ఏపీఎన్‌జీజీవో ఉపాధ్యక్షుడిగా రవిశంకర్
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. ఈ ఎన్నికల్లో విశాఖకు చెందిన ఆర్.రవిశంకర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. గతంలో ఆయన విశాఖ జిల్లా ఎన్‌జీజీవో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్, కార్యదర్శిగా డి.వి.రమణ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న రవిశంకర్‌ను పలువురు ఉద్యోగ సంఘ నేతలు అభినందించారు.


