శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
● ఎస్పీ అమిత్ బర్దర్
సాక్షి,పాడేరు: జిల్లాలో మావోయిస్టుల కార్యకలపాల నిర్మూలన ,శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేయాలని ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై నేరసమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా గ్రామాల సందర్శన చేపట్టాలన్నారు. బాలికలు, మహిళలకు రక్షణతో పాటు సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలన ముందున్న లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు పంకజ్ కుమార్ మీనా, నవజ్యోతిమిశ్రా, డీఎస్పీలు సాయిప్రశాంత్, ఆర్‌వీవీఎస్ అభిషేక్, బొడ్డు హేమంత్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


