లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం | - | Sakshi
Sakshi News home page

లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం

Feb 10 2026 7:36 AM | Updated on Feb 10 2026 7:36 AM

లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం

లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం

● ప్రజలకు సమాధానం చెప్పలేక దుష్ప్రచారం ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం

నక్కపల్లి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ, సిట్‌ నివేదికలు స్పష్టం చేయడంతో చంద్రబాబు, లోకేష్‌ పవన్‌కల్యాణ్‌ ప్రజలకు సమాధానం చెప్పలేక సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా ద్వారా ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీతంపాలెంలో మాట్లాడుతూ గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ, హర్యానాలో ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌లో పరీక్షించి నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలవలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం మానుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు ట్యాంకర్లలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ ఉందని 2024 జూలై 17న నివేదిక వచ్చిందని అప్పటి ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే, అదే ట్యాంకర్లలో నెయ్యి తిరిగి ఏఆర్‌ డెయిరీకి వెళ్లకుండా వైష్ణవి డైయిరీకి వెళ్లి పేరు మార్చి మళ్లీ తిరుమలకు ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఇదే నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వినియోగించారని సుప్రీం కోర్టులో సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిందన్నారు. అల్ఫా మిల్క్‌లో ప్రమాణాలు సరిగ్గా లేవని కేసులు నమోదు చేసిందన్నారు. అదే ఆల్ఫా మిల్క్‌ కంపెనీకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాలని ప్రస్తుత చైర్మన్‌ బీఆర్‌నాయడు రూ.245 కోట్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చారన్నారు. తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసి వాటిని అప్పటి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌పై తోసేసి రాత్రికి రాత్రే అతనిని బదిలీ చేసిందన్నారు. అతనితోపాటు శ్యామలరావులను ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌ ప్రజలు పూర్తిగా తెలుసుకునేలోపు వారిలో విష ప్రచారం ఎక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టడం, యూట్యూబ్‌ చానళ్ల ద్వారా గత ప్రభుత్వంపైన అప్పటి చైర్మన్‌ సుబ్బారెడ్డిపైన తప్పుడు ప్రచారం చేసి తిరుమల ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. దీని కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల్లోకి రాలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసి అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై భౌతిక దాడులకు పాల్పడి అరెస్టు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీటీసీ గొర్ల గోవిందు, సర్పంచ్‌లు వెదుళ్ల వెంకటరమణ, నాగఅప్పలరాజు, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement