వినతుల పరిష్కారం వేగవంతం | - | Sakshi
Sakshi News home page

వినతుల పరిష్కారం వేగవంతం

Feb 7 2026 9:51 AM | Updated on Feb 7 2026 9:51 AM

వినతుల పరిష్కారం వేగవంతం

వినతుల పరిష్కారం వేగవంతం

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌

పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన, ట్రైనీ డీఎఫ్‌వో చిదానందం, ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు 137 వినతులను స్వీకరించారు. వీటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అర్జీలను పరిష్కరించుకోవచ్చన్నారు. అర్జీదారులు మీకోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా భూగర్భ జల డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి మోహన్‌, కాఫీ బోర్డు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొంజుబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ నాగేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి రమణరావు, డీపీవో చంద్రశేఖర్‌, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్‌, డీఎల్‌డీవో జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement