ప్రగతి దారులు | - | Sakshi
Sakshi News home page

ప్రగతి దారులు

Feb 9 2026 7:39 AM | Updated on Feb 9 2026 7:39 AM

ప్రగత

ప్రగతి దారులు

కొండకోనల్లో
కొండకోనల మధ్య ఉండే గిరిజన పల్లెలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రవాణా కష్టాల నుంచి విముక్తి లభించింది. రూ. కోట్ల వ్యయంతో నిర్మించిన జోడిగుడ– చటువా, లోగిలి, సంపంగి గెడ్డ వంతెనలతో పాటు అంతర్రాష్ట్ర రహదారులు అందుబాటులోకి రావడంతో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. హుద్‌హుద్‌ వంటి విపత్తులు మిగిల్చిన గాయాలను మాన్పుతూ, ప్రజల సౌకర్యార్థం పక్కా ప్రణాళికతో ఈ పనులు పూర్తి చేశారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మించిన కండ్రుమ్‌– సర్రయి వంతెన

లోగిలిలో పూర్తయిన వంతెన

డుంబ్రిగుడ: మండల గిరిజనుల దశాబ్దాల కల నెరవేరింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ప్రత్యేక చొరవతో చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణం ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేసింది. ముఖ్యంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దులను కలుపుతూ సాగిన ఈ అభివృద్ధి పనులపై స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన అభివృద్ధి పనులివే..

జోడిగుడ – చటువా వంతెన: కండ్రుమ్‌ పంచాయతీ పరిధిలోని గుంటసీమ వీజే రోడ్డు నుంచి కండ్రుమ్‌, సర్రాయి మీదుగా జోడిగుడ, చటువా వద్ద పీఎంజీఎస్‌వై నిధులు రూ.5.80 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇది ఆంధ్ర – ఒడిశా సరిహద్దు గ్రామాల మధ్య కీలక అనుసంధానకర్తగా మారింది.

లోగిలి వంతెన: 2014 హుద్‌హుద్‌ తుపాను ధాటికి కొట్టుకుపోయిన ఈ వంతెన లేక గిరిజనులు పదేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1.80 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయడంతో, మార్చి 13, 2024న ఇది ప్రారంభమైంది. దీనివల్ల గసభ, సొవ్వా పంచాయతీలతో పాటు ఒడిశా ప్రజలకు సైతం రవాణా సౌకర్యం మెరుగుపడింది.

సంపంగి గెడ్డ వంతెన: కితలంగి, కించుమండ పంచాయతీల పరిధిలోని 18 గ్రామాల ప్రజల కష్టాలను గుర్తించి, రూ.4.40 కోట్లతో సంపంగి గెడ్డ వద్ద వంతెనను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ శంకుస్థాపన చేసిన ఈ వంతెన పూర్తికావడంతో అరకులోయ, అనంతగిరి మండల వాసులకు ప్రయాణం సులువైంది.

అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం: అరకు రోడ్డు నుంచి కొర్రయి, కొల్లాపుట్టు మీదుగా బొడ్డలమామిడి వరకు 10.50 కిలోమీటర్ల మేర తారు రోడ్డును, 14 కల్వర్టులను నిర్మించారు. ఈ రహదారి ద్వారా ఒడిశాలోని పుక్కలి, పొట్టంగి, జైపూర్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ వరకు రవాణా అనుసంధానం ఏర్పడటం విశేషం.

కిలోగుడ జంక్షన్‌ – చమడపాడు రోడ్డు: సాగర పంచాయతీ కిలోగుడ జంక్షన్‌ నుంచి టిక్కిటిబెడ్డ, కమలబంద, సొవ్వా మీదుగా చమడపాడు వరకు 22 కిలోమీటర్ల పొడవైన తారు రోడ్డును పీఎంజీఎస్‌వై నిధులు రూ.11.50 కోట్లతో నిర్మించి గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు.

ప్రాణభయం తప్పింది

సంపంగి గెడ్డపై వంతెన లేక గతంలో చాలా మంది గిరిజనులు గెడ్డలో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వంతెన ఏర్పాటు నిధులు మంజూరు చే యించారు. వంతెన నిర్మించడంతో సమస్య తీరింది.

– వరబోయిన సుబ్బారావు, సర్పంచ్‌, కితలంగి

వంతెన కష్టాలు తీరాయి

లోగిలి వంతెన కూలిపోవడంతో పదేళ్లుగా ఇబ్బందులు పడ్డాం. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంతెన నిర్మించారు. రోగాలకు గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లే మార్గం లేకుండా ఉండేది. ఇప్పుడు కష్టాలు తీరాయి.

– వంతాల జెమ్మ, ఎంపీటీసీ, గసభ

గత ప్రభుత్వానికిరుణపడి ఉంటాం

సుమారు రూ.కోట్ల నిధులు వెచ్చించి వంతెన నిర్మించడంతో రవాణా కష్టాలు తీరాయి. సమస్య పరిష్కరించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటాం. ఇదే పెద్ద వంతెన కావడం అదృష్టంగా భావిస్తున్నాం.

– శెట్టి ఆనందరావు, ఎంపీటీసీ, కండ్రుమ్‌

జగనన్న పాలనలో డుంబ్రిగుడకు

దక్కిన రవాణా విప్లవం

దశాబ్దాల కష్టానికి చెక్‌

రూ. కోట్ల నిధులతో నిర్మించిన

వంతెనలు, అంతర్రాష్ట్ర రహదారులు

గిరిజన పల్లెల్లో వెలుగులు నింపిన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

ప్రగతి దారులు1
1/5

ప్రగతి దారులు

ప్రగతి దారులు2
2/5

ప్రగతి దారులు

ప్రగతి దారులు3
3/5

ప్రగతి దారులు

ప్రగతి దారులు4
4/5

ప్రగతి దారులు

ప్రగతి దారులు5
5/5

ప్రగతి దారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement