మహిళా రైతుకు పాము కాటు
108 వాహనంలో బాధిత మహిళను సీహెచ్‌సీకి తరలిస్తున్న వైద్య సిబ్బంది
దేవరాపల్లి: మండలంలోని వాకపల్లిలో శుక్రవారం ఓ మహిళా రైతు పాము కాటుకు గురైంది. గ్రామానికి చెందిన రాణం సత్యవతి రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలోకి వెళ్లింది. అక్కడ చెరకు తోట పనులు చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే స్థానికులు వేచలం పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, అక్కడ వైద్యుడు రమేష్‌బాబు ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.


