వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ

Feb 4 2026 7:17 AM | Updated on Feb 4 2026 7:17 AM

వైభవం

వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ

చోడవరం: పరదేశమ్మ అమ్మవారి పండగ మంగళవారం ఘనంగా జరిగింది. 14గ్రామాల ప్రజలు తమ గ్రామదేవతగా పరదేశమ్మను కొలుస్తారు. గోవాడ, దుడ్డుపాలెం, కన్నంపాలెం, రామజోగిపాలెం, బెన్నవోలు, చాకిపల్లి, పీఎస్‌పేట, గంధవరం, కొత్తపల్లితోపాటు పలు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన పరదేశమ్మ అమ్మవారి పండగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేకపూజలు చేశారు. గోవాడలో సర్పంచ్‌, వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం కనులపండువగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడాని పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం సాయంత్రం తీర్థం జరిగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక విద్యుత్‌ దీపాలంకరణ అందర్నీ ఆకట్టుకుంది.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థం

రావికమతం: మండలంలోని కొత్తకోటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గుర్రపు పందాలు,ముగ్గుల పోటీలు నిర్వహించారు.గుర్రపు పోటీలను గ్రామ సర్పంచ్‌ కోన లోవరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ గుమ్ముడు సత్యదేవ తదితరులు ప్రారంభించారు.గ్రామ సర్పంచ్‌ కోన లోవరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ గుమ్ముడి సత్యదేవా తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు.

వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ 1
1/1

వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement