గడ్డివాము, పశువుల పాకలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డివాము, పశువుల పాకలు దగ్ధం

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది

నాతవరం: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మండలంలోని ఎం.బి.పట్నంలో గడ్డివాము, పశువుల పాకలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన వి.రాజుబాబు తన పొలంలో పశువుల మకాం వద్ద గడ్డి వాము, పాకలు వేసుకున్నాడు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం ఎస్‌ఐ అప్పలస్వామి, సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. గడ్డి వాము, పశువుల పాకలు దగ్ధమవడంతో రూ. 50 వేలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement