డిగ్రీ అధ్యాపకుడికి ప్రశంస
మాడుగుల: స్థానిక డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పులపర్తి పైడిరాజు మహాభారతంలోని భీష్మపర్వంపై ఉపన్యాసించి ప్రశంసలందుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన జాతీయ తెలుగు భాషా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఈ నెల 5, 6వ తేదీల్లో జాతీయ తెలుగు భాషా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భారతీయ జ్ఞాన పరంపర, తెలుగు సాహిత్యం అనే అంశంపై ఆయన ఉపన్యాసించారు. ఈ మేరకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, డైరెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పైడిరాజును అభినందించారు.


