రాజకీయ కక్షతోనే కంటైనర్ తొలగింపు
గొలుగొండ: ఏటిగైరంపేటలో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న కంటైనర్‌ను కూటమి నేతలు రాజకీయ కక్షతోనే తొలగించారని మండల వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేత పాము అప్పలనాయుడుపై కక్షతో ఇలా చేయడం సరికాదని వారన్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొరుప్రోలు పాణీశాంతారామ్, వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి ఆధ్వర్యంలో మండల వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాము అప్పలనాయుడును పరామర్శించి, కంటైనర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటైనర్‌ను తొలగించడం దారుణమన్నారు. కోర్టు అనుమతితో ఈ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారని, తొలగింపుపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని వారు చెప్పారు. అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, గాదంపాలెం, కొమిర సర్పంచ్‌లు నల్లబెల్లి శ్రీనివాసరావు, అల్లురాజుబాబు, ఏఎల్‌పురం ఎంపీటీసీ సభ్యులు బుల్లిప్రసాద్, సీనియర్ నాయకులు కిలపర్తి పెద్దిరాజు, కొల్లు సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


