గిరిజన యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువతి ఆత్మహత్య

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

● దేవరాపల్లికి చెందిన నిందితుడు అరెస్టు ● గత నెల 30న ఆత్మహత్యకు పాల్పడిన గిరిజన యువతి దూసరి లక్ష్మి

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే

దేవరాపల్లి: ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లికి నిరాకరించడంతోనే తీవ్ర మనస్తాపం చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి (22) ఆత్మహత్య చేసుకుంది. దేవరాపల్లిలో గత నెల 30న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తికి చెందిన గిరిజన యువతి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణతో కలిసి అనకాపల్లి ఇన్‌చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి మండలం కొరపర్తి గ్రామానికి చెందిన దూసరి లక్ష్మి దేవరాపల్లిలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. దేవరాపల్లికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కొల్లి లోకేష్‌ (24)కు ఐదేళ్ల క్రితం లక్ష్మితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అయితే ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, నిందితుడు లోకేష్‌ మీది తక్కువ కులం అని, పెళ్లి చేసుకోవడం కుదరదని నిరాకరించాడు. ప్రియుడు నమ్మించి మోసగించడాన్ని తట్టుకోలేని లక్ష్మి తీవ్ర మనస్తాపంతో గత నెల 30న తాను నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దూసరి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గిరిజన యువతిని వంచించి ఆత్మహత్యకు కారకుడైన లోకేష్‌ను రైవాడ జలాశయం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లోకేష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పెళ్లి చేసుకుంటానని మోసగించడానికి సబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఇన్‌చార్జి డీఎస్పీ చెప్పారు . నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement