అచ్యుతాపురం రూరల్: సెజ్ పరిసర ప్రాంతాల్లో కాపర్ వైరు చోరీ చేసిన ఓ వ్యక్తిని అచ్యుతాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో సెజ్ పరిధిలో ఉన్న మెగా ఇంజినీరింగ్ కంపెనీలో రూ.1.50 లక్షల విలువైన వైరును గాజువాకలోని కణితి రోడ్డుకు చెందిన గడ్డిపాటి తిలక్ కుమార్ చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వైరును విక్రయించగా వచ్చిన నగదుతో ఓ కారు కొనుగోలు చేసినట్టు వారు చెప్పారు. ఆ కారులో దర్జాగా వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు వారు తెలిపారు. ఇతనిపై ఇప్పటికే గాజువాక, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.


