గ్రూప్‌–2 విజేతగుణశేఖర్‌కు సత్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 విజేతగుణశేఖర్‌కు సత్కారం

Feb 5 2026 7:30 AM | Updated on Feb 5 2026 7:30 AM

గ్రూప్‌–2 విజేతగుణశేఖర్‌కు సత్కారం

గ్రూప్‌–2 విజేతగుణశేఖర్‌కు సత్కారం

పెదబయలు: గుల్లేలు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ, గోమంగి పంచాయతీకి అదనపు బాధ్యతలు చూస్తున్న పెనుమాల గుణశేఖర్‌, ఇటీవల విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం స్థాని క మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయనను ఎంపీపీ బొండా వరహాలమ్మ, జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, మండల పరిషత్‌ ఏవో ఎల్‌. పూర్ణ య్య శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన యువత గుణశేఖర్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత గుణశేఖర్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌–2 సాధించడం సంతోషంగా ఉందని, అయితే తన అసలు లక్ష్యం గ్రూప్‌–1 సాధించడమేనని పేర్కొన్నారు. ఎస్‌ఐ వెంకటేష్‌, వైస్‌ ఎంపీపీలు సోనే, కొర్ర రాజుబాబు, ఎంపీటీసీల ఫోరం అ ధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement