హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన
సింహాచలం: అడవివరంలోని సింహాద్రిమఠం ఆధ్వర్యంలో అల్లూరిజిల్లా హుకుంపేటలో ఆదివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి సహస్రనామార్చన పూజ పెద్ద ఎత్తున నిర్వహించారు. 896 మంది గిరిజనులు ఈ పూజలో పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం రిటైర్డ్ ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఈ పూజని నిర్వహించారు. 1001 నామాలతో స్వామికి అర్చన చేశారు. పూజలో పాల్గొన్న గిరిజనులకు సింహాద్రిమఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి లక్ష్మీదేవి సహిత శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు ఉచితంగా అందజేశారు.


