కార్డుదారులకుబియ్యం పంపిణీ | - | Sakshi
Sakshi News home page

కార్డుదారులకుబియ్యం పంపిణీ

Feb 5 2026 7:30 AM | Updated on Feb 5 2026 7:30 AM

కార్డ

కార్డుదారులకుబియ్యం పంపిణీ

పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ పరిధిలో ఉన్న పెదబయలు డీఆర్‌ డిపోలో బుధవారం ఉదయం నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టారు. మండల సివిల్‌ సప్లై గోదాం ఇన్‌చార్జ్‌, మండల ఆర్‌ఐ వి.పూర్ణయ్య పర్యవేక్షణలో లబ్ధిదారులకు ఈ పంపిణీ జరిగింది. ఈ నెల 4న ’సాక్షి’లో ప్రచురితమైన ‘రేషన్‌ కోసం నిరీక్షణ.. తెరుచుకోని పెదబయలు డీఆర్‌ డిపో’ అనే కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు స్థానిక సేల్స్‌మెన్‌ కొర్ర ఆనందరావు, ఇతర సిబ్బంది ద్వారా కార్డుదారులకు బియ్యం అందజేశారు. డిపో పరిధిలోని కార్డుదారులందరికీ రేషన్‌ సరకులు అందుబాటులో ఉన్నాయని, అందరూ వచ్చి తమ సరకులు తీసుకోవాలని అధికారులు సూచించారు.

కార్డుదారులకుబియ్యం పంపిణీ
1
1/1

కార్డుదారులకుబియ్యం పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement