యలమంచిలి వైస్‌ ఎంపీపీగా అమ్మాజీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి వైస్‌ ఎంపీపీగా అమ్మాజీ ఎన్నిక

Feb 5 2026 7:30 AM | Updated on Feb 5 2026 7:30 AM

యలమంచిలి వైస్‌ ఎంపీపీగా అమ్మాజీ ఎన్నిక

యలమంచిలి వైస్‌ ఎంపీపీగా అమ్మాజీ ఎన్నిక

యలమంచిలి రూరల్‌: యలమంచిలి మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా ఏటికొప్పాక–1 ఎంపీటీసీ నగిరెడ్డి అమ్మాజీ ఎన్నికయ్యారు.బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో ఎంపీటీసీ సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారి పి.కె.పి.ప్రసాద్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.మొత్తం ఆరుగురు ఎంపీటీసీ సభ్యులకు గాను నలుగురు సభ్యులు ఎంపీపీ రాజాన శేషు,శిలపరశెట్టి ఉమ,బర్రే శివలక్ష్మి మాత్రమే హాజరయ్యారు.వీరిలో ఎంపీపీ రాజాన శేషు నగిరెడ్డి అమ్మాజీని వైస్‌ ఎంపీపీగా ప్రతిపాదించగా శిలపరశెట్టి ఉమ మద్దతిచ్చారు.దీంతో నగిరెడ్డి అమ్మాజీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు పీవో ప్రకటించారు. గెలుపొందినట్టు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేసి,ప్రమాణం చేయించారు.వైస్‌ ఎంపీపీగా ఎన్నికై న అమ్మాజీకి ఎంపీపీ రాజాన శేషు,ఎంపీడీవో కొండలరావు,సిబ్బంది,ఎంపీటీసీలు అభినందనలు తెలిపారు.ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఎం ఉపేంద్ర బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement