చింతపల్లిలో తగ్గిన ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

చింతపల్లిలో తగ్గిన ఉష్ణోగ్రతలు

Feb 9 2026 7:39 AM | Updated on Feb 9 2026 7:39 AM

చింతపల్లిలో తగ్గిన ఉష్ణోగ్రతలు

చింతపల్లిలో తగ్గిన ఉష్ణోగ్రతలు

7.5 డిగ్రీల నమోదు

చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మంచు, చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం చింతపల్లిలో 7.5 డిగ్రీలు, అరకువేలీలో 7.8 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో హకుంపేటలో 8.2 డిగ్రీలు, ముంచంగిపుట్లులో 8.9 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీలు, జి.మాడుగులలో 11.5 డిగ్రీలు,,కొయ్యూరులో 12.7 డిగ్రీలు, అనంతగిరిలో 16.6 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement