ఎమ్మెల్యే మత్స్యలింగంకుమారుడి వివాహానికి ఆహ్వానం
● జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన కుమారుడు రేగం చాణక్య వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందజేశారు. గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేయగా, దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారు. వివాహ మహోత్సవానికి తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ కుటుంబంపై మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా జగన్‌ను ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు (వరుడు) రేగం చాణక్య ఉన్నారు.


