ప్రకృతి సెగ | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సెగ

Feb 8 2026 4:09 AM | Updated on Feb 8 2026 4:09 AM

ప్రకృ

ప్రకృతి సెగ

న్యూస్‌రీల్‌

ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మిరియం సాగు ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పూత దశలోనే పంట దెబ్బతిని, దిగుబడి భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రూ.లక్షల్లో ఆదాయం చూసిన రైతులు, ఈసారి కనీస పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
మిరియం రైతుకు

ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

విజృంభిస్తున్న శీతల గాలులు

కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు, శీతల గాలులు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. శనివారం అరకువ్యాలీలో 7.8 డిగ్రీలు, చింతపల్లిలో 8.2 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. హకుంపేటలో 8.2 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 8.9 డిగ్రీలు, పెదబయలులో 9.2 డిగ్రీలు, జి.మాడుగులలో 11.5 డిగ్రీలు, కొయ్యూరులో 12.7 డిగ్రీలు, అనంతగిరిలో 16.2 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.

పూత సమయంలో కానరాని వర్షాలు పాదులకు గణనీయంగా తగ్గిన కాపు

ఎకరాకు 50 కిలోలు కష్టమే గతేడాది రూ.లక్షల్లో ఆదాయం ఈ ఏడాది భారీగా గండి

సాక్షి, పాడేరు: ఏటా గిరిజన రైతులకు సిరులు కురిపించే మిరియం దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. తోటల్లోని పాదులకు అక్కడక్కడ మాత్రమే గుత్తులు కనిపిస్తుండటంతో, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటల మధ్య అంతరపంటగా మిరియం సాగవుతోంది. గతంలో ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేదని, ఈసారి మాత్రం రూ. 20 వేలకు మించి వచ్చేలా లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.

జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్నా..

గిరిజన రైతులు సాగు చేసే మిరియాలకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. సాధారణంగా ఎకరాకు 150 నుంచి 200 కిలోల వరకు ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. గత ఏడాది దిగుబడి బాగుండటంతో, కిలో మిరియాలు రూ. 600 నుండి రూ. 700 వరకు పలికాయి. దీనితో ఎకరాకు సుమారు రూ. 1.5 లక్షల వరకు ఆదాయం లభించిందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది కాపు భారీగా తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

పూత సమయంలో వర్షాల్లేక..

మిరియం పాదులు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గిరిజన రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీని ప్రభావం పూతపై పడటంతో దిగుబడి క్షీణించింది. గత ఏడాది మిరియం గుత్తులతో కళకళలాడిన తోటలన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.

మోదాపల్లి ప్రాంతంలో పాదులకు కనిపించని మిరియం గుత్తులు

రక్తదాన శిబిరం రేపు

జి.మాడుగుల: స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఈ నెల 9న (సోమవారం) రెడ్‌ క్రాస్‌ సౌజన్యంతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పాల్గొనాలని ఆయన కోరారు.

ఐదు ఎకరాల కాఫీ తోటలో మిరియం పాదులు ఉన్నాయి. ఏటా దిగుబడి ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది పూత తక్కువగా ఉంది. అందువల్ల కాపు కూడా బాగా తగ్గింది. అరకు, పాడేరు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఆదాయంపై చూపుతుంది.

– పాలికి లక్కు, గిరిజన ౖరైతు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం

ప్రకృతి సెగ1
1/3

ప్రకృతి సెగ

ప్రకృతి సెగ2
2/3

ప్రకృతి సెగ

ప్రకృతి సెగ3
3/3

ప్రకృతి సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement