కార్పొరేట్ కంపెనీల కోసమే లేబర్ కోడ్‌లు
సాక్షి,పాడేరు: ఈనెల 12వతేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నేత, ఉత్తరాంఽధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజాశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పీఎంఆర్‌సీ భవనంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా లేబర్ కోడ్‌లను తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈలేబర్ కోడ్‌లు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లు లాభాలు మిగిల్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. లేబర్ కోడ్‌లను జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశం అనంతరం బైక్ ప్రచార ర్యాలీని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ జెండా ఊపి ప్రారంభించారు.సీఐటీయూ జిల్లా నేతలు ఎల్.సుందర్రావు, పోతురాజు, పలు ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు చిన్నారి, రేణుక, కాంతమ్మ, రత్నాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర నేత, ఉత్తరాంఽధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజాశర్మ


