అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’ | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’

Feb 9 2026 7:39 AM | Updated on Feb 9 2026 7:39 AM

అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’

అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’

తగరపువలస: మండలంలోని గంభీరం ఐఐఎంవీ రోడ్డులో ఉన్న హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం ‘శ్రీకృష్ణ అర్పణం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్‌ మోహనుల మందిరంలో జరిగిన ఈ వేడుకలో చైతన్య డాన్స్‌ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ లీలలు’ నృత్య రూపకం భక్తులను అలరించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బుక్కపట్నం ఇందిర, లీలభాను, పూజిత, శాంతిప్రియ తదితర చిన్నారులను హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement