్నం వెళ్లేందుకు బస్సును అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆర్టీసీ డీఎంకు సూచించారు. -
విద్యార్థులు పఠనాశక్తి పెంపొందించుకోవాలి
రంపచోడవరం: ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ శనివారం ఇర్లపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో రోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు అనంతరం, స్నానాపానాలు చేసి అల్పాహారం తీసుకున్న తరువాత తరగుతులకు వెళ్లే ముందు ముస్తాబు కావాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్దగా విని చదువులో రాణించాలన్నారు. వ్యక్తిగత శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. డీడీ రుక్మాండయ్య, ఏటీడబ్ల్యూ శంభుడు ,హెచ్ఎం రాజేశ్వరి పాల్గొన్నారు. చింతూరు: చిన్న, చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా పెద్ద మార్పులు సాధ్యపడతాయని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. స్థానిక గురుకుల పాఠశాలలో శనివారం ఆయన ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పీవో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థుల పఠనాశక్తిని పెంపొందించేందుకు వంద రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని, ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీవో రామతులసి, ప్రిన్సిపాల్ సుభ్రహ్మణ్యం పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ ఇంగ్లిష్ మీడియం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై హెచ్ఎం సుజాత అవగాహన కల్పించారు. -
బకాయి వేతనాలు చెల్లించాలి
అడ్డతీగల: వేతన బకాయిలతో పాటు ఇతర ఆర్ధిక ప్రోత్సాహకాలను వెంటనే చెల్లించాలని కోరుతూ వైద్య ఉద్యోగులు శనివారం అడ్డతీగల మండలం ఎల్లవరం పీహెచ్సీ ఎదుట నిరసన చేపట్టారు.యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షురాలు పి.సత్యవతి, ఉపాధ్యక్షుడు బి.దుర్గారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.రాజవొమ్మంగి మండలం లాగరాయి పీహెచ్సీలో పనిచేస్తున్న ఇద్దరు ఫార్మసిస్టులకు 13 మాసాలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. క్షేత్రస్ధాయి సిబ్బందికి నాలుగేళ్లుగా ఎఫ్‌టిఎ, యూనిఫాం అలవెన్సులు చెల్లించడం లేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అందజేయాల్సిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పదోన్నతులను కూడా కల్పించకుండా ఆర్డీ కార్యాలయం అధికారులు అన్యాయం చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలని లేకుంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్దంగా మా ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. -
అరకు ఎంపీ చొరవతో పది అంబులెన్సులు
పాడేరు : అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి చొరవతో జిల్లాకు పది అంబులెన్సులు సమకూరాయని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. శనివారం ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారి వద్ద పది కొత్త అంబులెన్సులను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, కలెక్టర్ దినేష్‌కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ చొరవతో అప్పటి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ నిధులతో ఏకంగా పది అంబులెన్సులు సమకూర్చడం గొప్ప విషయమన్నారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో గిరిజనులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రులకు తరలించేందుకు పడుతున్న అవస్థలు కళ్లారా చూశానన్నారు. దీంతో తాను ఎంపీగా గెలిచిన వెంటనే సమస్యను అప్పటి వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంట్ నిధులతో పది అంబులెన్సులు మంజూరు చేయించినట్ట చెప్పారు. వీటిని సక్రమంగా వినియోగించి రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు వినియోగించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి. ప్రతాప్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలకుమారి, జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాడేరులో జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ తనూజరాణి తదితరులు -
జగనన్న పాలనలో సంక్షేమ పరవళ్లు
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఏటా రూ.వందల కోట్లలో లబ్ధి చేకూరింది. ఏడాదికి రైతు భరోసా పథకంలో 1.68 లక్షల మందికి రూ.127 కోట్లు, అమ్మ ఒడి పథకంలో 1,01,170 మందికి రూ. 152 కోట్లు, పింఛను కానుకలో 1,28,562 మందికి రూ.465 కోట్లు, చేయూత పథకంలో 53,735 మందికి రూ.100.81కోట్లు ప్రభుత్వం అందజేసింది. ఆసరా పథకంలో 85,167 మందికి రూ.134.37కోట్లు, కాపునేస్తం 1510 మందికి రూ.2.26 కోట్లు, వాహనమిత్రలో 3353 మందికి రూ,3.35కోట్లు, సున్నా వడ్డీ పథకంలో 12,818 మందికి రూ.18,26కోట్లు, జగనన్న తోడు పథకంలో 7862 మందికి రూ,7.86 కోట్లు, కల్యాణమస్తులో 562 మందికి రూ.0.35కోట్లు, విద్యాదీవెనలో 13,578 మందికి రూ.17,31కోట్లు, వసతిదీవెనలో 7,550 మందికి రూ.7.25 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఆరోగ్యశ్రీలో 10,634 మందికి రూ.22,98 కోట్లు, గృహ నిర్మాణం 15,783కు రూ.62.98 కోట్లు, వైఎస్సార్బీమా 2058 మందికి రూ.26.33 కోట్లు అందజేసింది. -
గిరి విద్యార్థులకు వరం ఆంగ్ల మాధ్యమం
● కిల్లోగుడలో ఆధునిక వసతులతో ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాల ● సద్వినియోగం చేసుకుంటున్న 602 మంది విద్యార్థులుట్యాబ్తో ఎంతో ఉపయోగం నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ట్యాబ్ ఇచ్చారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ను ఉపయోగించుకుని ఇంగ్లీష్, లెక్కలు, సోషల్, సైన్సు సబ్జెక్టుల్లో మంచిగా చదువుకుంటున్నా. ప్రతిరోజు ఉపాధ్యాయుల బోధించే అంశాలపై అవగాహన పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – కిల్లో చిన్నమ్మి, కేజీబీవీ పాఠశాల, డుంబ్రిగుడ అవగాహన పొందా.. గత ప్రభుత్వంలో అందించిన ట్యాబ్‌లతో సబ్జెక్టుపై ఎంతో కొంత అవగాహన పొందా. చదువుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇటువంటివి కొనుక్కునేందుకు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిపోదు. ప్రస్తుతం టెన్త్ చదువుతున్న 80 విద్యార్థుల్లో అందరికీ ట్యాబ్‌లు ఉన్నాయి. దీనికి జగన్ అంకుల్ అందించిన సహకారమే. – సొల్లొంగో అనూష, ఇంగ్లీష్ మీడియా పాఠశాల, కిల్లోగుడ డుంబ్రిగుడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నాడు – నేడు పథకంలో ఎన్నో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఇందుకు కిలోగుడ ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక చిన్న ప్రాంతంలోని పాఠశాల, నేడు జాతీయ రహదారి పక్కన ఆధునిక వసతులతో 602 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే స్థాయికి ఎదిగింది. మొదట్లో కిల్లోగుడలో దీనిని కేవలం మూడు గదుల్లో నిర్వహించేవారు. నాడు–నేడు పథకంలో ఈ పాఠశాలను అరకు ● పాడేరు జాతీయ రహదారిలో జైపూర్ జంక్షన్ నిర్మించారు. ఆధునిక వసతుల కల్పించి గిరి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. నేడు విశాలమైన భవనంలోకి మారడం వల్ల విద్యార్థులకు మెరుగైన వాతావరణం లభించింది. ఒకప్పుడు ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం అనుకున్న ఇంగ్లీష్ మీడియం విద్యను, గిరిజన విద్యార్థులకు చేరువ చేయడంతో వారి భవిష్యత్తు పోటీ ప్రపంచానికి అనుగుణంగా మారుతుంది. వసతులు మెరుగుపడటంతో విద్యార్థుల సంఖ్య 602కు చేరడం అనేది ఆ పాఠశాల పట్ల ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. -
‘సంక్షేమం’తో కుటుంబానికి ఆసరా
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు వసపరి వెంకటలక్ష్మి. చింతపల్లిలో నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో కలిసి ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు జగనన్న తోడు పథకంలో ఏడాదికి రూ.10వేలు, వైఎస్సార్ చేయూత కింద రూ.18,750, వైఎస్సార్ ఆసరాలో రూ.45 వేలు ఆమె ఖాతాలో నేరుగా జమ అయింది. ఇలా ఐదేళ్లలో ఆమెకు సుమారు రూ.1.75 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆమె సొంతంగా కిరాణా దుకాణం ఏర్పాటుచేసుకుంది. ఒకప్పుడు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఈమె ఇప్పుడు కిరాణా వ్యాపారంతో ఆర్థికాభివృద్ధి సాధించానని ఆమె పేర్కొంది. -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
