విశాఖ వేదికగా నౌకాదళ గర్జన | - | Sakshi
Sakshi News home page

విశాఖ వేదికగా నౌకాదళ గర్జన

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

ఐఎన్‌ఎస్‌ తారాగిరి, అరిధామన్‌లను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి

తారాగిరి వార్‌షిప్‌ని జాతికి అంకితం చేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

మహారాణిపేట(విశాఖ): విశాఖలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన సందర్భంగా భారత నౌకాదళానికి చెందిన కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. ప్రాజెక్ట్‌–17ఏలో భాగమైన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ తారాగిరిని జాతికి అంకితం చేశారు. 75 శాతం పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో అత్యంత రహస్యంగా విశాఖ షిప్‌బిల్డింగ్‌ సెంటర్‌లో అణు శక్తితో నడిచే జలాంతర్గామి అరిధామన్‌ను కూడా నౌకాదళానికి సమర్పించారు. అరిహంత్‌ శ్రేణిలో మూడో ఈ సబ్‌మైరెన్‌ సుమారు 7,000 టన్నుల సామర్థ్యంతో, 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, కే–4 క్షిపణులను మోసుకెళ్లగలదు. దీని ద్వారా భారతదేశం తన ‘న్యూక్లియర్‌ ట్రయాడ్‌’ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పర్యటనలో భాగంగా ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద కేంద్ర మంత్రికి కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌, సీపీ శంఖబ్రత బాగ్చి, కోస్ట్‌గార్డ్‌, నేవీ అధికారులు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement