భూ సమస్యలే అధికం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలే అధికం

Feb 10 2026 7:36 AM | Updated on Feb 10 2026 7:36 AM

భూ సమ

భూ సమస్యలే అధికం

రెవెన్యూ క్లినిక్‌కు 197,

కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన డీఆర్‌వో సత్యనారాయణరావు

సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

కాళ్లరిగేలా తిరిగినా గోడు వినలేదు...

తుమ్మపాల: భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం–1 , 2 లో నిర్వహించిన పీజీఅర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలలో ఆయనతో పాటు ఎన్‌ఎఓబీ, బిజయూఆర్‌ఎస్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రామమణి, మనోరమలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో 131, రెవిన్యూ క్లినిక్‌లో 197 అర్జీలు మొత్తం – 328 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మెప్మా, ఐసిడీి ఎస్‌ అధికారులు కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి వి.సుధీర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్‌, జిల్లా సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్‌ రాజా పాల్గొన్నారు.

పాఠశాల ఆటస్థలంలో నిర్మాణాలపై నిరసన

పాఠశాల ఆటస్థలంలో నిర్మించే డ్రైనేజీ వాటర్‌ ఫిల్టర్‌ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలంటూ యలమంచిలి మండలం తెరువుపల్లి గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలంతో పాటు గ్రామ అవసరాలకు కూడా వినియోగించుకుంటున్న గ్రౌండ్‌ను కనుమరుగు చేసేవిధంగా గ్రామస్తుల అంగీకారం లేకుండా యలమంచిలి మున్సిపాలిటీ అవసరాలకు వినియోగించడం దారుణమని, పాఠశాలకు చెందిన ఆటస్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ నినాదాలు చేసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అనధికార భూసర్వే పనులపై ఆగ్రహం

రైతులకు కనీస సమాచారం లేకుండా వ్యవసాయ భూముల్లో అధికారులు చేపట్టే అనధికారిక సర్వేను నిలిపివేసి గ్రామాన్ని కాపాడాలంటూ సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే తమ భూముల్లో మూడు రోజులుగా అధికారులు భూ సర్వే పనులు చేస్తున్నారని, అడిగితే ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో ఏపీఐఐసీకి భూములు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామన్నారు. పరిశ్రమలకు గ్రామంలో రైతుల భూములను సేకరించే విధంగా సర్వే చేయడం అన్యాయమని, గ్రామసభ, గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేయకుండా చేపడుతున్న సర్వేను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయం అధారంగా ఉన్న గ్రామస్తుల పొట్ట కొట్టవద్దని, ఏపీఐఐసీకి భూ కేటాయింపులు మరో చోట చేపట్టి మా గ్రామాన్ని విడిచిపెట్టాలంటూ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించారు.

ఆ వీఆర్వోలపై చర్యలు తీసుకోండి...

నిబంధనలకు విరుద్ధంగా సొంత మండలంలోనే విధుల్లో కొనసాగుతున్న ఇద్దరు వీఆర్వోలపై విజిలెన్స్‌ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్‌ బొంతు రమణ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండల స్థిరనివాసులైన జి.సాంబశివరావు, ఎస్‌.సూర్యనారాయణ అనే ఇద్దరు వీఆర్‌వోలు మాకవరపాలెం, రాచపల్లి గ్రామాల్లోనే వీఆర్వోలుగా విధుల్లో కొనసాగుతున్నారని, ప్రభుత్వం చేపట్టే బదిలీలకు విరుద్ధంగా ఇతర చోట్లకు వెళ్లకుండా కొనసాగడం ప్రాథమిక ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు.

చిల్లంగి పేరిట వేధింపులపై ఫిర్యాదు

చెడుపులు చిల్లంగులు చేస్తున్నామంటూ అదేపనిగా దూషించడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాక మండలం టి.సిరసపల్లి గ్రామానికి చెందిన బి.నరేష్‌, మరికొంతమంది కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో అద్దెకు వచ్చి నివాసముంటూ వికలాంగులుగా ఉన్న చిట్టిబోయిన విజయ, కరుణ, వగైరాలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని, అందరిపై పోలీసు కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్‌ చేసి తమకు కాపాడాలని కోరారు.

ఆటస్థలాన్ని కాపాడాలంటూ నిరసన తెలుపుతున్న తెరువుపల్లి గ్రామస్తులు

రాయపుర అగ్రహారం గ్రామస్తుల నిరసన

ఇన్‌కంట్యాక్స్‌ చెల్లిస్తున్నట్టు తప్పుడుగా నమోదైన కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావడం లేదని, తెల్లరేషన్‌ కార్డు ఉన్నప్పటికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ కూడా రాకపోవడంపై కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో అర్జీ చేసేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్ల అర్జీని నమోదు చేయకుండా కలెక్టరేట్‌ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేశారు. అనకాపల్లి మండలం మూలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇల్లా హిమవర్శిని డిగ్రీ, యామిని ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నారు. కూలీపనులు చేసుకుంటు కుటుంబాన్ని నేట్టుకొచ్చే తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న క్రమంలో ఇన్‌కంట్యాక్స్‌ చెల్లిస్తున్నట్టు తప్పుగా నమోదైంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో అప్పును ఆగమేఘాల మీద తీర్చేసినప్పటికీ తప్పుగా నమోదైన ఇన్‌కంట్యాక్స్‌ వివరాలు మాత్రం ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగిపోలేదు. దీంతో అమ్మ ఒడి దగ్గర నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇతరత్రా ఏ ఒక్కపథకంలో వీరికి లబ్ధి చేకూరలేదు. దీనిపై అనేక వినతులు చేస్తున్నా పట్టించుకుని పరిష్కరించే అధికార యాంత్రంగమే లేకపోవడంతో చివరకు కళాశాలకు సెలవు పెట్టి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలెక్టరేట్‌కు వచ్చారు. కూలీపనులు చేసుకుంటూ తమను పోషిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న తమకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్‌కు తమ బాధ చెప్పుకుందామని వస్తే మీ అర్జీ తహసీల్దార్‌ వద్ద పెండింగ్‌లో ఉందంటూ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేయడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు.

– ఇల్లా హిమవర్శిని, యామిని

పీజీఆర్‌ఎస్‌కు 131 అర్జీలు

ఎస్పీ కార్యాలయానికి 55 అర్జీలు

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 55 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏఎస్పీ తెలిపారు. భూ తగాదాలకు సంబంధించి 25, కుటుంబ కలహాలపై 2, మోసపూరిత వ్యవ హారాలపై 4, ఇతరత్రా 24 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జి.విశ్వనాథం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

భూ సమస్యలే అధికం 1
1/4

భూ సమస్యలే అధికం

భూ సమస్యలే అధికం 2
2/4

భూ సమస్యలే అధికం

భూ సమస్యలే అధికం 3
3/4

భూ సమస్యలే అధికం

భూ సమస్యలే అధికం 4
4/4

భూ సమస్యలే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement