బంగారుమెట్టలో కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం
బుచ్చెయ్యపేట : బంగారుమెట్ట,లోపూడి గ్రామాల మధ్య మిరాశలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు తోటలు కాలిపోయాయి. విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోటలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో బంగారుమెట్టకు చెందిన జక్కా చిన్నారావు, వేచలపు చినతల్లికి చెందిన సరుగుడు తోటతో పాటు విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోట కాలిపోయాయి. సుమారు రూ.రెండు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది గంగరాజు, శివయ్యనాయుడు, రాజు, అర్జున మంటలను అదుపు చేశారు.


