నేడు అరకు ఆర్‌ఐటీఐలో మెగా జాబ్‌మేళా
పాడేరు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో అరకువ్యాలీ ఆర్‌ఐటీఐ కళాశాలలో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మెగా జాబ్‌మేళా జరుగుతుందని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు జాబ్‌మేళా పోస్టర్లను కలెక్టర్‌తోపాటు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ రోహిణి ఆవిష్కరించారు.
జాబ్‌మేళాలో అపోలో ఫార్మసీ, నవతా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, ముత్తూట్ ఫైనాన్స్, ఫ్లిప్‌కార్ట్, వరుణ్ మోటర్స్, తదితర పది కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఆపై చదువులు చదువుకున్న నిరుద్యోగ యువత ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, పాన్‌కార్డు జెరాక్స్ కాఫీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9491057527, 6302636174లలో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.


