పర్యాటక ప్రాంతంగా గుర్రాయి జలపాతం
సందర్శించిన ఇంజినీరింగ్ అధికారులు
జి.మాడుగుల: ప్రకృతి అందాల నడుమ ఆకట్టుకుంటున్న గుర్రాయి జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మండలంలో కుంబిడిసింగి పంచాయతీలో గల ఈ జలపాతాన్ని సోమవారం టూరిజం పాడేరు టీడబ్ల్యూ ఇంజినీరింగ్ అధికారులు, సర్పంచ్ కృష్ణమూర్తి సందర్శించారు. జలపాత ప్రాంతం, పరిసర ప్రాంతాల అభివృద్ధిపై సర్పంచ్‌తో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. జలపాతానికి రోడ్డు, పర్యాటకులకు సౌకర్యాలు,వాహనాల పార్కిగ్, ఇతర వసతుల గురించి పరిశీలించారు. జలపాతాన్ని అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్పంచ్ కృష్ణమూర్తి అధికారులకు తెలిపారు.


