రివ్వున వైద్యసేవలు
కొండ కోనల్లో వేగంగా వైద్య పరీక్షలు
ముంచంగిపుట్టులో డ్రోన్ వినియోగం
కేవలం రెండు గంటల్లో
రక్త పరీక్షల రిపోర్టులు
గిరిజన ప్రాంతాల్లో సాంకేతిక విప్లవం
ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. మండల కేంద్రంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద అత్యవసర రక్త నమూనాల సేకరణ కోసం వస్తున్న డ్రోన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
సమయం ఆదా.. వేగంగా వైద్య పరీక్షలు
గత వారం రోజులుగా ఈ డ్రోన్ ముంచంగిపుట్టు నుంచి పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రి మధ్య నిరంతరాయంగా సేవలందిస్తోంది. రోజుకు మూడు, నాలుగు సార్లు రాకపోకలు సాగిస్తూ సీహెచ్‌సీలో సేకరించిన రక్త నమూనాలను వేగంగా పాడేరు ఆసుపత్రికి చేరవేస్తోంది. అక్కడి నుంచి అత్యవసర మందులను తీసుకువస్తోంది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే రక్త పరీక్షల రిపోర్టులను తిరిగి సీహెచ్‌సీకి చేరవేస్తూ రోగులకు సత్వర వైద్యం అందేలా చేస్తోంది.
వారపు సంతలో ప్రత్యేక ఆకర్షణ
శనివారం మండల కేంద్రంలో వారపు సంత కావడంతో పరిసర ప్రాంతాల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఆకాశంలో రివ్వున ఎగురుతున్న డ్రోన్‌ను చూసి ఆశ్చర్యపోయిన జనం, అది నేరుగా సీహెచ్‌సీ వద్ద దిగడాన్ని చూసి ఆసక్తితో అక్కడికి పరుగులు తీశారు. సాంకేతికత సాయంతో వైద్య సేవలు ఇంత వేగంగా అందుతుండటం చూసి గిరిజనులు విస్తుపోతున్నారు.
రివ్వున వైద్యసేవలు


