ఉపాధి పథకం పరిరక్షణకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పథకం పరిరక్షణకు పోరాటం

Feb 9 2026 7:39 AM | Updated on Feb 9 2026 7:39 AM

ఉపాధి పథకం పరిరక్షణకు పోరాటం

ఉపాధి పథకం పరిరక్షణకు పోరాటం

● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిఉమామహేశ్వరరావు

● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిఉమామహేశ్వరరావు

పాడేరు రూరల్‌: ఉపాధి హమీ పథకం పరిరక్షణకు అందరూ కలిసి పోరాడుదామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఈనెల 12న జరగనున్న కార్మిక సంఘాల సమ్మెకు సంబంధించి పోస్టర్లను ఆదివారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకై నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె విజయవంతానికి అనివర్గాల కార్మిక సంఘాలు తరలి రావాలన్నారు. ఇప్పటికే కార్మికుల హక్కుల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబ్‌ కోడ్‌లు తక్షణం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్‌, కోశాధికారి పోతురాజు, సహాయ కార్యదర్శి సుందర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement