మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై నెగ్గిన అవిశ్వాసం
మునగపాక: స్థానిక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలపై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నెల 9వ తేదీన మునగపాక ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బోజాలక్ష్మి,చిందాడ దేవీలపై అవిశ్వాసం ప్రకటిస్తూ 11 మంది ఎంపీటీసీలు నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్‌డీవో ఆయిషా అవిశ్వాసంపై సమావేశం నిర్వహించారు. మెజార్టీ సభ్యులు 11 మంది ఎంపీపీతోపాటు వైస్ ఎంపీపీలకు వ్యతిరేకంగా, అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ మునగపాక మండల ఎంపీటీసీ సభ్యులిచ్చిన అవిశ్వాస నోటీసుకు సంబంధించి మండల పరిషత్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గిందన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె తెలిపారు.
మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై నెగ్గిన అవిశ్వాసం


