కోడి పందాలపై పోలీసుల దాడి
బుచ్చెయ్యపేట: రాజాం గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం గ్రామంలో పండగ సందర్భంగా నూకాలతల్లి గుడి వెనుక జరుగుతున్న కోడి పందాలపై ఎస్‌ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను, రెండు కోడి పుంజులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న రూ, 1,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. గ్రామదేవతల పండగల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయా గ్రామాల నాయకులు పోలీసులకు సహకరించాల ని అన్నారు.