పాడేరు : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రమైన పాడేరులో ముందస్తుగా నిర్వహించారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆధ్వర్యంలో పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. జై జగన్, జైజై జగనన్ , హ్యాపీ బర్త్‌డే జగనన్న అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
రైతు భరోసాతో ఆర్థికంగా ఎదుగుదల
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గొల్లోరి గోపి. ముంచంగిపుట్టు మండలం మాలిపుట్టు గ్రామం. వ్యవసాయమే జీవనాధారం. ఎన్నడూ లేనివిధంగా గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ఎంతో ఉపయోగపడింది. ఏటా ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.13,500ను తనకున్న రెండు ఎకరాల్లో సామలు, రాగుల సాగుకు ఉపయోగించాడు. ఈ పథకం లేకముందు ఏటా పెట్టుబడికి రూ.10 వేలు అప్పు చేసేవాడు. సకాలంలో రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాలు, ఎరువులు పొందాడు. వలంటీర్ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందేలా చేసేవాడు. మాలాంటి రైతుల సంక్షేమం, ఆర్థిక ఎదుగుదలకు జగన్మోహనరెడ్డి చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని అతను తెలిపాడు. -
ఫీజు రీయింబర్స్మెంట్ లేకుంటే అంధకారమే
ఎటపాక మండలం జీకేపాడు గ్రామానికి చెందిన ఈమె పేరు వసంతాల ఇందిర. భార్యాభర్తలు ఓ ప్రైవేట్ హాస్టల్లో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నారు. వీరికి భవ్యశ్రీ, నవ్యశ్రీ ఇద్దరు సంతానం. వీరిని పెద్ద చదువులు చదివించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న సాయం చూసి ఇద్దరు పిల్లలను ఉన్నతంగా చదివించాలని తల్లి ఇందిర ఆశించింది. 2018, 2019 సంవత్సరంలో టెన్త్ పూర్తిచేసిన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ సాయంతో ఇంటర్ చదివించింది. ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్ ఆసరాతో విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశారు. నవ్యశ్రీ బిటెక్ చివరి సంవత్సరంలో ప్లేస్మెంట్ సాధించి కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం పొందింది. కుటుంబంపై ఆర్థికభారం పడకుండా ఎటవంటి ఇబ్బందులకు గురికాకుండా నాడు జగనన్న ప్రభుత్వంలో అందించిన ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం ఎంతో సహాయపడిందని నవ్యశ్రీ ఎంతో గర్వంగా చెప్పింది. జగనన్న ప్రభుత్వం ఎందరో మాలాంటి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆమె పేర్కొంది. -
ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ..
రంపచోడవరం: నాడు వెన్నెముక విరిగి మంచాన పడిన వ్యక్తి, నేడు తన కాళ్ల మీద తాను నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు.. ఒక సంక్షేమ పథకం ఒక నిండు ప్రాణాన్ని, ఒక నిరుపేద కుటుంబాన్ని ఎలా కాపాడిందో చెప్పే సజీవ సాక్ష్యం!.‘నేను ఈరోజు ఇలా బతికి ఉండి, నాలుగు మెతుకులు తినగలుగుతున్నానంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమే..‘ అంటూ ఉద్వేగంతో నిండిన కళ్లతో చెబుతున్నారు ఐ.పోలవరం గ్రామానికి చెందిన మడకం శ్రీనివాసదొర. ఒక సామాన్య గిరిజన కుటుంబం విధి ఆడిన వింత నాటకంలో కుప్పకూలిపోయే స్థితి నుంచి, నేడు ఆత్మగౌరవంతో బతుకుతున్నానని ఆనందంతో తెలిపారు. మృత్యువు అంచున శ్రీనివాసదొర.. 2019కు ముందు జరిగిన ఒక దురదృష్టకర ఘర్షణలో శ్రీనివాసదొర తీవ్రంగా గాయపడ్డారు. రంపచోడవరం నుంచి రాజమహేంద్రవరం.. అక్కడి నుంచి కాకినాడ.. ఆసుపత్రులు మారినా ఆందోళన మాత్రం తగ్గలేదు. ‘వెన్నెముక పూర్తిగా దెబ్బతింది‘ అని వైద్యులు చెప్పిన మాటలు ఆ కుటుంబంపై పిడుగులా పడ్డాయి. ఇక నడవలేడు, బతకలేడు అనుకున్న తరుణంలో ’డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ అండగా నిలిచింది. పునర్జన్మ నిచ్చిన ఉచిత వైద్యం నెలరోజుల పాటు అత్యుత్తమ వైద్యం, ఆపరేషన్లు అన్నీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందాయి. కేవలం ప్రాణాలు కాపాడటమే కాదు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో చేతిలో రూ. 30 వేలు పెట్టి సురక్షితంగా ఇంటికి పంపింది నాటి ప్రభుత్వం. ఆర్థిక ఆసరా.. ఆత్మగౌరవ జీవనం వైద్యం అంది ప్రాణం నిలిచినా, ఇంటికి వచ్చాక ‘ఎలా బతకాలి?‘ అన్న ప్రశ్న వేధించింది. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వంతో స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏకంగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ సొమ్ముతో శ్రీనివాసదొర తన గ్రామంలోని ఐ.పోలవరం జంక్షన్లో ఒక చిన్న కిళ్లీ షాపును ఏర్పాటు చేసుకున్నారు. ‘నా భర్తకు ప్రాణదానం చేయడమే కాకుండా, మా కుటుంబం రోడ్డున పడకుండా రూ. 5 లక్షల సాయం చేసిన జగన్మోహన్రెడ్డి చేసిన మేలును జన్మలో మర్చిపోలేం‘ అని శ్రీనివాసదొర భార్య విజయలక్ష్మి కృతజ్ఞతగా చెబుతున్నారు. -
జగన్‌కు రుణపడి ఉంటాం
గత వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి బాగా జరిగింది. కిముడుపల్లి పంచాయతీ కేంద్రంతో పాటు మారుమూల గ్రామాలకు రోడ్లు పడ్డాయి.సెల్ఫోన్లు పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య సేవలు విస్తృతమయ్యాయి. గ్రామాలకు 108, ఇతర అంబులెన్సులు వస్తున్నాయి. పాఠశాలలు బాగుపడ్డాయి. అర్హులందరికి ఇంటింటికీ నెలలో మొదటి రోజు పింఛన్ సొమ్ము అందేది. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఉండేది. గ్రామ సచివాలయాలు ఏర్పాటుతో మండల కేంద్రాల్లోని కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి తప్పింది. కిముడుపల్లి పంచాయతీ కేంద్రంలోనే అనేక శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. తమ కిముడుపల్లి పంచాయతీ స్వరూపమే మారిపోయింది. గిరిజనుల అభివృద్ధికి ఇన్ని మంచి పనులు చేసిన అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డికి తామంతా రుణపడి ఉంటాం. – జీలుగుల కృష్ణమూర్తినాయుడు, గ్రామపెద్ద, కిముడుపల్లి, పెదబయలు మండలం -
● అబ్బురం..పూల వికాసం
ప్రకృతి ఒడిలో దాడి ఉన్న అందాలకు చింతపల్లి చిరునామా..మంచు దుప్పటి కప్పుకున్న మన్యం కొండల్లో ఇప్పుడు సరికొత్త రంగులు అద్దాయి. ఏంజిల్స్ ట్రంపెట్ (స్వర్గపు) పువ్వులు ఆకాశం నుంచి దేవదూతలు భూవికి పంపిన బాజాల వలె, గాలికి ఊగుతూ ఇవి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పెద్ద పెద్ద గంటల ఆకృతిలో గులాబీ, తెలుపు రంగుల కలయికతో కొమ్మ కొమ్మకూ వేలాడుతూ ఉమ్మెత్తను పోలిన ఈ పూలు కనువిందు చేస్తున్నాయి. వీటిని చెట్టు ఉమ్మెత్త అని కూడా స్థానికంగా పిలుస్తుంటారు. శీతాకాలపు చలిలో, చింతపల్లి పరిసర ప్రాంతాల్లో విరబూసిన ఈ పూల సోయగం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. మన్యం అందాలను తిలకించడానికి వచ్చే వారికి ఈ ఏంజిల్స్ ట్రంపెట్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. – చింతపల్లి -
కరాటేలో గిరి యువకుల ప్రతిభ
● బంగారు పతకాలు సాధన ముంచంగిపుట్టు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక కరాటే క్లబ్ తరఫున పాల్గొన్న గిరిజన యువకులు ప్రతిభ కనబరిచారు. బంగారు పతకాలు సాధించిన వీరిని, కరాటే మాస్టర్ సురేష్‌ను శుక్రవారం ఎస్ఐ రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో సూర్యప్రకాష్, వెంకట్, కామేష్, సతీష్‌కుమార్ ప్రతిభ కనబరిచారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మండలానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్ఐ కోరారు. పూర్తిసహకారం అందించిన ఆయనను కరాటే క్లబ్ యువకులు, మాస్టర్ సత్కరించారు. -
విస్తరణలో ముందడుగు
తెలుగు రాష్ట్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తికి చిరునామాగా నిలిచిన పొల్లూరు కేంద్రం, ఇప్పుడు తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ చేపట్టిన 5, 6 యూనిట్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పాత యూనిట్లకు, కొత్త నిర్మాణాలకు మధ్య అనుసంధాన పనులు చేపట్టేందుకు తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులు పూర్తయితే, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఈ కేంద్రం మరింత ఊతం ఇవ్వనుంది. మోతుగూడెం: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఐదారు యూనిట్ల నిర్మాణ శరవేగంగా జరుగుతున్నాయి. డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి అనుసంధాన పనులను వేగవంతం చేశారు. ఇటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం నుంచి ఫోర్‌బే రిజర్వాయర్ వరకు తొమ్మిది కిలోమీటర్లు మేర పవర్ కెనాల్పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కెనాల్‌కు సంబంధించి సైడ్ ప్యానల్స్‌తో పాటు గ్రావెటింగ్, కాంక్రీట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. డొంకరాయి,పొల్లూరు రీచ్‌ల్లో సుమారు 20 మంది కాంట్రాక్టర్లతో పనులు జరిపిస్తున్నారు. అండర్ గ్రౌండ్ టన్నెల్లో.. : ఫోర్‌బే జలాశయం నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల వద్ద వికెట్ గేట్ల పనులు ఊపందుకున్నాయి. వాల్వ్హౌస్ సర్ధి ట్యాంక్‌లో నీటిని దిగువకు విడుదల చేసి అక్కడ నూతన బల్క్ గేట్లను ఏర్పాటు పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. వాల్వ్ హౌస్ నుంచి పవర్ హౌస్ వరకు పెన్‌స్టాక్, బీఎఫ్ వాల్వ్ అనుసఽంధాన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పవర్‌హౌస్ దిగువ భాగంలో ఉన్న ట్రయిల్ రేస్ సంపులో 90 శాతం నీటిని తొలగించారు. పూర్తిగా తొలగించిన తరువాత నూతన గేట్లు ఏర్పాటుచేస్తామని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే అండర్ గ్రౌండ్లో నిర్మించే గేట్లను సిద్ధం చేశారు. ఇదే సమయంలో మిగతా యూనిట్లలో సాంకేతిక లోపాలను సరి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. యాభై ఏళ్లు దాటినా.. జలవిద్యుత్ కేంద్రం నిర్మించి సుమారు 50 ఏళ్లు దాటినా అప్పటి ఇంజనీరింగ్ అధికారుల నైపుణ్యానికి అద్దం పడుతోంది. పవర్ హౌస్ దిగువ భాగాన ట్రయిల్ రేస్ సంపులో పూర్తిగా నీటిని తొలగించారు. కింద నుంచి పవర్‌హౌస్ పైభాగం వరకు అప్పటిలో నిర్మించిన కాంక్రీట్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. భవిష్యత్తు తరాలకు ఐదారు యూనిట్లు నిర్మించాల్సి ఉంటుందని ఎంతో ముందు చూపుతో అప్పట్లోనే ప్రణాళికపరంగా చర్యలు చేపట్టారు. ఇవే పనులు ఇప్పుడు చేపట్టాలంటే రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని జెన్కో ఇంజినీరింగ్ అధికారవర్గాలు తెలిపాయి. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో శరవేగంగా 5,6 యూనిట్ల పనులు ఉత్పాదన నిలిపివేసి నిర్మాణాలు వేగవంతం అహర్నిశలు శ్రమిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు, కార్మికులు అప్పటి ఇంజనీరింగ్ అధికారుల నైపుణ్యానికి ప్రతీకగా కట్టడాలు -
కనీస వేతనం చెల్లించాలని ధర్నా
● ఫీల్డ్ అసిస్టెంట్ల్ల ఆందోళన చింతూరు : కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం స్థానిక ఐటీడీఏ ఎదుట ధర్నా చేశారు. సీఐటీయూ అనుబంధ ఎఫ్ఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు ఈ ఆందోళన చేపట్టారు.ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో గత 19 ఏళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లు వేతన దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారన్నారు. పథకం విజయవంతంలో వీరి కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇస్తున్న రూ. 5,745 జీతం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని, అయితే ఈ ప్రభుత్వంలో కూడా తొలగింపు పెద్ద ఎత్తున జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోయారు. తమకు ప్రమాదవశాత్తూ అంగవైకల్యం సంభవించినా, మరణించినా ఎక్స్‌గ్రేషియా రూ. 25లక్షలు ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. సీఐటీయూ మండల కన్వీనర్ లక్ష్మణ్, ఎఫ్ఏల జిల్లా కార్యదర్శి కొమరం రామకృష్ణ, ఉపాధ్యక్షులు శంకర్, గంగరాజు, అర్జున్, సూరమ్మ పాల్గొన్నారు. -
● జిల్లావ్యాప్తంగా ఎనిమిది నెలల క్రితం బీసీ, కాపు కార్పొరేషన్ల రుణాలకు నోటిఫికేషన్ ● సుమారు రెండు వేల మంది దరఖాస్తు ● ఇంటర్వ్యూలు నిర్వహించినా నేటికీ మంజూరు కాని రుణాలు ● ప్రహసనంగా మారిన ప్రక్రియ ● నిరుద్యోగ యువత ఆశలు ఆవిరి
కొయ్యూరు: సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుందామని, ప్రభుత్వ సాయంతో కాళ్ల మీద నిలబడదామని ఆశపడిన బీసీ, కాపు యువతకు నిరాశే మిగిలింది. స్వయం ఉపాధి పేరిట ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకు పరిమితమయ్యాయి. కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేయడం, దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూల నిర్వహణ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసిన ప్రభుత్వం.. చివరకు నిధుల విడుదలలో మొండిచేయి చూపిందని విమర్శిస్తున్నారు. ● బీసీ, కాపు కార్పొరేషన్ల రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఏప్రిల్‌లో ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేనెలలో జిల్లావ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటి దరఖాస్తులను సంబంధిత కార్పొరేషన్లకు మండల పరిషత్ అధికారులు పంపించారు. అక్కడి నుంచి ఏమైందో తెలియని పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తులు నిరాశకు గురయ్యారు. ● రూ.లక్ష నుంచి ఐదు లక్షల విలువైన యూనిట్లకు దరఖాస్తు చేసిన వారు కొన్ని రోజుల పాటు బ్యాంకు మేనేజర్లను ప్రసన్నం చేసుకున్నారు. వారు అనుమతి ఇస్తేనే రుణం మంజూరవుతుంది. అటు ఆయా కార్పొరేషన్ల నుంచి రాయితీ వస్తుంది.అయితే బ్యాంకర్లు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పడంతో వారు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన చెందుతున్నారు.అప్పట్లో బీసీ,కాపులకు మాత్రమే అవకాశం రావడంతో గిరిజనులు అసంతృప్తి చెందారు. వారికి కూడా త్వరలో నోటిపికేషన్ వస్తుందని ప్రచారం జరిగినా ఫలితం లేకపోయింది. ఇంటర్వ్యూకు వెళ్లా కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే యూనిట్‌కు దరఖాస్తు చేశా. ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఇంత వరకు దీనిపై ఎలాంటి సమాచారం రాలేదు. వస్తే స్వయం ఉపాధితో డెయిరీ పెట్టుకోవాలని చూస్తున్నా. – బీఎల్ నాగేశ్వరరావు, నిరుద్యోగి, సింగవరం ఆదేశాలు రాలేదు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించాం. దీనికి సంబంధించి ఆయా కార్పొరేషన్ల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆ సైట్‌ను మూసివేశారు. తిరిగి ఆదేశాలు వస్తేనే ప్రక్రియ ప్రారంభించగలం. – శంకర్రావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, విశాఖపట్నం -
రుణాలు సద్వినియోగం చేసుకోండి
● ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ● స్వయం సంఘాల సభ్యులకురుణాల పంపిణీ పాడేరు : స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జి.మాడుగుల మండలానికి చెందిన 36 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు రూ.2కోట్ల 50లక్షల విలువైన బ్యాంకు రుణాల చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అంబెడ్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళి పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగు
● టెన్త్ విద్యార్థుల వందరోజుల యాక్షన్ ప్లాన్ సక్రమంగా అమలు ● బాల భవన్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి ఆదేశంపెదబయలు: గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగపడాల్సిన అవసరం ఉందని బాల భవన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వై.రాఘవరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2ను సందర్శించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ హేవం హరిత విద్యాలయం కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ ప్రాంతలో పర్యటించారు. తెలుగు,గణితం, ఆంగ్లంలో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సామర్థ్యాలను అంచనా వేశారు. గ్యారెంటీ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమలుతీరును తెలుసుకున్నారు. భోజన మెనూ అమలును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. అలాగే పరిశుభ్ర వాతావరణంలో వంట చేయాలన్నారు. విద్యార్థులు వినిమోగిస్తున్న మరుగుదొడ్లు, పాఠశాల కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. అనంతరం సీతగుంట గిరిజన సంక్షేమ బాలూర పాఠశాల–1ను సందర్శించారు.టెన్త్ విద్యార్థుల నుంచి వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలును తెలుసుకున్నారు. వారి నోట్ పుస్తకాలను పరిశీలించారు. గణిత ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహించాలన్నారు. లీప్ యాప్‌లో విద్యార్థుల మార్కులు అప్లోడ్ చేయాలని సూచించారు. సీ,డీ గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమగ్ర శిక్ష జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అఽధికారి ఎం.జ్ఞానప్రకాష్, ఎంఈవోలు కె. కృష్ణమూర్తి, పుష్పజోసెప్, హెచ్ఎం చిట్టమమ్మ, సీఆర్పీలు పాల్గొన్నారు. -
గడువులోగా పూర్తి చేయండి
● సివిల్ ఎస్ఈ రవీందర్‌రెడ్డి ఆదేశం జలవిద్యుత్ కేంద్రంలో ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి జరుగుతున్న సివిల్ పనులను శుక్రవారం సివిల్ ఎస్ఈ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ట్రయిల్ రేస్ సంపు, అండర్‌గ్రౌండ్‌లో కొత్త గేట్లు నిర్మించే ప్రదేశాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్ధానిక సివిల్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా కంపెనీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పవర్ కెనాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. -
ఔషధ మొక్కల పరిశీలన
● గాలికొండ, సుంకరమెట్ట ప్రాంతాలను సందర్శించిన కర్ణాటక విద్యార్థులు అరకులోయ టౌన్: మండలంలోని గాలికొండ, సుంకరమెట్ట, అనంతగిరి అటవీ ప్రాంతాల్లోని ఔషధ మొక్కలను కర్ణాటకకు చెందిన బాగాల్కోట్లోని బీవీవీఎస్ అక్కమహాదేవి మహిళా కళాశాల ఎంఎస్సీ విద్యార్థులు శుక్రవారం పరిశీలించారు. బొటానికల్ టూర్లో భాగంగా ఇక్కడికి వచ్చిన వారు వాటి వివరాలను సేకరించారు. ఆంధ్రా యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగం బొటానికల్ టూర్ రిసోర్స్ పర్సన్, మొక్కల వర్గీకరణ నిపుణుడు డాక్టర్ జె. ప్రకాష్‌రావు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించి పోతున్నా అనేక జాతులకు చెందిన ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నయన్నారు. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. అధ్యాపకులు డాక్టర్ అనిత మారిహాల్, వీణా పోలీస్ పాటిల్, ఎం. వందన తదితరులు పాల్గొన్నారు. -
మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ రోడ్డుకు మరమ్మతులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్వహణలోపం వల్ల పిచ్చిమొక్కలతో నిండిపోయి, గోతులమయంగా మారింది. పలుచోట్ల బండరాళ్లు రోడ్డుపైకి వరద ఉధృతికి కొట్టుకుని వచ్చాయి. దీనివల్ల ఈ ఆరు కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడేవారు. సమస్యను గుర్తించిన ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు రోడ్డు మెరుగుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పొక్లెయిన్‌తో బండరాళ్లను తొలగిస్తూ రోడ్డును మెరుగుపరుస్తున్నారు. -
ఉపాధ్యాయుల వినతి
పాడేరు రూరల్: అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్–1 విశాఖపట్నంలోనే కొనసాగించాలని జిల్లా విద్యా శాఖాధికారి రామకృష్ణారావుకు బహుజన్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు వల్ల సలీమ్, ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతు జోన్ –1 ఉమ్మడి విశాఖపట్నంలోనే కొనసాగిస్తేనే అందరి ఉపయోగం ఉంటుందని ఎటువంటి పనులు ఉన్న అనుకులంగా ఉంటుందన్నారు.జోన్–2 పరిధిలో చేర్చడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చోరవ తీసుకుని అల్లూరి జిల్లాని జోన్–1 విశాఖపట్నంలోనే కోనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు, నాయకులు కర్రన్న, వేణుగోపాల్, లక్ష్మేశ్వరి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
సీలేరు: సీఆర్పీఎఫ్ –42 బెటాలియన్ సివిక్ యాక్షన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని బెటాలియన్ సెకండ్ కమాండెంట్ మహేంద్ర హెగ్డే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. గిరిజన మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ దుర్జీ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ సేవలను కొనియాడారు. హోమియో వైద్యాధికారి శృజనారాయ్, ఎంపీటీసీ సభ్యుడు పిల్లా సాంబమూర్తి, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
● వైఎస్సార్ స్టేడియంలో భారత్– శ్రీలంక మహిళా జట్లు ముమ్మర ప్రాక్టీస్ ● రేపు రాత్రి 7 గంటలకు టీ–20 మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్ : భారత్ – శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్ 23న జరగనుంది. శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు విశాఖ వేదికగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనుండగా మిగిలిన మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. శ్రీలంక జట్టు ఈసారి యువ స్పిన్నర్లతో భారత్‌ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండు చేతులతోనూ స్పిన్ చేయగల సామర్థ్యం ఉన్న శశినితో పాటు కావ్య, రష్మిక వంటి యువ క్రీడాకారిణులు ఆ జట్టుకు అదనపు బలంగా మారారు. కెప్టెన్ చమరి ఆటతో పాటు ఇనోకా బౌలింగ్ కూడా లంకకు కీలకం కానుంది. బ్యాటింగ్ విభాగంలో ఇటీవల వరల్డ్ కప్‌లో రాణించిన హాసిని, విష్మి, హరిషత, నీలాక్షిక వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో శ్రీలంక పటిష్టంగా కనిపిస్తోంది. బలంగా టీమిండియా : మరోవైపు భారత జట్టు కూడా సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జట్టులో కీలక మార్పులు చేసింది. రాధ, యాస్టికా, నయాలి స్థానాల్లో వికెట్ కీపర్ బ్యాటర్ కమలిని, స్పిన్నర్ వైష్ణవిలను తుది జట్టులోకి తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొన్న వీరిద్దరూ విశాఖ వేదికగా టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దీప్తి, షఫాలీ, జెమిమా, రిచా వంటి స్టార్ క్రీడాకారిణులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ప్రాక్టీస్ షురూ.. -
వెదురు వస్తువుల మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
రంపచోడవరం: ఏజెన్సీలో వెదురుతో తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రోత్సాస్తామని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ తెలిపారు. మండలంలోని సుర్లవాడ గ్రామంలో గిరిజనులు వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఇక్కడ గిరిజనులు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేసి వెలుగు ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులు వెదురు వస్తువుల తయారీలో నైపుణ్యాన్ని మరింత పెంచుకొనేందుకు శిక్షణ ఇస్తామన్నారు. మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారో గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులను పీవో పరిశీలించారు. పీవో వెంట ఏపీడీ డేగలయ్య, ఏపీం కిషోర్,రామరాజు పాల్గొన్నారు. -
వణికిస్తున్న శీతల గాలులు
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. సూర్యోదయం ఆలస్యమవుతోంది. వీడని మంచు పరదాలు రాజవొమ్మంగి: మండలంలో శుక్రవారం ఉదయం 9 గంటలు దాటినా మంచు పరదాలు వీడలేదు. చలి తీవ్రతకు అన్నివర్గాల ప్రజలు గజగజ వణికి పోయారు. అత్యవసర పనులపై ద్విచక్రవానాలపై వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. దట్టమైన మంచు కారణంగా దారులు కనపించక వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. -
జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలకు తరలిరండి
పాడేరు : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పుట్టిన రోజు కేక్ కటింగ్‌లు, పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రమైన పాడేరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. అరకులోయటౌన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు జగనన్న జన్మదిన వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అరకులోయలోని వైఎస్సార్ జంక్షన్ వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అనంతరం ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ పదవులు, హోదాల్లో ఉన్న పార్టీశ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎటపాక: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గంగవరం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కార్యాలయం వద్ద కేక్ కటింగ్ నిర్వహించి, రోగులకు పాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పార్టీశ్రేణులు, అభిమానులు తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంపాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు -
మన్యం సంతలు వెలవెల
సాధారణంగా పండగ సీజన్ వచ్చిందంటే మన్యం ప్రాంతంలోని వారపు సంతలు జనంతో కిక్కిరిసిపోవాలి. కానీ, ప్రస్తుత క్రిస్మస్ పండగ వేళ జిల్లాలోని ప్రధాన సంతలు కళతప్పుతున్నాయి. పండగ కొనుగోళ్ల కోసం ప్రజలు భారీగా వస్తారని ఆశించిన వ్యాపారులకు నిరాశే ఎదురవుతోంది. కొనుగోలుదారులు లేక సంతలన్నీ బోసిపోతున్నాయి. ఒకవైపు గిరిజన ఉత్పత్తుల ధరలు ఆశాజనకంగా లేకపోవడం, మరోవైపు నగదు కొరత లేదా ఇతర స్థానిక కారణాల వల్ల ఈ ఏడాది పండగ కళ కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఏదీ నాటి వైభవం ● అంతంతమాత్రంగానే వ్యాపారం సాక్షి, పాడేరు: కొనుగోళ్లు లేక మన్యం సంతలు బోసిపోతున్నాయి. క్రిస్మస్ పండగకు ముందు దుస్తులు, కిరాణా, ఇతర వ్యాపారాలు భారీగా జరుగుతాయి. మైదాన ప్రాంతాలతోపాటు స్థానిక వ్యాపారులు ఇక్కడి సంతలపై ఆధారపడుతుంటారు. దీంతో ప్రతి సంతలో రూ.50 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. గిరిజనులు కూడా ఈ సంతల్లోనే తమకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకుంటారు. పండగల సమయంలో ఇంటిల్లపాది సంతలకు వచ్చి నచ్చిన కొత్త దుస్తులు కొనుగోలు చేయడం పూర్వం నుంచి గిరిజనులకు సంప్రదాయం ఉంది. మన్యంలో క్రిస్మస్ పండగ జరుపుకునే గిరిజన కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నా వారపు సంతల్లో కొనుగోళ్లు మందగించాయి. ● పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతలో గురువారం కనీస వ్యాపారం లేక వస్త్ర, కిరాణా దుకాణదారులు ఆందోళన చెందారు. ● పాడేరు,అరకులోయలో శుక్రవారం జరిగిన వారపుసంతల్లో కొనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన పాడేరులో వారపు సంతకు అన్ని మండలాల గిరిజనులు అధికంగానే తరలివస్తారు. అయితే ఈవారం క్రిస్మస్ పండగ సంతకు మాత్రం వచ్చిన గిరిజనుల సంఖ్య తక్కువగా కనిపించింది. మెయిన్‌రోడ్డు,సినిమాహాల్ సెంటర్ ప్రాంతాల్లోని రెడీమేడ్ వస్త్ర దుకాణాల వద్ద ఏ మాత్రం సందడి లేదు. కిరాణా, కూరగాయల దుకాణాల వద్ద అదే పరిస్థితి నెలకొంది. ● ఈ సీజన్లో దిగుబడికి వచ్చే కాఫీ, రాజ్మా గింజల అమ్మకాలు జరగక గిరిజనుల వద్ద ఆదాయం కరువైంది. జీసీసీ కాఫీ గింజల కొనుగోలు ధర కిలో రూ.450 నిర్ణయించినప్పటికీ తేమశాతం అధికంగా ఉందన్న నెపంతో కొనుగోళ్లకు దూరంగానే ఉంది. ప్రైవేట్ వ్యాపారులు కిలో రూ.320 ధర నిర్ణయించడంతో తక్కువ ధరకు గిరిజనులు అమ్ముకోలేకపోతున్నారు. ● రాజ్మా విషయానికి వస్తే ఈఏడాది దిగుబడులు ఆలస్యమవ్వడంతో గిరిజన రైతులు అమ్మకాలు చేపట్టలేకపోతున్నారు. రాజ్మా చిక్కుళ్ల గింజలు వస్తున్నప్పటికి కిలో రూ.80 తక్కువ ధరతో వ్యాపారులు కొనుగోలు ప్రారంభించారు. గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో గిరిజన రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీకి గాయాలు
కొయ్యూరు: వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు, డౌనూరు ఎంపీటీసీ సభ్యుడు బిడిజన అప్పారావు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతనిని వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఆయన శుక్రవారం ధర్మవరం నుంచి డౌనూరు బైక్‌పై వస్తున్నారు. ధర్మవరం దాటిన తర్వాత ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు ఆయన వాహనాన్ని ఢీ కొట్టారు. ఆయన బైక్ నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో అప్పారావు ము క్కుకు, చేతికి గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయనను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముసిలినాయుడు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జల్లి బాబులు, బూత్ కమిటీ కన్వీనర్ పొట్టిక పోతురాజు, సర్పంచ్‌లు పరామర్శించారు. -
సమస్యలు పరిష్కరించండి
● ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ● పీజేఆర్‌ఎస్‌లో 156 వినతుల స్వీకరణ పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి 156 వినతులను ఆమెతోపాటు ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు స్వీకరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. రెవెన్యూ, భూ వివాదాలకు సంబంధించిన ఆర్జీలపై తహాసీల్దార్లు, వీఆర్వోలు సమగ్ర సర్వే నిర్వహించి సమస్య పరిష్కారించాలన్నారు. ప్రధానంగా విద్యుత్, గృహాల మంజూరు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు, డీఆర్డీఏ పీడీ మురళి, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, డీఎస్డీవో జగన్మోహన్రావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణారావు, డీపీవో చంద్రశేఖర్, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ పాల్గొన్నారు. -
వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● డుంబ్రిగుడలో 3.8 డిగ్రీల నమోదు ● ఉదయం 11 వరకు వీడని మంచుతెరలు ● ఇబ్బందులు పడుతున్న అన్నివర్గాల ప్రజలుచింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం డుంబ్రిగుడలో 3.8 డిగ్రీలు, జి మాడుగులలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి హుకుంపేటలో 6.2 డిగ్రీలు, ముంచంగిపుట్టు, పాడేరులో 6.9 డిగ్రీలు, పెదబయలులో 7.1 డిగ్రీలు, చింతపల్లిలో 7.5 డిగ్రీలు, కొయ్యూరులో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. ● రంపచోడవరం డివిజన్‌న్ వై.రామవరంలో 9.1 డిగ్రీలు, మారేడులిల్లిలో 10.5 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.2 డిగ్రీలు, రంపచోడవరంలో 13.7 డిగ్రీలు, గంగవరంలో 14.9 డిగ్రీలు, చింతూరు డివిజన్ ఎటపాకలో 14.3 డిగ్రీలు, చింతూరులో 14.9 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు. ● గత నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చిన్నారులు, వృద్ధులు, చిరు వ్యాపారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులు ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుని సాయంత్రం, ఉదయం వేళల్లో ఉపశమనం పొందుతున్నారు. ఉదయం 9 గంటలు దాటే వరకూ పొగమంచు తెరలు వీడటం లేదు. దీంతో విద్యార్థులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు. రహదారులను మంచు తెరలు కమ్మేయడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. డుంబ్రిగుడ: మండలంలో చలితీవ్రత పెరిగింది. గురువారం ఈ ప్రాంతంలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మంచు ఉదయం 11 గంటల వరకు కురుస్తోంది. సాయంత్రం నుంచి ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత నెలకొంటోంది. -
సన్‌ఫ్లవర్ ఫుల్ ఆదాయం
ఏజెన్సీలోని పొద్దు తిరుగుడు సాగు చేపట్టిన రైతులకు పర్యాటకుల రాకతో అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకులు పొద్దుతిరుగుడు తోటలను సందర్శిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ఒక వ్యక్తి ఫొటోలు తీసుకునేందుకు రూ.20 తీసుకుంటున్నారు. డుంబ్రిగుడ–అరకులోయ జాతీయ రహదారిలో నారింజవలస జంక్షన్ వద్ద పొద్దుతిరుగుడు సాగు చేపట్టిన గిరిజన యువ రైతు వంతాల కొండబాబు ఏటా మంచి ఆదాయం పొందుతున్నారు. మూడు సెంట్లలో చేపట్టిన ఈ పైరులో సుమారు 15 రోజులపాటు పూత దశ ఉంటుంది. పర్యాటకుల రాకవల్ల రోజుకు రూ.2 వేల వరకు ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. – సాక్షి,పాడేరు -
సిరులతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర నాలుగో గురువారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం వెండి కవచాల అలంకారంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల పర్యవేక్షణలో ఆలయ ఈవో కె. శోభారాణి, ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం నిమగ్నమయ్యారు. భక్తుల సౌకర్యార్థం జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా టౌన్ కొత్తరోడ్డు వద్ద సుమారు 20 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టౌన్‌కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ప్రారంభించగా, రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.20, రూ.100, రూ.200 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు రూ.500 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక దర్శన మార్గాలను కేటాయించారు. దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే దారిలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘోషాసుపత్రి, రీడింగ్ రూమ్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పించారు. ఆలయ సమీపంలోనే పోలీస్ అవుట్‌పోస్ట్, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. టౌన్‌కొత్తరోడ్డు, ఘోషాసుపత్రి ప్రాంతాల్లో చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయగా, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు.శుక్రవారంతో ఈ మార్గశిర ఉత్సవాలు ముగియనున్నాయి. క్యూలైన్ లో భక్తులుసహస్ర ఘటాభిషేకానికి సిద్ధం చేసిన కళశాలు -
అమ్మో పులి..
● రెయిన్‌గేజ్ వద్ద పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు ● పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ సీలేరు: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సీలేరు అటవీ రేంజ్ పరిధిలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సీలేరు– విశాఖపట్నం అంతర్ రాష్ట్ర రహదారిలో ధారాలమ్మ ఘాట్ రోడ్ సప్పర్ల రెయిన్‌గేజ్ వద్ద బుధవారం సాయంత్రం ఐదున్నర సమయంలో రోడ్డు దాటుతుండగా ఈ మార్గంలో బైక్ వెళ్తున్న సీలేరుకు చెందిన వ్యక్తులు గమనించారు. ఈ మార్గంలో వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ గ్రూపుల్లో వారు పోస్టు చేశారు. దీనిపై స్పందించిన సీలేరు రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు నేతత్వంలో అటవీ అధికారులు పులి సంచరించినట్టుగా ప్రచారం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలను గుర్తించిన వారు చిరుతపులిగా నిర్థారించారు. పరిసర గ్రామాల గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సతీష్, బేస్ క్యాంప్ సిబ్బంది అప్రమత్తం చేశారు. పులి కనిపిస్తే వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. సీలేరు అటవీ రేంజ్ పరిధిలో సప్పర్ల వద్ద గత ఏడాది జనవరిలో ఇదే ప్రాంతంలో బెంగాల్ టైగర్ రోడ్డు దాటుతుండగా బస్సులో వెళుతున్న ప్రయాణికులకు కంటపడింది. ఇప్పుడు అదే ప్రదేశంలో పులి కనిపించడంతో అటవీ అధికారులు ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్టుగా నిర్థారణకు వచ్చి తగు చర్యలు చేపడుతున్నారు. -
ఏపీఈపీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు
విశాఖ సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏపీఈపీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్– ది పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే నినాదంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025ను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో ఏపీఈపీడీసీఎల్ ప్రతిష్టాత్మక ‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జాతీయ అవార్డు’ ను సాధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్, పర్యావరణ–అటవీశాఖ మంత్రి శుభోద్ ఉనియల్, పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్‌ల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. ఏపీఈపీడీసీఎల్ తరఫున పీఆర్వో జి.ఎస్.ఎస్.ఎస్.వాసు ఈ అవార్డును అందుకుని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖల సహకారంతో ఈపీడీసీఎల్‌లో పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ద్వారా విద్యుత్‌ను అందించినట్లు వెల్లడించారు. -
వైద్యవిద్య మా భవిష్యత్తు
మెరిట్‌కు ప్రాధాన్యత – మనీకి కాదు! ప్రతిభ ఉన్న విద్యార్థికి సీటు రావాలి కానీ, డబ్బు ఉన్నవాడికి కాదు. వైద్య విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.పేదవాడి డాక్టర్ కల ఏమవ్వాలి? ఫీజులు పెంచి, సీట్లు అమ్ముకుంటే.. పేదవాడు డాక్టర్ ఎలా అవుతాడు? వైద్య విద్యను కార్పొరేట్ శక్తుల పరం చేయడాన్ని యువతరం తీవ్రంగా ఖండిస్తోంది! పీపీపీ విధానం విరమించాలి వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉంచితే పేద, మధ్యతరగతి, గిరిజన విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా వైద్య విద్యను అభ్యసించవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది. టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని పూర్తిగా విరమించాల్సిన అవసరం ఉంది. – కె. శేషాద్రినాయుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ, గురుకుల కళాశాల, జి.మాడుగులప్రైవేటీకరణ తగదు రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను గత సీఎం జగన్మోహన్రెడ్డి పేదల డబ్బుతో నిర్మిస్తే వాటిని టీడీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఏమాత్రం తగదు. ప్రభుత్వం పునరాలోచించి వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి. పేదలకు మెరుగైన వైద్యంతోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలి. – కిల్లో కృష్ణ్ణ, బీఎస్సీ, బీఈడీ, బౌంసుగుడ, బస్కీ పంచాయతీ, అరకులోయ మండలం పేదలకు తీవ్ర నష్టం పేదలకు మెరుగైన వైద్యం అందించకుండా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. జగన్మోహన్రెడ్డి కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. గిరిజన విద్యార్థులకు కూడ వైద్య విధ్య అందాలంటే కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహిచాల్సిన అవసరం ఉంది. – కిల్లో రఘునాథ్, బీఏ బీఈడీ, బొండాగుడ, బస్కీ పంచాయతీ, అరకులోయ భరించలేనంతగా ఫీజులు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఆదివాసీ, పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుంది. ఫీజు లు భరించలేనంతగా పెరుగుతాయి. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం, విద్య అందుబాటులో లేకుండా పోతుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది. ప్రైవేటీకరణ వద్దు. – కె అశోక్, ఇంటర్ సెకండియర్ బైపీసీ, గురుకులం కళాశాల, జి.మాడుగులఅందరికీ వైద్యవిద్యకు అవకాశం ఇంటర్ బైపీసీ చదివా. నీట్ పరీక్ష రాసినప్పటికీ ర్యాంక్ ఎక్కువగా రావడంతో మెడికల్ సీట్ రాలేదు. తరువాత బీఎస్సీ పూర్తి చేశా. అప్పట్లో వైద్య కళాశాలలు తక్కువగా ఉన్నందున ఎంబీబీఎస్ చదవలేకపోయా. పాడేరులో వైద్య కళాశాల గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం లభించింది. – బురిడి రాము, బీఎస్సీ, బీఈడీ, బయలుగుడఆశయానికి అడ్డుకట్ట వద్దు వైద్యం అనేది సేవ, వ్యాపారం కాదు. ప్రైవేటీకరణ పేరుతో సామాన్యుడి డాక్టర్ కలని చిదిమేయకండి. విద్య అందరికీ సమానంగా అందాలి! రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసన రాజుకుంటోంది. పీపీపీ పద్ధతి వల్ల ఫీజులు పెరిగి, పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అధిక సంఖ్యలో మద్దతు ఇచ్చి తమ నిరసన తెలిపారు. వారి మాటల్లోనే .. – సాక్షి, పాడేరు -
పట్టుపరిశ్రమ యూనిట్లకు 90 శాతం రాయితీ
● ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు : పట్టుపరిశ్రమ యూనిట్లు ఏర్పాటుచేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీ కల్పిస్తున్నామని ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ వెల్లడించారు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో స్కిల్ సమగ్ర–2 పథకంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. పట్టుపరిశ్రమ ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా లబ్ధిపొందాలని ఆమె సూచించారు. జిల్లాలో 400 మంది రైతులు సుమారు 800 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారన్నారు. ఈ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది ఆసక్తి చూపేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇతర కులాల రైతులకు 75 శాతం రాయితీ అందజేస్తున్నామన్నారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో ఐదు యూనిట్లను, రోగ నిరోధక మందులు 156 యూనిట్లు, రేసింగ్ పరికరాలు 12 యూనిట్లను మల్బరీ రైతులకు పంపిణీ చేశారు. జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి కె.అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్బీఎస్ నందు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం
పాడేరు : ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడంతో పాటు ఇంక్రిమెంట్లలో కోత విధించడం, రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులపై గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్భంధాలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్(యూటీ ఎఫ్) జిల్లా అద్యక్షుడు వి. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ప్రతినిధులు గురువారం ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లో జాబ్‌చార్ట్‌కు భిన్నంగా రాత్రంతా పాఠశాలల్లో మేల్కొని మరుసటి రోజు సాధారణ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం మానవ హక్కులను ఉల్లంఘించటమేనన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ వార్డెన్లను నియమించకుండా సబ్జెక్టు టీచర్లను డిప్యూటీ వార్డెన్ల భాద్యతలు అప్పగించడం సరికాదన్నారు. వసతి గృహాల్లో వాచ్మెన్లు, ఏఎన్ఎంలు లేక విద్యార్థుల కోసం ఉపాధ్యాయులను ఉంచడం, రాత్రిపూట పాఠశాలల్లో 9గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించి ఫోటో తీయాలని నిద్రపోయి మరలా రాత్రి 12 గంటలకు, ఉదయం 6గంటలకు పాఠశాలలో ఉన్నట్టు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులను రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించమని చెప్పడం ఎంత వరకు సబబు అన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల రాత్రి బస కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. 2011సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు ధర్మారావు, దేముడు, కన్నయ్య, రఘునాఽథ్, నాగేశ్వరరావు, గంగాధర్, నారాయణ, ప్రసాద్, శ్యామ్, ధనుపతి, రాజారావు, శ్రవణ్, దుక్కు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
నిండుగా డొంకరాయి జలాశయం
మోతుగూడెం: డొంకరాయి జలాశయ నీటిమట్టం పెరుగుతుండటంతో రెండు గేట్ల ద్వారా మూడువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఐదారు యూనిట్ల నిర్మాణం వల్ల సుమారు రెండు నెలలు పాటు జలవిద్యుత్ కేంద్రం మూసివేశారు. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం డొంకరాయి జలాశయానికి చేరుతున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు తెలిపారు. ● డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి నీటి మట్టం 1037 అడుగులు. ప్రస్తుతం 1036 అడుగులకు చేరడంతో పైనుంచి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఐదారు యూనిట్ల నిర్మాణంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం తెలిసిందే. దీనిలో భాగంగా డొంకరాయి నుంచి ఫోర్‌బే జలాశయం వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర పవర్ కెనాల్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. సుమారు రూ. 2కోట్లతో పవర్ కెనాల్‌కు సైడ్ వాల్వుల ప్లాస్టరింగ్, కెనాల్ దిగువ భాగాన కాంక్రీట్, గ్రౌటింగ్ పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ● పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఐదారు యూనిట్లు నిర్మాణంలో భాగంగా పవర్‌హౌస్ దిగువ భాగాన ఉన్న ట్రయల్ రేస్ సంపూ (నీటి ట్యాంక్) నీటిని వారం రోజులుగా కెనాల్‌కు అడ్డంగా మట్టికట్టను ఏర్పాటు చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ దిగువ భాగాన ఐదారు యూనిట్లకు నూతన గేట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నీటిని పంపుల ద్వారా తోడి దిగువకు పంపిస్తున్నారు. అనంతరం ఐదారు యూనిట్లు గేట్ల వద్ద గతంలో నీరు లోపలి భాగానికి వెళ్లకుండా కాంక్రీట్‌తో కప్పేశారు. నీటిని తోడిన వెంటనే కాంక్రీట్‌ను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనుల్లో జెన్కో అధికారులు నిమగ్నమయ్యారు. 1036 అడుగులకు చేరిన నీటిమట్టం దిగువకు మూడు వేల క్యూసెక్కులు విడుదల పవర్ కెనాల్‌కు చురుగ్గా మరమ్మతు పనులు 5,6 యూనిట్లకు కొత్త గేట్ల ఏర్పాటు పనుల్లో జెన్కో అధికారులు -
ీపీపీపీ విధానం రద్దు చేయాల్సిందే
● సీపీఐ నేతల డిమాండ్ ● వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పాడేరు వైద్య కళాశాల ఎదుట ధర్నా సాక్షి,పాడేరు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్థతిలో ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట గురువారం బైఠాయించి ధర్నా చేశారు. పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంట సేపు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిగ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలుజేసి ప్రైవేటీకరణకు గాను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన 590,107,108 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాఽధి భద్రత, పేద, మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పది వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తే వైద్య విద్య వెనుక ఉన్న సామాజిక లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు. వైద్య విద్యకు అనుబంధమైన ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందే పేద ప్రజలు వైద్యసేవలకు దూరమవుతారని ఆయన వాపోయారు. ప్రభుత్వ రంగంలోని స్థిరమైన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు అందకుండా పోతాయన్నారు. పీపీపీ విధానం రద్దు, వైద్య విద్యను ప్రైవేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుకునే లక్ష్యంగా సీపీఐ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కూడా రాధాకృష్ణ, అమర్, పెట్ల పోతురాజు, సింహాచలం, ఉల్లి సూరిబాబు, దేవుళ్లు పాల్గొన్నారు. -
జగన్‌ను కలిసిన జిల్లా నేతలు
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కలిశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యక్రమాలను వివరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటిసంతకాల సేకరణ విజయవంతంగా నిర్వహించడంపై అధినేత నుంచి ఆయన అభినందనలు అందుకున్నారు. జిల్లాలో మరిన్ని ప్రజా ఉద్యమాలను విస్తృతం చేయాలని పార్టీ అఽధినేత పిలుపునిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అరకు ఎంపీ తనూజరాణి, రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి,ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైబర్ నేరాలపై అవగాహన
అరకులోయటౌన్: మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలను జిల్లా సైబర్ క్రైమ్ సీఐ వెంకటరమణ గురువారం సందర్శించారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ సైబర్ నేరాలకు దూరంగా ఉంటూ సైబర్ మోసాలపై మీ గ్రామాల్లో, మీ తల్లిదండ్రులకు ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, టెలిగ్రామ్, వాట్సప్‌లో టాస్క్ పేరిట జరిగే ఇన్వెస్టమెంట్ మోసాలతో జాగ్రత్త అవసరమన్నారు. ఇస్ర్ట్రాగామ్ ఫాల్ యూ టూబ్ల్లో లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపించి మోసాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక మొత్తంలో డబ్బులు పెట్టిన తరువాత మోసగాళ్లు మిమ్మల్లి బ్లాక్ చేస్తారన్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్ వంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 1930కి ఫోన్ చేయాలని సూచించారు. అరకులోయ సీఐ ఎల్.హిమగిరి, కళాశాల ప్రిన్స్‌పాల్ సిస్టర్ బిందు, కరస్పాండెంట్ సిస్టర్ రూబి, సిబ్బంది శ్రీను, వెంకటరావు, కృష్ణారావు, లవకుశ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నకిలీ, కల్తీ వస్తువులపై అవగాహన అవసరం జి.మాడుగుల: కల్తీ, నకిలీ వస్తువుల విక్రయాల్లో ,నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయని విద్యార్థులు అవగాహనతో వ్యవరించాలని వినియోగదారులు సంఘం సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కిముడ తెలిపారు.మండల కేంద్రంలో గల ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ వినయోగదారుల హక్కుల దినోత్సవం–2025 సందర్భంగా డిశంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పాఠశాల కన్స్యూమర్ క్లబ్ ఇన్ఛార్జీ కాంగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డిజిటల్ న్యాయం ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం అనే అంశంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పోటీలు నిర్వహణకు డీఈవో డాక్టర్ కె.రామకృష్ణారావు, అన్ని ప్రధానోపాధ్యాయులకు, కళాశాల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వు జారీ చేశారన్నారు. పోటీలకు పాఠశాల విద్యార్థులు ఎల్ఈఏపీ ప్లాట్‌ఫామ్, కళాశాల విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని పాల్గొనవలసినిదిగా ఆయన సూచించారు. -
గిరిజన రైతులకు రుణాలు
ముంచంగిపుట్టు: గిరిజన రైతులకు ధరి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభిమాన్ పథకం ద్వారా రుణాలు కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు ఎన్.కిషోర్ అన్నారు.మండల కేంద్రంలో స్థానిక పశు వైద్యశాలలో ఏడీ కిషోర్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు, సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న పశు వైద్య శిబిరాలు, టీకాల కార్యక్రమాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఏడీ కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ధరి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియన్ పథకం ద్వారా ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల్లో సుమారు 2వేల మంది గిరిజన రైతులను రుణాలు కల్పన కోసం గుర్తించామన్నారు. ఇందులో భాగంగా లక్ష రూపాయాలకు 90శాతం సబ్సిడీతో రుణం అందించనన్నట్టు తెలపారు.గ్రామ సభల ద్వారా రుణాలు మంజూరై కోసం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అటవీ హక్కుల పట్టాలు ఉన్న గిరిజన రైతులకు మాత్రమే రుణాల కల్పన కోపం ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. కిలగాడ, ముంచంగిపుట్టు, జోలాపుట్టు వైద్యశాలల పరిధిలో గ్రామాల్లో టీకాల కార్యక్రమం నిర్వహణపై సిబ్బందికి ఆదేశించామన్నారు. పశువైద్యాధికారి రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల సందర్భంగా చివరి గురువారం పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో శోభారాణి తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే పంచామృతాభిషేక సేవను కూడా రద్దు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత తిరిగి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం టౌన్ కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వద్ద 20 వేల మంది భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా జగదాంబ, కాన్వెంట్ జంక్షన్, వన్‌టౌన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, అదనపు సిబ్బందిని సిద్ధం చేసినట్లు ఈవో తెలిపారు. -
అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
డీపీవో చంద్రశేఖర్చింతూరు: డివిజన్ల అభివృద్ధి కార్యక్రమాలపై చింతూరు, కూనవరం, ఎటపాక, వి.ఆర్.పురం మండలాల అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సకాలంలో ఇంటిపన్నులు వసూలు చేయాలని, సచివాలయ భవనాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం చిడుమూరు పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆయన తడిచెత్త, పొడిచెత్త సేకరణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చిడుమూరులో అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించిన ఆయన వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో విజయ్‌కుమార్, ఎంపీడీవోలు, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పాలకుల నిర్లక్ష్యం
పర్యాటకం అంటే ఒక ప్రాంతం యొక్క సంస్కృతికి అద్దం పట్టే వేదిక. వేలమందికి ఉపాధినిచ్చే జీవనాధారం. కానీ మన పర్యాటక ప్రాంతాల పరిస్థితి చూస్తుంటే, పాలకులకు ఈ రంగంపై ఎందుకంత చిన్నచూపు అనే అనుమానం కలగక మానదు. ఇందుకు చెరువులవేనం, బోడకొండమ్మ వ్యూపాయింట్ల వద్ద అధ్వాన పరిస్థితులు ఉదాహరణగా నిలుస్తున్నాయి. దీంతో విహారయాత్రకు వస్తున్న పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. ఇటువంటి పరిస్థితులకు ముగింపు ఎప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి అందం..చింతపల్లి: పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించినా పనులు అసంపూర్తిగా ఉన్నందున పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాలసముద్రాన్ని తలపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చెరువులవేనం, బోడకొండమ్మ వ్యూపాయింట్లు ప్రధానం. ● లంబసింగి పంచాయతీ పరిధిలో అతి ఎత్తయిన కొండపై మంచు ముసుగులో పాలసముద్రాన్ని తలపించే చెరువులవేనం వ్యూపాయింట్‌కు పర్యాటకులు క్యూకడుతుంటారు. ఈ ప్రాంతానికి కాఫీ తోటలు మధ్యలో రాళ్లు తేలిన మార్గంలో కాలినడకన వ్యయప్రయాసలతో వ్యూపాయింట్‌కు చేరుకునేవారు. దీంతో గత ప్రభుత్వంలో రూ. 20 లక్షలు వెచ్చించి చెరువులవేనంలో వ్యూపాయింట్ నిర్మాణం చేపట్టడంతోపాటు భీమనాపల్లి నుంచి రాకపోకలకు వీలుగా రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో పర్యాటకులు రద్దీ బాగా పెరిగింది. ఐటీడీఏ అనుమతితో పర్యాటకుల నుంచి రుసుం వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్ములో 30 శాతం స్థానిక పంచాయతీకి చెల్లించి మిగిలిన 70 శాతం సొమ్ముతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ● భీమనాపల్లి నుంచి చెరువులవేనం వ్యూపాయింట్ వరకు సుమారు 3 కిలోమీటర్ల పొడవునా గత ప్రభుత్వం కొండలను తొలచి మార్గం ఏర్పాటుచేసింది. ఇందుకు రూ.80 లక్షలు వెచ్చించింది. రక్షణగోడల నిర్మించకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మార్గంలో రాళ్లుదేరడంతో వ్యూపాయింట్‌కు వెళ్లే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ● డౌనూరు–లంబసింగి ఘాట్‌ను ఆనుకుని ఉన్న బోడకొండమ్మ ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం సంకల్పించింది. ఇదే ప్రాంతంలో రూ.40 లక్షలతో వ్యూపాయింట్ నిర్మించింది. పెద్ద ఆర్చ్, టికెట్ కౌంటర్, మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటుచేసింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఆలయం వెనుక బాగాన కొండను చదును చేసింది. ఇదే ప్రాంతంలో సిమెంటు రోడ్డు నిర్మాణం, ర్యాంప్‌కు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.30 లక్షలు మంజూరు అయ్యాయి. వీటిలో రూ.5 లక్షలతో ఆలయం వెనుక భాగంలో కొంతమేర సిమెంటు ర్యాంపు నిర్మాణం చేపట్టారు. మిగతా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి రుసుం వసూలు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం భావించినా ఫలితం లేకపోయింది. నిర్వహణలోపం వల్ల వ్యూపాయింట్ గేటు విరిగిపోయింది. వ్యూపాయింట్లు సిమెంటు రోడ్డు నిర్మించాలిబోడకొండమ్మ ఆలయం వద్ద అందమైన ప్రదేశంలో వ్యూపాయింట్ నిర్మాణం చేపట్టారు. అక్కడికి వెళ్లేందుకు, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందికరంగా ఉంది. సిమెంటు నిర్మాణం వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – మామిడి సుందరరావు, చెరువులవేనం, చింతపల్లి మండలంయువతకు ఉపాధి దూరం బోడకొండమ్మ ఆలయం వద్ద వ్యూపాయింట్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఎటువంటి రుసుం చెల్లించకకుండానే పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి దూరం అయింది. – కొర్రా రఘునాఽథ్, మాజీ సర్పంచ్, లంబసింగినిర్మాణ పనులు చేపడతాంబోడకొండమ్మ ఆలయ ముఖద్వారం నుంచి వ్యూపాయింట్ వరకు సిమెంటు రోడ్డు, అసంపూర్తిగా నిలిచిపోయిన వాహనాల సిమెంట్ ర్యాంపు నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో పనులు చేపేట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. – కిషోర్, జూనియర్ ఇంజినీరు, గిరిజన సంక్షేమశాఖ


