తాటిచెట్లపాలెం: ఈస్ట్రన్ రైల్వే పరిధిలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను ఏప్రిల్ నుంచి జూన్ 30వ తేదీ వరకు దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు.
● ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో తాంబరం–సిల్‌ఘాట్ టౌన్(15629) నాగోన్ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 3,10,17,24, మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో సిల్‌ఘాట్ టౌన్–తాంబరం(15630) నాగోన్ ఎక్స్‌ప్రెస్‌లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్‌సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
● ఈ నెల 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్ 4,11,18,25వ తేదీల్లో తాంబరం–న్యూ టిన్‌సుకియా (15929) ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 6,13,20,27 మే 4,11,18,25 జూన్ 1,8,15,22,29వ తేదీల్లో న్యూ టిన్‌సుకియా–తాంబరం(15930)ఎక్స్‌ప్రెస్‌లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్‌సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
● ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీలల్లో డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–న్యూ జల్పయ్‌గురి (22611) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల10,17,24 మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో న్యూ జల్పయ్‌గురి–డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22612) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్‌సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
● ఈ నెల 4,11,18,25 మే 2,9,16,23,30 జూన్ 6,13,20,27వ తేదీల్లో ఎస్‌ఎంవీటి బెంగళూరు–కామాఖ్య (12551)ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీల్లో కామాఖ్య– ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12552) ఎక్స్‌ప్రెస్‌లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్‌సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి.


