కేంద్ర బడ్జెట్‌పై అవగాహనకు క్విజ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌పై అవగాహనకు క్విజ్‌ పోటీలు

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

కేంద్ర బడ్జెట్‌పై అవగాహనకు క్విజ్‌ పోటీలు

కేంద్ర బడ్జెట్‌పై అవగాహనకు క్విజ్‌ పోటీలు

● విశాఖ జిల్లా మై భారత డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్వరరావు

● విశాఖ జిల్లా మై భారత డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్వరరావు

అరకులోయటౌన్‌: కేంద్ర బడ్జెట్‌పై యువత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా మై భారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, మై భారత్‌ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌పై యువతకు అవగాహన కల్పించేందుకు మేరా యువభారత్‌ జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయి లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి విజేతలు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.భరత్‌ కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాల్లో యువత పాత్రను కీలకం చేస్తూ మైభారత్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు పి.నాగబాబు, వై.విజయలక్ష్మి, ఎం.అనిత కుమారి మాట్లాడుతూ మై భారత్‌ బడ్జెట్‌ క్విజ్‌ 2026 మొదట ఆన్‌లైన్‌ ద్వారా మొదలవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement