స్పర్శ కోల్పోయిన విద్యార్థిని కేజీహెచ్‌కు తరలింపు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, ధారకొండ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పూజారి సూరిబాబు బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా కాళ్లు కదపలేక, స్పర్శ కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమాధికారిణి నాగ జయలక్ష్మి, విద్యార్థిని వెంటనే చింతపల్లి తరలించాలని సూచించారు. అక్కడి వైద్యులు విద్యార్థిని పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించాలని సూచించారు. అయితే, సూరిబాబు తల్లిదండ్రులు ఇందుకు మొదట నిరాకరించారు. దీంతో ఏటీడబ్ల్యూవో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, పరిస్థితిని వివరించారు. వారు అంగీకరించడంతో, ఆమె స్వయంగా దగ్గరుండి విద్యార్థిని చింతపల్లి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.


